రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్‌పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్‌ని ఆవిష్కరించారు గుజరాత్‌కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..
‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్..
ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టి, మార్కెట్‌లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి.
జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్‌లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.
విద్యుత్ అవసరం లేదు
సాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్‌లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్‌సుక్‌భాయ్ ప్రజాపతి.
ప్రజాపతి నేపథ్యం..
ప్రజాపతి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి.
అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్‌రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్‌తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.
(చదవండి: జపాన్ బుల్లెట్ రైలు తరాతని మార్చిన కింగ్‌ఫిషర్!)
Comments
Please login to add a commentAdd a comment