Ice cream maker
-
హ్యావ్మోర్లో లాటీ పెట్టుబడులు
న్యూఢిల్లీ: దేశీ యూనిట్లో దక్షిణ కొరియా దిగ్గజం లాటీ కన్ఫెక్షనరీ ఇన్వెస్ట్ చేయనున్నట్లు హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్ తాజాగా పేర్కొంది. రానున్న ఐదేళ్లలో లాటీ రూ. 450 కోట్ల పెట్టుబడులు వెచ్చించనుందంటూ హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్ ఎండీ కోమల్ ఆనంద్ వెల్లడించారు. ఈ నిధులను ప్రధానంగా పుణేలోని ఎంఐడీసీ తాలెగావ్‌లో కొత్త ప్లాంటు ఏర్పాటుతోపాటు, ఫరీదాబాద్ యూనిట్లో ఐస్ క్రీమ్ తయారీని విస్తరించేందుకు వినియోగించనున్నట్లు పేర్కొన్నారు. వీటితోపాటు సరఫరా చైన్, ఆన్ గో–టు–మార్కెట్ అంశాలకూ వెచ్చించనున్నట్లు తెలియజేశారు. తాలెగావ్ ప్లాంటు 2024 నాలుగో త్రైమాసికంలో అందుబాటులోకి రానున్నట్లు తెలుస్తోంది. ఇక్కడ లాటీ శ్రేణిలోని ప్రీమియం ఐస్ క్రీములను తయారు చేయ నున్నారు. 2017 డిసెంబర్లో హ్యావ్‌మోర్ ఐస్ క్రీమ్‌ను రూ. 1,000 కోట్లకు లాటీ కన్ఫెక్షనరీ కొనుగోలు చేసింది. అయితే దేశీయంగా అందుబాటు ధరల బ్రాండుగా హ్యావ్‌మోర్‌ను విస్తరిస్తూ వచ్చింది. తాజాగా లాటీ బ్రాండుతో ప్రీమియం శ్రేణి ఐస్ క్రీములను ప్రవేశపెట్టనుంది. 60,000 చదరపు మీటర్లలో ఏర్పాటు చేస్తున్న తాలెగావ్ ప్లాంటులో 1,000 మందికి ఉపాధి కల్పించనున్నట్లు ఆనంద్ తెలియజేశారు. -
ఇంట్లోనే నిమిషాల్లో ఐస్‌క్రీమ్‌లు తయారు చేసుకోవచ్చు.. ధర ఎంతంటే!
చల్లగా, తియ్యగా, కమ్మగా.. రకరకాల ఫ్లేవర్స్‌లో దొరికే ఐస్‌క్రీమ్ అంటే చప్పరించని వారెవరు? మరి అలాంటి ఐస్‌క్రీమ్‌ని మళ్లీమళ్లీ లాగించాలంటే ఇలాంటి మెషిన్ ఇంట్లో ఉండాల్సిందే. ఇందులో చాలా రకాల ఐస్‌క్రీమ్స్‌ను నిమిషాల్లో తయారు చేసుకోవచ్చు. ఆరోగ్యాన్నిచ్చే పండ్లు, కూరగాయలతో కూడా ఐస్‌క్రీమ్ తయారు చేసుకోవచ్చు. తగినన్ని పాలు, పంచదార, ఎసెన్స్‌ను జోడించి ఎన్నో రుచులను ఆస్వాదించొచ్చు. స్టెయిన్లెస్ స్టీల్‌తో రూపొందిన.. 2 లీటర్ల సామర్థ్యం కలిగిన ఈ డివైజ్ బౌల్‌ని ఫ్రిజ్లోనే ఉంచాలి. ఐస్‌క్రీమ్ తయారు చేసుకునే ముందు ఫ్రిజ్‌లోంచి తీసి, డివైజ్‌లో సెట్‌చేస్తే సరిపోతుంది. దానిపైన మూత, దానిపైనే పవర్ యూనిట్ అడ్జస్టబుల్గా ఉంటాయి. ఆన్, ఆఫ్ బటన్‌తోపాటు పవర్ బటన్ కూడా డివైజ్ పైనే కనిపిస్తూ ఉంటాయి. దాంతో దీన్ని వినియోగించడం చాలా ఈజీ. ఈ డివైజ్‌తో పాటు రెసిపీ బుక్ కూడా లభిస్తుంది. ధర : 40 డాలర్లు (రూ.3,063) చదవండి👉🏾Milk Warmer: బుజ్జాయిల పాల కోసం ఈ డివైజ్.. ధర ఎంతంటే! చదవండి👉🏾Pasta Noodle Maker: పాస్తా, నూడుల్స్ ఇలా ఈజీగా.. ఈ డివైజ్‌ధర రూ. 1,990 -
10 నిమిషాల్లో ఐస్‌క్రీమ్ రెడీ.. దీని ధర రూ.2,215
ఎండాకాలం వచ్చిందంటే.. పిల్లలే కాదు పెద్దలు కూడా స్నాక్స్ బదులుగా ఐస్‌క్రీమ్‌నే కోరుకుంటారు. అలాంటి వారికి ఈ మినీ మేకర్ భలే చక్కగా ఉపయోగపడుతుంది. ఇది చూడటానికి మేకర్లా లేదే? చిన్నగిన్నెలా కనిపిస్తుందే అనుకుంటున్నారా? అదే దీని ప్రత్యేకత. హైక్వాలిటీ స్టెయిన్లెస్ స్టీల్‌లో రూపొందిన ఈ బౌల్‌ని 12 గంటల పాటు డీప్ ఫ్రిజ్‌లో పెట్టుకోవాలి. అలా చేస్తే ఐస్‌క్రీమ్ రెసిపీ సిద్ధం చేసుకున్న 10 నిమిషాల్లోనే.. ఈ బౌల్ చల్లచల్లని ఐస్‌క్రీమ్‌ని అందిస్తుంది. అదెలా అంటే లిక్విడ్ రూపంలో ఉన్న రెసిపీని ఇందులో పోసుకుని స్పూన్‌తో బౌల్ మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉండాలి. అలా చెయ్యగా చెయ్యగా గడ్డ కట్టి పదే పది నిమిషాల్లో ఐస్‌క్రీమ్ తయారవుతుంది. ఇలాంటి బౌల్స్ ఫ్రిజ్‌లో ఉంటే.. ఎవరికి వారే అప్పటికప్పుడు ఐస్‌క్రీమ్ తయారు చేసుకుని తినొచ్చు. ధర : 29 డాలర్లు (రూ.2,215) చదవండి: Beauty Tips: కళ్ల చుట్టూ నల్లటి వలయాలు.. పెళుసైన పెదాలు.. ఈ క్రేజీ పెన్‌తో చెక్! -
ఐస్‌క్రీమ్ చేయడం... అయిదు నిమిషాల పని!
ఐస్‌క్రీమ్... ఈ మాట వింటేనే మనసు ఉరకలు వేస్తుంది. పెద్దల్ని సైతం పిల్లల్లా మార్చేసి తన కోసం ఎగబడేలా చేసే శక్తి ఐస్‌క్రీమ్‌కి మాత్రమే ఉందేమో! ఇక పిల్లలైతే చెప్పనక్కర్లేదు. వాళ్లకది ప్రాణం. కానీ ప్రతిసారీ కొనివ్వాలంటే, ఖర్చు తడిసి మోపెడవుతుంది కాబట్టి మీరే తయారు చేసుకుని, ఫ్రిజ్‌లో పెట్టేసుకుంటే సరి. కాకపోతే అలా చేయాలంటే మీ దగ్గర ఈ మేకర్ ఉండాలి మరి! స్కైలైన్ కంపెనీవాళ్లు తయారు చేసిన ఈ మినీ ఐస్‌క్రీమ్ మేకర్ ఖరీదు... మూడు వేలు. ఆన్లైన్లో అయితే రూ. 2,540 కే వస్తోంది. పాలు, చక్కెర, ఐస్‌క్రీమ్ పౌడర్, ఎసెన్స్, ఇంకా అవసరమనుకున్న అన్ని పదార్థాలనూ వేసి, కరెంటుకు కనెక్ట్ చేసి ఆన్ చేస్తే చాలు. ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. దాన్ని డీప్ ఫ్రీజ్‌లో పెట్టుకుంటే కొన్ని వారాల వరకూ పిల్లలకు ఐస్‌క్రీమ్‌కి లోటే ఉండదు!