ఐస్‌క్రీమ్ చేయడం... అయిదు నిమిషాల పని!
ఐస్‌క్రీమ్... ఈ మాట వింటేనే మనసు ఉరకలు వేస్తుంది. పెద్దల్ని సైతం పిల్లల్లా మార్చేసి తన కోసం ఎగబడేలా చేసే శక్తి ఐస్‌క్రీమ్‌కి మాత్రమే ఉందేమో! ఇక పిల్లలైతే చెప్పనక్కర్లేదు. వాళ్లకది ప్రాణం. కానీ ప్రతిసారీ కొనివ్వాలంటే, ఖర్చు తడిసి మోపెడవుతుంది కాబట్టి మీరే తయారు చేసుకుని, ఫ్రిజ్‌లో పెట్టేసుకుంటే సరి. కాకపోతే అలా చేయాలంటే మీ దగ్గర ఈ మేకర్ ఉండాలి మరి!
స్కైలైన్ కంపెనీవాళ్లు తయారు చేసిన ఈ మినీ ఐస్‌క్రీమ్ మేకర్ ఖరీదు... మూడు వేలు. ఆన్‌లైన్లో అయితే రూ. 2,540 కే వస్తోంది. పాలు, చక్కెర, ఐస్‌క్రీమ్ పౌడర్, ఎసెన్స్, ఇంకా అవసరమనుకున్న అన్ని పదార్థాలనూ వేసి, కరెంటుకు కనెక్ట్ చేసి ఆన్ చేస్తే చాలు. ఐస్‌క్రీమ్ రెడీ అయిపోతుంది. దాన్ని డీప్ ఫ్రీజ్‌లో పెట్టుకుంటే కొన్ని వారాల వరకూ పిల్లలకు ఐస్‌క్రీమ్‌కి లోటే ఉండదు!