ఇంటిప్స్
కూరగాయలు కిచెన్ ప్లాట్‌ఫామ్ మీద గాని, మార్బుల్ మీద గాని కట్ చేయడం వల్ల చాకులు పదును కోల్పోయి మొండిగా అవుతాయి. చెక్క మీద కట్ చేస్తే ఈ సమస్య రాదు.కొత్తిమీరని పలుచని క్లాత్‌లో చుట్టి రిఫ్రిజిరేటర్‌లో భద్రపరిస్తే ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది. ఉల్లిపాయలను నీటిలో 10 నిమిషాలు నానబెట్టిన తరవాత కట్ చేయాలి. ఇలా చేయడం వల్ల ఉల్లిపాయ తరిగేటప్పుడు కంటి నుండి నీరు కారదు.