రిఫ్రిజరేటర్ లేదా ఫ్రిజ్ ఇపుడు అందరి ఇళ్లల్లోనూ ఒక అవసరంగా మారిపోయింది. పాలు, పెరుగు, ఆకు కూరలు, కూరగాయలు, పండ్లతోపాటు వండిన పదార్థాలను పాడుకాకుండా, తాజాగా ఉంచేందుకు ఫ్రిజ్‌ను వాడతాం. మరి ఫ్రిజ్ శుభ్రత గురించి ఎపుడైనా ఆలోచించారా? ఫ్రిజ్‌లో బాక్టీరియా పేరుకుపోకుండా, మన ఆహారం శుభ్రంగా ఉండాలంటే ఏం చేయాలి? ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి? తెలుసుకుందాం.
వారాలు, నెలల తరబడి ఫ్రిజ్‌ను శుభ్రం చేయకపోతే దుర్వాసన వస్తుంది. ఆహారం త్వరగా పాడవుతుంది. అలాగే రిఫ్రిజిరేటర్ బయటినుంచి కూడా క్లీన్‌గా కనిపించేలా జాగ్రత్తపడాలి.
రిఫ్రిజిరేటర్‌ను ఎలా శుభ్రం చేయాలి?
ముందు రిఫ్రిజిరేటర్‌ను ఆఫ్ చేసి, ప్లగ్ తీసి పక్కన బెట్టాలి. ఇలా చేయడం వల్ల షాక్ కొట్టకుండా ఉంటుంది.
కఠినమైన రసాయనాలు వాడాల్సిన అవసరం లేదు. బేకింగ్ సోడా, వైట్ వెనిగర్, డిష్ సోప్‌తో శుభ్రం చేసుకోవచ్చు.
ఫ్రిజ్ షెల్ఫ్‌లు, ఇతర డిటాచ్‌బుల్ డ్రాయర్లను, గ్లాసు ట్రే, ఎగ్ ట్రేలను తొలగించి బయట శుభ్రం చేసుకొని పొడి గుట్టతో తుడిచేయాలి. ఫ్రిజ్‌లో అమర్చేముందు వీటిపై ఆల్కహాల్ రుద్దితే కనిపించని బ్యాక్టీరియా కూడా పూర్తిగా పోతుంది.
అవసరమైతేనే డీప్ ఫ్రిజ్‌ను డి-ఫ్రాస్ట్ చేయాలి. లేదంటే ఆ ఏరియా వరకు క్లీన్ చేసుకోవచ్చు. పాడైపోయిన, డేట్ ముగిసిన పదార్థాలను పారేయ్యాలి.
ఫ్రిజ్ డోర్‌కి ఉండే గాస్కెట్ సందుల్లో మురికి పేరుకుపోతుంది. దీన్ని కూడా జాగ్రత్తగా శుభ్రం చేయాలి. బయట కూడా డిష్ వాష్ లిక్విడ్‌లో ముంచిన స్పాంజి సాయంతో మురికి, మరకలు పోయేలా శుభ్రం చేసి, ఆ తరువాత మెత్తని పొడిగుట్టతోతుడిస్తే తళ తళ కొత్తదానిలా మెరుస్తుంది. ఫ్రిజ్‌లోని వస్తువులు ముట్టుకుంటే పడిపోయేలాగా కాకుండా, చిన్న చిన్న కంటైనర్లలో పళ్లు, కూరలు, తదితరాలను పొందికగా అమర్చుకోవాలి.
Comments
Please login to add a commentAdd a comment