clay
-
మ్యూజియం మళ్లీ పిలిచింది
ఇజ్రాయెల్‌లో ఓ మ్యూజియంలో ఇటీవల 3,500 ఏళ్ల నాటి మట్టి కూజాను పొరపాటున కింద పడేసిన నాలుగేళ్ల ఏరియల్ గెలర్ గుర్తున్నాడా? అంతటి పురాతన కూజాను పగలగొట్టినా మ్యూజియం సిబ్బంది ఆ బాలున్ని కనీసం తిట్టకపోవడం, గాభరా పడ్డ అతని తల్లిదండ్రులను ‘మరేం పర్లేదం’టూ కూల్ చేసి అందరి మనసూ గెలుచుకోవడం తెలిసిందే. అంతేగాక మ్యూజియం చీఫ్ స్వయంగా దగ్గరుండి మరీ ఆ చిన్నారికి అన్ని వస్తువులనూ తిప్పి చూపించారు. ఈ సంఘటన దక్షిణ ఇజ్రాయెల్‌లోని హైఫా యూనివర్సిటీలో హెక్ట్ మ్యూజియంను 10 రోజుల క్రితం జరిగింది. అయితే కూజాను పగలగొట్టిన కంగారులో మ్యూజియంలోని వస్తువులను బాలుడు సరిగా చూడలేదని భావించిన సిబ్బంది అతన్ని మరోసారి ఆహా్వనించారు. ఆ మేరకు ఏరియల్ గత శుక్రవారం తల్లిదండ్రులతో పాటు వెళ్లి సందర్శించాడు. ఈ సందర్భంగా ఒక మట్టి కూజాను వెంట తీసుకెళ్లి మ్యూజియానికి ప్రత్యేకంగా బహూకరించాడు! దాని వెనక దాగున్న ఆ పసిహృదయపు మనోభావాలను గౌరవిస్తూ సిబ్బంది దాన్ని ఆనందంగా స్వీకరించారు. మ్యూజియం క్యూరేటర్లు బాలునితో చాలాసేపటిదాకా గడిపారు. ఇలా పగిలిన వస్తువులను ఎలా అతికిస్తారో అతనికి ప్రత్యక్షంగా చూపించారు. సిబ్బందికి హేట్సాఫ్: తల్లిదండ్రులు మ్యూజియం వర్గాలకు ఏరియల్ తల్లిదండ్రులు మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలిపారు. ‘‘మేముండే ప్రాంతం లెబనాన్‌కు అతి సమీపంలో ఉంటుంది. నిత్యం బాంబు దాడులే. ఆ ఆందోళనల నుంచి కాస్త ఊరట కోసం 10 రోజుల కింద మ్యూజియానికి వెళ్తే అనుకోకుండా ఇలా జరిగింది. దాంతో మా పని అయిపోయిందనుకున్నాం. దానికి నష్టపరిహారం చెల్లించేందుకు కూడా సిద్ధమయ్యాం. కానీ మ్యూజియం సిబ్బంది మా వాడిని గానీ, మమ్మల్ని గానీ ఆ రోజు పల్లెత్తు మాట కూడా అన్లేదు. వాస్తవానికి నరకప్రాయంగా మారాల్సిన ఘటనను మాకో మర్చిపోలేని అనుభూతిగా మిగిల్చారు’’అంటూ ఆనందం వెలిబుచ్చారు. ఈ మొత్తం ఉదంతం బాలల్లో చరిత్ర పట్ల ఉత్సుకత, ఆసక్తి రేకెత్తిస్తే తమకు అంతకంటే కావాల్సిందేమీ లేదని మ్యూజియం డైరెక్టర్ ఇనబల్ రివ్లిన్ అన్నారు. ఏరియల్ మ్యూజియం పునఃసందర్శన తాలూకు వీడియో వైరల్‌గా మారింది. అందుబాటులోనే ఉండాలి! పగిలిన కూజాను మ్యూజియం నిపుణులు 3డీ టెక్నాలజీ ద్వారా అతికిస్తున్నారు. వారం రోజుల్లో అది తిరిగి పూర్వరూపు సంతరించుకుని మళ్లీ ప్రదర్శనకు అందుబాటులోకి వస్తుందని రిస్టొరేషన్ నిపుణుడు రో షెఫర్ తెలిపారు. ‘‘ఇలాంటి పురాతన వస్తువులు సందర్శనకు వచ్చేవారికి చేతికందేంత సమీపంలోనే ఉండాలి తప్ప అద్దాల అరల్లో కాదన్నదే ఇప్పటికీ మా అభిప్రాయం. వాటిని తాకి చూస్తే చరిత్ర, పురాతత్వ శా్రస్తాల పట్ల పిల్లల లేత మనసుల్లో గొప్ప ఆస్తకి పుట్టవచ్చు. ఎవరికి తెలుసు?!’’ అని ఆయన అభిప్రాయపడటం విశేషం. – సాక్షి, నేషనల్ డెస్క్ -
‘మిట్టీకూల్’: మట్టితో ఫ్రిడ్జ్!..కరెంట్‌తో పనిలేదు..!
రిఫ్రిజిరేటర్... సామాన్య భాషలో ఫిడ్జ్. ఒకప్పుడూ అది అపురూపమైన వస్తువు. ధనికులు మాత్రమే దీన్ని ఉపయోగించేవారు. ఇప్పుడూ మధ్య తరగతి ఇళ్లల్లో కూడా ఇవి దర్శనమిస్తున్నాయి. కానీ పేదవాళ్లకు మాత్రం ఇప్పటికీ అపురూపమైన వస్తువే. పైగా కొనాలంటే రూపాయి, రూపాయి పోగు చేసుకుని అప్పోసొప్పో చేసుకుని కొంటారు. పైగా దీన్ని వేసవిలోనే జాగ్రత్తగా వాడుకుంటారు. ఎందుకంటే..? దీనికి అయ్యే కరెంట్ బిల్లు కూడా ఎక్కువే. ఒకవేళ పాడైతే బాగు చేయించుకోవాలన్న కష్టమే. అలాంటి వాటికి చెక్‌పెట్టేలా ఎకో ప్రెండ్లీగా మట్టితో ఫ్రిడ్జ్‌ని ఆవిష్కరించారు గుజరాత్‌కి చెందిన డ భాయ్ ప్రజాపతి. ఎలా రూపొందించారంటే..‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్..ఇది పూర్తిగా బంకమన్నుతో తయారైన ఫ్రిజ్. అందుకే దీనికి ‘మిట్టీకూల్’ ఫ్రిడ్జ్ అని పేరు పెట్టి, మార్కెట్లోకి తెచ్చాడు ,మన్సుఖ్ . ఈ ఫ్రిడ్జ్ కు విద్యుత్ అవసరం లేదు. ఎటువంటి మరమ్మత్తులూ చేయాల్సిన పని లేదు. అయినా అద్భుతంగా పని చేస్తుంది. సాధారణ గది ఉష్ణోగ్రతలో రెండు రోజుల్లోనే పాడైపోయే కూరగాయలను ఇందులో భద్రపరిస్తే, ఐదారు రోజులు నిక్షేపంగా నవనవలాడుతూ తాజాగా ఉంటాయి. పెరుగు, దోశె పిండి లాంటివి కూడా పుల్లబడకుండా ఉంటాయి. జ్యూసులు, నీళ్లు పెడితే చల్లబడతాయి. ఇందులో 5 కిలోల కూరగాయలు, పండ్లను నిల్వ చేయవచ్చు. విద్యుత్ కోతలు తరచుగా ఉండే ప్రాంతాల్లో, మట్టి రిఫ్రిజిరేటర్‌ను ఉపయోగిస్తున్నారు. మిట్టి కూల్లో పైన ఉన్న అరలో 2 లీటర్ల నీటిని పోయాలి. ఈ ఫ్రిజ్ బాష్పీభవన సూత్రాలపై పనిచేస్తుంది. దీనికి నిర్వహణ ఖర్చు కూడా ఉండదని కనగరాజ్ తెలిపారు.విద్యుత్ అవసరం లేదుసాధారణంగా విద్యుత్ ఆధారితంగా పనిచేసే ఫ్రిడ్జ్‌లో ఉంచిన వస్తువులు తింటే కొంత అనారోగ్యానికి గురవుతారు. కాని మట్టితో తయారు చేసి.. సహజసిద్దంగా ఉండే మట్టితో తయారు చేసి ఈ మిట్టి కూల్ లోని వస్తువులు తింటే ఎలాంటి అనారోగ్యం రాదని చెబుతున్నారు. అందుకే ప్రస్తుతం తమిళనాడులోని కోయంబత్తూరు జిల్లాలో ఈ మిట్టి కూల్ కు అత్యంత డిమాండ్ ఉంది. ఇందులో ఉంచిన ఆహార పదార్ధాల్లో రుచిలో ఎలాంటి మార్పు రాదంటున్నారు మన్సుక్భాయ్ ప్రజాపతి.ప్రజాపతి నేపథ్యం..ప్రజాపతి గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లోని మోర్బిలోని నిచ్చిమండల్ గ్రామంలో జన్మించాడు. ప్రతికూల ఆర్థిక పరిస్థితుల కారణంగా చదువుకు స్వస్తి చెప్పి.. కుటుంబ పోషణ కోసం కూలీ పనులు చేసేవాడు. అతను చిన్నతనం నుంచి సాంప్రదాయక మట్టి వస్తువుల తయారీపై సమగ్రమైన పరిజ్ఞానం ఉంది. దీంతో 1988లో ప్రజాపతి రూ. 30,000 చెల్లించి మట్టి పలకల తయారీకి సంబంధించిన తన సొంత కర్మాగారాన్ని ప్రారంభించాడు. కానీ మట్టి చిప్పల మన్నిక గురించి అతనికి చాలా ప్రతికూల అభిప్రాయాలు వచ్చాయి. అయినప్పటికీ పలు ప్రయోగాలు చేస్తూనే ఉన్నాడు. అలా 1990లో అతని కంపెనీ రిజిస్టర్ అయ్యింది.ఇక 2001లో మిట్టికూల్ ట్రేడ్ మార్క్ రిజిస్టర్ చేయబడింది. ఆ తర్వాత 2002 నుంచి పూర్తి స్థాయిలో దీనిపై పనిచేయడం మొదలు పెట్టారు. అదే ఏడాది GIANగా ప్రసిద్ధి చెందిన గ్రాస్రూట్స్ ఇన్నోవేషన్ ఆగ్మెంటేషన్ నెట్‌వర్క్‌తో ప్రపంచానికి పరిచయమై.. ఈ మిట్టీకూల్ గురించి అందరికీ తెలియడం జరిగింది. ఇక బ్రిటన్, జర్మనీల్లో జరిగిన ప్రదర్శనల్లో ఈ ఫ్రిడ్జ్‌ను చూసి, అక్కడి శాస్త్రవేత్తలు ప్రశంసలు కురిపించారు. విద్యుత్తుతో పనిచేసే ఫ్రిజ్‌లతో పోలిస్తే, ఈ మట్టి ఫ్రిజ్ ఖరీదు చాలా తక్కువ. దీని ఖరీదు రూ. 8,500/అంతే!.(చదవండి: జపాన్ బుల్లెట్ రైలు తరాతని మార్చిన కింగ్‌ఫిషర్!) -
కుండలు చేసే ఊరు
ప్రతి ఊరిలో కుండలు చేస్తారు. కాని కుండలు చేయడానికి మాత్రమే ఒక ఊరు ప్రసిద్ధం అయ్యింది.అదే తమిళనాడులోని ‘మనమదురై’.అక్కడ పారే వైగై నది తెచ్చే ఒండ్రు మట్టితో తయారయ్యే ఈ కుండలు చల్లదనానికి ప్రతీకలు. స్త్రీలు ఈ కుండల తయారీలో సరి సమాన శ్రమ చేస్తారు. ఘటాలు కూడా తయారు చేస్తారు. ఈ కుండల ప్రత్యేకత వల్ల వీటికి ‘జియోగ్రాఫికల్ ఇండికేషన్’ (జిఐ) ట్యాగ్ దక్కింది. వేసవి రాగానే కుండలు గుర్తుకొస్తాయి. ప్రతి ఇంటిలో కుండలోని చల్లటి నీళ్లు తాగడానికి ఇష్టపడతారు. ఫ్రిజ్‌లోని నీళ్లలో ఉండే కృత్రిమ చల్లదనం కుండ నీళ్లలో ఉండదు. అందుకే కొత్త కుండలు వేసవిలో ప్రతి ఇంటికి చేరుతాయి. చలివేంద్రాలు పెట్టేవారు పెద్ద పెద్ద కుండలు కొని దాహార్తి తీర్చి పుణ్యం కట్టుకుంటారు. పక్షులకు నీరు పెట్టాలనుకునేవారు మట్టి పాత్రల్లో నీళ్లు నింపి పెడతారు. ఒకప్పుడు పల్లెల్లో పాలకుండ, పెరుగు కుండ, నెయ్యి కుండ ఉండేవి. పెరుగు కుండలో తోడు పెడితే చాలా రుచి. స్టీలు, ప్లాస్టిక్ దెబ్బకు కుండలు కొన్నాళ్లు వెనుకబడినా మళ్లీ ఇప్పుడు ఆరోగ్యస్పృహ వల్ల పుంజుకున్నాయి. ముఖ్యంగా కొన్ని ప్రత్యేక కుండలకు గిరాకీ తగ్గలేదు. వాటిలో మనమదురై కుండలు మరీ ప్రత్యేకం. కుండల ఊరు తమిళనాడులోని శివగంగ జిల్లాలోని చిన్న ఊరు మనమదురై. యాభై వేల జనాభా ఉంటుంది. ఇది మదురై నుంచి 60 కిలోమీటర్ల దూరం. ఇక్కడ పారే వైగై నది ఈ ఊరికి ఇచ్చిన అనుకోని వరం కుండలు తయారు చేయడానికి అవసరమైన ఒండ్రుమట్టి. నది ఒడ్డు నుంచి తెచ్చుకున్న ఒండ్రుమట్టి కాల్షియం లైమ్, బూడిద, సోడియం సిలికేట్, మాంగనీస్, ఐరన్ మిశ్రమాలను కలిపి కుండలు తయారు చేస్తారు. మనమదురై కుండను గుర్తించడం ఎలా అంటే దాని అడుగు పరిపూర్ణమైన గుండ్రంగా ఉంటుంది. అదే సమయంలో నేల మీద సరిగ్గా కూచుంటుంది. ఈ కుండల తయారీలో పంచభూతాలు ఉంటాయి అంటారు ఈ ఊరి వాళ్లు. నేల, నీరు, అగ్ని తయారీలో ఉపయోగిస్తే మట్టిలోని సూక్ష్మరంధ్రాలు గాలి రాకపోకలను సూచిస్తాయి. కుండ లోపలి ఖాళీ (శూన్యం) ఆకాశాన్ని సూచిస్తుంది. వేసవి కోసం ఇక్కడ విశేష సంఖ్యలు కుండలను స్త్రీ, పురుషులు కలిసి తయారు చేస్తారు. కుటుంబాలన్నీ కుండల మీదే ఆధారపడి బతుకుతాయి. వీటికి ఎంత డిమాండ్ ఉన్నా దూర్రపాంతాలకు పంపడం ఖర్చుతో, రిస్క్‌తో కూడుకున్న పని. కుండలు పగిలిపోతాయి. అందుకే స్థానికంగా తప్ప ఇవి ఎక్కువగా దొరకవు. ఘటం ఎలా తయారు చేస్తారు? మనమదురై కుండలకే కాదు ఘటాలకు కూడా ప్రసిద్ధి. నీరు పోస్తే కుండ. సంగీతం పలికిస్తే ఘటం. కాని అది సంగీతం పలికించాలంటే కొంచెం ప్రత్యేకంగా తయారు చేయాలి. మనమదురై ఘటాలు చాలా ప్రసిద్ధి. ఇక్కడ మీనాక్షి కేశవన్ అనే మహిళ ఘటాలు తయారు చేయడంలో ఖ్యాతి ΄÷ందింది. పెద్ద పెద్ద విద్వాంసులు ఆమె తయారు చేసిన ఘటాలనే వాయించేవారు. ఘటం తయారు చేయాలంటే కుమ్మరి చక్రంపై కుండ తయారయ్యాక ఒక రోజు ఉంచేస్తారు. మర్నాడు దానిని ప్రత్యేక చెక్కమెత్తతో మెత్తుతారు. ఒక పచ్చికుండ కాల్చడానికి ముందు ఘటంగా మారాలంటే ఆ కుండలోని ప్రతి అంగుళాన్ని మెత్తాలి. అలా 3000 సార్లు మెత్తి ఆ తర్వాత కాల్చుతారు. అప్పుడే ఘటం తయారవుతుంది. ఇది ఓపికతో కూడిన పని కాబట్టి స్త్రీలు ఎక్కువగా చేస్తారు. వీటి కోసం వేల కిలోమీటర్ల నుంచి వచ్చి కొనుక్కెళ్లేవారు ఉన్నారు. కుండలు చేసే కుటుంబాలు ఉన్నా ఘటాలు చేసే కుటుంబాలు అంతరించి పోతున్నాయని ఇటీవల సాంస్కృతిక, సంగీత అభిమానులు క్రౌడ్ ఫండింగ్ చేసి ఘటాల తయారీని పునరుద్ధరించేలా చూశారు. -
కుండల తయారీలో కామర్స్ గ్రాడ్యుయేట్.. దీపావళి ప్రమిదలు చేయడంలో బిజీ!
దీపావళి సమీపిస్తున్న కొద్దీ ఆ కాశ్మీరీ ముస్లిం కుటుంబంలో ఆనందాలు వెల్లివిరుస్తున్నాయి. ఆ కుటుంబం కొన్ని వారాలుగా మట్టి ప్రమిదలను తయారు చేయడంలో బిజీగా ఉంది. శ్రీనగర్‌లోని నిషాత్ ప్రాంతానికి చెందిన ఉమర్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రమిదలను తయారు చేస్తున్నారు. ఈ దీపాలను విభిన్నమైన, ప్రత్యేకమైన శైలిలో ఉమర్ తయారు చేస్తున్నారు. ఉమర్ కుటుంబ సభ్యులు కశ్మీర్ లోయలోని సాంప్రదాయ మట్టి కళను కాపాడేందుకు కృషి చేస్తున్నారు. గత ఏడాది దీపావళికి ఉమర్ 15 వేల దీపాలను తయారు చేశారు. ఈసారి ఉమర్ తమకు 20 వేలకు పైగా దీపాలకు ఆర్డర్లు వస్తాయని భావిస్తున్నారు. ఉమర్ ఇప్పటికే 4 వేలకు పైగా దీపాలను సిద్ధం చేశారు. ఇవి వివిధ రకాలు, వివిధ పరిమాణాలలో ఉన్నాయి. ఉమర్ కామర్స్ గ్రాడ్యుయేట్. ఉద్యోగం రాకపోవడంతో తండ్రితో కలిసి కుండలు తయారు చేయడం ప్రారంభించాడు. ఉమర్ మీడియాతో మాట్లాడుతూ దీపావళి సందర్భంగా తమకు ఉపాధి రూపంలో భారీ కానుక లభిస్తుందని తెలిపారు. దీపావళి రోజున ప్రతి ఒక్కరూ దీపాన్ని వెలిగించాలని కోరుకుంటున్నానని అన్నారు. ఇది కూడా చదవండి: కాలుష్యం బారిన జూ జంతువులు.. ఉపశమనం కోసం ఏం చేస్తున్నారంటే.. -
మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు..?
మట్టి వినాయకుడినే పూజించడం ఎందుకు? ఈ ప్రశ్న గణపతికి సంబంధించిన పురాణ కధల్లో కనిపిస్తుంది. మట్టిగణపతిని పూజించడానికి పురాణప్రాశస్త్యం కూడా ఉంది. ఏదో వినాయకచవితి వల్లనే మొత్తం కాలుష్యం జరుగుతున్నట్టుకొన్ని సంస్థలు నానా హంగామా చేస్తున్నాయి. అసలు దాని గురించి పురాణం ఏమంటోందో చూద్దాం. గణపతి లీలా వైభవాన్ని చెప్తున్న సూతులవారిని శౌనకాదులు ఒక సందేహం అడిగారు. ‘ఓ మహర్షి! ఈ వినాయక చవితి వ్రతమునందు మట్టితో చేసిన గణపతినే పూజించడానికి కారణం ఏమిటి? పూజానంతరం వినాయక ప్రతిమను నీటిలో నిమజ్జనం చేయడం దేనికి?‘ ‘మునీంద్రులారా! మంచి ప్రశ్నలు వేశారు. వినండి. పరమేశ్వరుడు విశ్వవ్యాపిత(అంతటా ఉన్నది పరమాత్ముడే) తత్వం కలిగినది భూమి కాబట్టి తొలుత మట్టితో గణపతిని చేసి, గణపతి విశ్వవ్యాపకత్వాన్ని(అంతటా, అన్నింట అంతర్లీనంగా ఉన్నది గణపతే) ప్రకటించాడు. విశ్వవ్యాపకత్వం కలిగి ఉన్నది ప్రకృతి స్వరూపమైన మట్టి ఒక్కటే. దాని నుండే సకల జీవులు సృష్టించబడతాయి. దాని నుండి లభించే పోషక పదార్ధాల ద్వారానే సర్వజీవులు పోషింపబడతాయి. చివరకు సర్వజీవులు మట్టిలోనే లయమవుతాయి. ఇదే సృష్టి రహస్యం. ఇదే పరబ్రహ్మతత్వం. ఈ సత్యాన్ని చాటడానికే నాడు పరమశివుడు పరబ్రహ్మ స్థూలరూపమైన భూమి నుండి మట్టిని తీసి దానితో విగ్రహాన్ని చేసి ప్రాణం పోశాడు (లింగపురాణం గణేశ ఖండం ప్రకారం శివుడే వినాయకుడి రుపాన్ని మట్టితో తయారుచేశాడు). మృత్తికయే పరబ్రహ్మ కనుక, మట్టితో వినాయకుడిని చేసి పరబ్రహ్మ స్వరూపంగా పూజించడం ఆనాటి నుంచి ఆచారంగా వస్తున్నది. అంతేకాదు మట్టి ఎక్కడైనా, ఎవరికైనా లభిస్తుంది, దానికి బీదా, ధనిక అనే తారతమ్యం లేదు. సర్వ సమానత్వమునకు ఏకైక తార్కాణం భుమి/మట్టి/వసుధ. బంగారంతో విగ్రహం కొందరే చేయించుకోగలరు. విఘ్నేశ్వరుడు అందరివాడు. అందుకే అందరివాడైన గణపతి విగ్రహాన్ని మట్టితో చేసి పూజించే ఆచారాన్ని పరమశివుడే ప్రారంభించాడు. నేడు సమస్తమానవాళి ఆచరిస్తోంది.సర్వజీవ సమాన త్వానికి ప్రతీక మట్టి వినాయకుడు. అందుకే మట్టి విగ్రహానికి ప్రాధాన్యం, పూజ‘ అని చెప్పాడు సూతుడు. వినాయక పూజ... కొన్ని ముఖ్య విశేషాలు వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. వినాయకుడి పూజలో మనకు అతి ముఖ్యమైనది మనం మనస్సును పెట్టి స్వామి ఎదురుగా కూర్చొని ధ్యానం చేయడం. మనం ఎంత పెద్ద విగ్రహం ప్రతిష్టించాము, ఎంత ఆర్భాటాలు చేశామన్నది ముఖ్యం కాదు. మనం ఎంత సేపు స్వామి మీద ధ్యాస పెట్టి నిలకడగా కూర్చున్నామన్నదే ముఖ్యం. కూర్చుని ఏమి చేయాలంటే? ..స్వామికి సంబంధించిన ఒక శ్లోకం, మంత్రం ఓం వినాయకాయ నమః లాంటి మంత్రాలు లేదా అష్టోత్తరం కాని చదవడం ఉత్తమం. ఏదీ రానివారు? ‘ఓం’ అని జపించండి. కేవలం చదవడమే కాదు, చదువుతున్నప్పుడు మనస్సు మొత్తం స్వామి మీద లగ్నం చేయండి. వేరే ఏ పని చేయకండి. మీకు ఉన్న దాంట్లో ఏదో ఒకటి నైవేద్యం పెట్టి స్వీకరించండి. చిన్న బెల్లం ముక్క పెట్టినా ఫర్వాలేదు. ఇలా చేసి చూడండి, ఒక సంవత్సరకాలంలో మీలో అద్భుతమైన మార్పు కనపడుతుంది. మీరు కనుక రోజూ క్రమం తప్పకుండా స్నానం చేసిన తరువాత పైన చెప్పిన విధంగా చేయగలిగితే చాలు మీరే గమనిస్తారు మీలో కలిగిన మార్పు. మీరు నమ్మనంతగా మారతారు. చేసే ప్రతి పని మీద మనసు లగ్నం చేయగలుగుతారు. విద్యార్థులు చదువు మీద ఎప్పుడూ లేనంతగా శ్రద్ధ పెడతారు. ఉద్యోగులకు పనిభారం తగ్గినట్టుగా అనిపిస్తుంది. ఏదైనా విషయం వినగానే గుర్తుపెట్టుకొనే శక్తి గణపతి ప్రసాదిస్తాడు. వినాయకునకు కుదురుగా కూర్చునే వాళ్ళంటే మహా ఇష్టం. ఎందుకంటే ఆయన స్థిరంగా కూర్చుంటాడు. అందుకే పూజలో స్వామిని ఉద్దేశించి ‘‘స్థిరో భవ, వరదో భవ, సుప్రసన్నో భవ, స్థిరాసనం కురు’’ అని చదువుతారు. అందుకే గజాననుని ముందు, రోజూ కూర్చునే ప్రయత్నం చేయడం వల్ల అద్భుతమైన విద్యాబుద్ధులను, జ్ఞానాన్ని పొందవచ్చు. ఎంత పెద్ద విగ్రహం పెట్టి పూజించడమన్నది ముఖ్యం కాదు. స్వామి ముందు ఎంతసేపు కూర్చున్నామన్నది ముఖ్యం. అందరూ రోజూ కాసేపు గణపతికి కేటాయించండి. మీలో కలిగే మార్పులను గమనించండి. జీవితంలో అతి త్వరగా పైకి ఎదగండి.మీరు చేసే ప్రతి పనిని శ్రద్ధగా చేయడానికి, జ్ఞాపక శక్తి పెరగడానికి, ప్రతి విషయం త్వరగా అర్దం అవ్వడానికి ఇది బాగా ఉపకరిస్తుంది కనుక గణపతి ఆరాధనను మీ నిత్యజీవితంలో భాగం చేసుకోవడం మంచిది. ఆసనం (చాప వంటివి) వేసుకోవడం మరవకండి. – డి.వి.ఆర్. భాస్కర్ (చదవండి: వినాయకుడి పూజలోని ఏకవింశతి పత్రాల విశిష్టత ఏంటో తెలుసా!) -
మట్టి పాత్రల్లో వండటం మంచిదే! కానీ..
ఇటీవల కాలంలో పాతకాలం పద్ధతితో వండే వంట స్టయిల్ని అనుసరిస్తున్నారు అతివలు. కానీ ఇలా మన బామ్మల కాలం నాటి పద్ధతిలో వండుకోవడం మంచిదే గానీ ఎలా వండాలో ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోకపోతే లేనిపోని ప్రమాదాలు కొనితెచ్చుకున్నట్లు అవుతుంది. అచ్చం అలాంటి ఘటనే ఇక్కడ చోటు చేసుకుంది. సంప్రదాయ భారతీయ పద్ధతిలో వంట చేయాలనుకుంది ఫుడ్ బ్లాగర్ ఫర్హా ఆఫ్రీన్. అందులో భాగంగానే ఓ మట్టి ప్రాతను స్టవ్‌పై పెట్టింది. అందులో నూనె వేసి జీలకర్ర, కరేపాకు ఇలా వేసిందో లేదో అంతే ఒక్కసారిగా భగ్గున మంట లేచి.. కుండ పగిలి చెల్లచెదురుగా పడిపోయింది. కొద్దిలో పెను ప్రమాదం తప్పింది. అందుకు సంబంధించిన వీడియోను ఆఫ్రిన్ షేర్ చేస్తూ..దయచేసి మీరు ఇలాంటి పరిస్థితిని ఎదుర్కోవద్దు అని గట్టిగా హెచ్చరిస్తోంది. తనలా ట్రై చేయాలనుకునేవారు ఛెఫ్‌లు లేదా పెద్దవాళ్లను అడిగి సలహలు తీసుకుని మరీ ప్రయత్నించండి అని సూచిస్తోంది ఆఫ్రిన్. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట తెగ హల్చల్ చేస్తోంది. దీంతో నెటిజన్లు కొత్తగా మట్టి పాత్రల్లో చేయాలనుకుంటే పెద్దలను అడగాలని ఒకరు, మట్టిపాత్రలను రాత్రంతా నీటిలో నానబెట్టి ఆరనిచ్చాక వండాలని మరోకరు సలహలు ఇస్తూ పోస్టులు పెట్టారు. View this post on Instagram A post shared by Farha Afreen (@homely_ccorner) (చదవండి: జపాన్‌లో టీచర్స్ డే ఎలా జరుపుకుంటారో తెలుసా!) -
మీ కన్నయ్య మన్ను తింటున్నాడా?
కొందరు పిల్లలు తల్లిదండ్రుల కళ్లు కప్పి మట్టి, బలపాలు, గోడకు ఉండే సున్నపు బెత్తికలు తింటూ ఉంటారు. మరికొందరు పెద్దవాళ్లు కూడా బియ్యంలో మట్టిగడ్డలు తినడం చూస్తుంటాం. మొక్కై వంగనిది మానై వంగునా? అన్నట్లు చిన్నప్పుడే పిల్లల్లో ఉండే మట్టి తినే అలవాటును మాన్పించకుంటే వారి ఆరోగ్యానికి పెను ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. మట్టితినే అలవాటు మాన్పించడం ఎలాగో చూద్దామా? ఎందుకు తింటారంటే..? చాక్లెట్లు, బిస్కట్లు, లాలీపాప్‌లు, ఇలా రకరకాల తినుబండారాలు ఉండగా వాటన్నింటికీ బదులు లేదా వాటితోపాటు అప్పుడప్పుడు ఇలా మట్టి ఎందుకు తింటారో తెలుసా? ... విటమిన్ల లోపమే అందుకు కారణం. శరీరంలో ఉండవలసిన దానికన్నా బాగా తక్కువ పరిమాణంలో ఈ విటమిన్లు ఉండటం లేదా అసలే లేకపోవడం వల్ల పిల్లలు మట్టితింటూ ఉంటారు. కాల్షియం, ఐరన్ తగినంత లేకపోవడం వల్ల పిల్లలు ఇలా మట్టి తినడానికి అలవాటు పడతార ని పరిశోధనలు రుజువు చేస్తున్నాయి. మట్టి తినే అలవాటు పిల్లల ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది. కడుపు, జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలు మొదలవుతాయి. వాటిని సకాలంలో ఆపకపోతే, పెరుగుదలలోనూ అనేక సమస్యలను ఎదుర్కొంటారు. పిల్లల శరీరంలో కాల్షియం లోపం ఏర్పడినప్పుడు, వారు మట్టి రుచిని ఇష్టపడతారు. పిల్లలు మట్టి వైపు వెళ్లకుండా నివారించడానికి, తగినంత కాల్షియం ఉన్న పదార్థాలు తినేలా చూడాలి. పిల్లలకు మట్టి, బలపాలు తినే అలవాటు మానుకోవాలంటే లవంగం నీళ్లు ఇస్తే మేలు జరుగుతుంది. 6 -7 లవంగాలను నీటిలో బాగా మరిగించి పిల్లలచేత తాగించండి. అవసరం అనుకుంటే దీనికి కొద్దిగా తేనె కలిపినా మంచిదే. అరటి పండులో ఎక్కువ మొత్తంలో కాల్షియం ఉంటుంది కాబట్టి పిల్లలకు రోజూ అరటిపండు తినిపించాలి. కావాలంటే అరటిపండుకు తేనె కలిపి మెత్తగా చేసి తినిపించవచ్చు. -
కొత్తరాతి యుగానికి చెందిన మట్టిబొమ్మ
సాక్షి, హైదరాబాద్: కొత్త రాతి యుగానికి చెందిన అరుదైన మట్టిబొమ్మ సిద్దిపేటలో దొరికింది. నంగునూరు మండలంలోని నర్మెట్ట గ్రామ శివారు పాటిగడ్డలో కొలిపాక శ్రీనివాస్ ఈ బొమ్మను గుర్తించారు. ఆదిమానవులకు సంబంధించిన అనేక ఆధారాలను అందించిన నర్మెట్టలోనే ఇదీ దొరకటం విశేషం. క్రీ.పూ.6500 నుంచి క్రీ.పూ.1800 మధ్య కాలానికి చెందినదిగా భావిస్తున్న ఈ మట్టి బొమ్మ కొంతమేర విరిగి ఉంది. 6సెం.మీ. పొడవున్న ఈ బొమ్మకు ఎంతో ప్రాధాన్యం ఉందని అంతర్జాతీయ పురావస్తు పరిశోధకులు కర్ణాటకకు చెందిన రవి కొరిసెట్టర్ చెప్పారని కొత్త తెలంగాణ చరిత్ర బృందం కనీ్వనర్ శ్రీరామోజు హరగోపాల్ పేర్కొన్నారు. ప్రస్తుతం పాకిస్తాన్లో అంతర్భాగంగా ఉన్న మెహర్‌ఘర్ ప్రాంతంలో గతంలో జరిపిన తవ్వకాల్లో దొరికిన బొమ్మలను ఇది పోలి ఉందన్నారు. నంగునూరు–నర్మెట్ట మధ్య 6కి.మీ. పరిధిలో ఆదిమానవుల మనుగడను రూఢీ చేసే ఆధారాలు విస్తారంగా వెలుగు చూస్తున్నాయని, ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు. చదవండి: వచ్చేస్తున్నాయ్.. కల్యాణ ఘడియలు -
టెర్రకోట కళకు ఆధునికత అండ.. అరగంటలో మట్టి సిద్ధం!
కురబలకోట: ఆశావాదికి ఒక దారి మూసుకుపోతే మరో దారి వెల్ కమ్ చెబుతుందంటారు. అన్నమయ్య జిల్లా కుమ్మరుల జీవితాల్లో అదే జరిగింది. 40 ఏళ్ల క్రితం ఆనాటి పెద్దలు మట్టితో కుండలు, కడవలు, బానలు, వంట పాత్రలు తయారు చేసి ఎడ్లబండిపై ఊరూరా తిరిగి అమ్మేవారు. వచ్చిన దాంతో కాలం వెళ్లదీసేవారు. అల్యూమినియం, ఇతర వంట పాత్రలు మార్కెట్లోకి రావడంతో కుమ్మరుల నుంచి మట్టి కుండలు, పాత్రలు కొనేవారు కరువయ్యారు. ఇలాంటి పరిస్థితిలో ఆనాటి రిషివ్యాలీ స్కూల్ క్రాఫ్ట్ టీచర్ విక్రమ్ పర్చూరే వీరి పాలిట ఆశాజ్యోతిగా మారారు. ఆయనే రాష్ట్రంలో టెర్రకోట ప్రక్రియకు ఆద్యుడని చెప్పకతప్పదు. తొలుత కురబలకోట మండలంలోని దుర్గం పెద్ద వెంకట్రమణ, అసనాపురం రామయ్యలకు ఈయన టెర్రకోట ప్రక్రియలో కుండలు, బొమ్మలు చేయడం నేర్పించాడు. వారి ద్వారా ఇవి వారసత్వంగా ఇప్పుడు బహుళ ప్రాచుర్యంలోకి వచ్చాయి. అంగళ్లు, కంటేవారిపల్లె, పలమనేరు, సీటీఎం, ఈడిగపల్లె, సదుం, కాండ్లమడుగు, కుమ్మరిపల్లె తదితర ప్రాంతాల్లో ఎందరికో కొత్త జీవితాన్ని ఇస్తున్నాయి. ఒకప్పుడు వంట ఇంటకే పరిమితమైన ఇవి నేడు నట్టింట ఇంటీరియర్ డెకరేటివ్గా మారాయి. పల్లెలు, సంతల్లో అమ్ముడయ్యే ఇవి ఇప్పుడు ఎంచక్కా హైవేపక్కన కొలువు దీరాయి. నగరవాసులను ఆకట్టుకుంటున్నాయి. మట్టితో ఎన్నో కుండలు, బొమ్మలు చేస్తూ కొత్త కళ తెప్పిస్తున్నారు. రాష్ట్రపతి, గవర్నర్ల బంగ్లాలలో తిష్ట వేశాయి. పార్లమెంటు, అసెంబ్లీలలో కూడా ఇవి చోటు సంపాదించుకున్నాయి. ఎగ్జిబిషన్లలో ఆకట్టుకుంటున్నాయి. అదే మట్టి అదే కుమ్మరులు.. కానీ మారిందల్లా పనితనమే. రూపం మార్చారు. దీంతో విలువ పెరిగింది. ఇందుకు ఆధునిక మిషన్లు ఆయుధంగా మారాయి. ఇదే వారికి సరి కొత్తదారిని చూపింది. తక్కువ సమయంలో ఎక్కువ తయారు చేసుకోగలుగుతున్నారు. కుటుంబాలను చక్కదిద్దుకుంటున్నారు. కురబలకోట, సీటీఎంకు చెందిన ముగ్గురికి టెర్రకోట కళలో రాష్ట్ర స్థాయి అవార్డులు కూడా వరించాయి. అన్నమయ్య జిల్లాకే మకుటాయమానంగానే కాకుండా సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా కూడా ఇవి నిలుస్తున్నాయి. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 652 కుటుంబాల దాకా ఈ వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయి. పేదరికం జయించి జీవన ప్రమాణాలు పెంచుకున్నాయి. జీవన శైలి కూడా మారింది. ఆధునిక మిషన్లతో తగ్గిన శ్రమ పెద్దల కాలం నుంచి మట్టి పిసికి కాళ్లతో తొక్కి సిద్ధం చేసేవారు. దీని వల్ల శారీరక శ్రమ ఎదురయ్యేది. ఒక రోజంతా మట్టి సిద్ధం చేసుకుని మరుసటి రోజున పని మొదలుపెట్టేవారు. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం డీఆర్డీఏ ద్వారా వివిధ రకాల మిషన్లను వీరికి ఉచితంగా అందజేసింది. దీంతో సునాయాసంగా కుండలు, బొమ్మలకు కావాల్సిన మట్టిని సిద్ధం చేసుకోగలుతున్నారు. దశాబ్దాలుగా సారెపై వీటిని చేసేవారు. దీని స్థానంలో పాటరీ వీల్‌ను ఇచ్చారు. ఇది రూ.16 వేలు. కరెంటుతో నడుస్తుంది. కూర్చునే పనిచేయవచ్చు. చక్రం తిప్పే పనిలేదు. ఆన్/ఆఫ్ బటన్ సిస్టమ్ ద్వారా పనిచేస్తుంది. ప్లగ్ వీల్ అనే మరో మిషన్ కూడా ఇచ్చారు. ఇందులో మట్టి వేస్తే అది కుండలు, బొమ్మలు చేయడానికి అనువుగా మట్టి ముద్ద తయారై వస్తుంది. ఇది రూ.33 వేలు. వీటికి తోడు కొత్తగా క్లే మిక్సర్ రోలర్ మిషన్ వచ్చింది. ఇది రూ.75 వేలు. మట్టి ఇందులో వేస్తే ఇసుక, రాళ్లు లాంటివి కూడా పిండిగా మారి బొమ్మలు, కుండలకు అనువుగా మట్టి తయారవుతుంది. ఇదివరలో మట్టిని సిద్ధం చేసుకోడానికి రోజంతా పట్టేది. ఈ మిషన్‌తో ఇప్పుడు అరగంటలో మట్టి సిద్ధం అవుతోందని టెర్రకోట కళాకారులు సంతోషంగా వెల్లడిస్తున్నారు. ఈ మిషన్లను డీఆర్డీఏ కళాకారులకు ఉచితంగా అందజేసింది. సీఎఫ్‌సీ సెంటర్లు కూడా కట్టించి ఇచ్చారు. టెర్రకోటతో కొత్త బాట టెర్రకోట అంటే కాల్చిన మట్టి అని అర్థం. కుండలు, బొమ్మలు తయారు చేసి వాటిని కాల్చే ప్రక్రియనే టెర్రకోటగా వ్యవహరిస్తున్నారు. పెద్దల కాలంలో సాధారణ మట్టి కుండలు చేసే మాకు టెర్రకోట కొత్త బతుకు బాట చూపింది. వీటిలో ప్రావీణ్యం సాధించిన మేము దేశ విదేశాల్లో శిక్షణ కూడా ఇస్తున్నాం. మాకు ఆస్తిపాస్తులు కూడా లేవు. ఈ వృత్తే ఆధారం. కొత్త జీవనం, కొత్త జీవితాన్ని ఇచ్చింది. – దుర్గం మల్లికార్జున, టెర్రకోట కళాకారుల సంఘం నాయకులు, అంగళ్లు 70 శాతం కష్టం తగ్గింది ఈ మిషన్ల ద్వారా 70 శాతం శారీరక కష్టం తగ్గింది. ఇదివరలో మట్టిని.. శుభ్రం చేయడం, నీళ్లు చల్లి కాళ్లతో తొక్కి సిద్ధం చేయాల్సి వచ్చేది. ఇప్పుడా సమస్యే లేదు. మిషన్లతో మట్టిని ముద్ద చేయడం, కుండలు, బొమ్మలకు అనువుగా మట్టిని మార్చుకోవడం ఇప్పుడు గంటలో పని. అధునాతన మిషన్లు మా వృత్తిని సులభతరం చేశాయి. నాణ్యత, నవ్యత పెరిగింది. ప్రభుత్వానికి కృతజ్ఞతలు. తక్కువ సమయంలో ఎక్కువ కుండలు, బొమ్మలు తయారు చేసుకోగలుగుతున్నాం. నెలకు రూ. 30 వేల నుంచి రూ. 40 వేల దాకా సంపాదించుకోగలుగుతున్నాం. – రాజగోపాల్, రాష్ట్ర అవార్డు గ్రహీత, అంగళ్లు వీటికే ఎక్కువ డిమాండ్ టెర్రకోట కళ గురించి తెలియని వారు అరుదు. 250 రకాలు కుండలు, బొమ్మలు చేస్తున్నాం. వీటిలో మట్టి వంట పాత్రలకు అధిక డిమాండు ఉంది. ప్రజల్లో ఆరోగ్య స్పృహ పెరిగింది. మట్టి పాత్రల్లో వంట శ్రేష్టమని భావిస్తున్నారు. దీంతో వీటికి గిరాకీ పుంజుకుంటోంది. వివిధ నగరాల హోటళ్లకు కూడా బిర్యానీ కుండలు వెళుతున్నాయి. వీటి తర్వాత ఇంటిరియర్ డెకరేటివ్ పార్ట్స్‌కు, ఆ తర్వాత గార్డెన్ ఐటెమ్స్‌కు ఆదరణ ఉంటోంది. 80 శాతం వీటినే ఆదరిస్తున్నారు. కొనుగోలుదారుల అభిరుచులకు తగ్గట్టుగా ఎప్పటికప్పుడు కొత్తదనంతో కుండలు, బొమ్మలు చేస్తున్నాం. బతుకుతెరువుకు ఏ మాత్రం ఢోకా లేదు. – డి.కళావతి, టెర్రకోట హస్తకళాకారిణి, అంగళ్లు -
అక్కడ మట్టిని కూరల్లో మసాలాగా వాడతారు!
పర్యాటకులకు ప్రపంచవ్యాప్తంగా అహ్లాదాన్ని అందించే ఐలాండ్స్ చాలానే ఉన్నాయి. కానీ తినగలిగే ఐలాండ్ గురించి మీకు తెలుసా? అవును అక్కడ మట్టిని బ్రెడ్‌లో సాస్‌లా, కూరల్లో మసాలాగా వాడతారు. ఆశ్చర్యంగా ఉంది కదూ..? ఇరాన్ తీరానికి 8 కి.మీ. దూరంలో, పర్షియన్ గల్ఫ్ సముద్రానికి మధ్యలో కన్నీటి చుక్క ఆకారంలో ఉంటుందది.పేరు హోర్ముజ్ ద్వీపం. అగ్నిపర్వత శిలలతో, మట్టి, ఇనుముతో నిండిన ఈ ఐలాండ్ చూడటానికి.. పసుపు, ఎరుపు, నీలం వంటి పలు రంగుల్లో ఇంద్రధనస్సులా మెరుస్తుంది. అందుకే దీన్ని రెయిన్బో ఐలాండ్‌గా పిలుస్తారు స్థానికులు. మొత్తం 42 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉన్న ఈ ద్వీపంపై 70కి పైగా ఖనిజాలను గుర్తించారు పరిశోధకులు. హోర్ముజ్ ఐలాండ్.. ఎన్నో కోట్ల సంవత్సరాల కిందట పర్షియన్ గల్ఫ్ తీరంలో ఉప్పు గుట్టల్లా పేరుకుపోయి.. అగ్నిపర్వత అవక్షేపాలతో కలసి రంగు రంగుల దిబ్బలుగా మారిందని వారి పరిశోధనల సారాంశం. ఈ రంగురంగుల గుట్టలు, ఎర్రటి బీచులు, అందమైన ఉప్పు గుహలకు అక్కడి భౌగోళిక పరిస్థితులే కారణమని తేల్చారు వాళ్లు. కాలక్రమేణా భూమిలోకి కిలోమీటర్ల మేర పాతుకుపోయిన ఈ గుట్టల్లోంచి తేలికైన ఉప్పు పొరలు పెల్లుబకడంతో గోపురాల్లా కనిపిస్తూ పర్యాటకుల్ని మరింతగా ఆకర్షిస్తున్నాయట. ఇక్కడ లభించే ‘గెలాక్’ అనే ఎర్రటి మట్టిని.. స్థానిక వంటకాల్లో వాడుతుంటారు. అగ్నిపర్వత శిలల నుంచి పుట్టుకొచ్చిన.. హేమటైట్ అనే ఐరన్ ఆక్సైడ్ వల్ల ఇది ఏర్పడిందని శాస్త్రవేత్తలు తేల్చారు. ఈ మట్టి నుంచే ‘సూరఖ్’ అనే సాస్ని కూడా తయారు చేస్తున్నారు. అది బ్రెడ్‌తో కలిపి తింటే భలే రుచిగా ఉంటుందట. అయితే ఈ మట్టిని వంటకాల్లోనే కాదు.. కాస్మెటిక్స్, డిజైనింగ్స్‌లో కూడా వాడుతున్నారు. (క్లిక్: 13.5 సెకన్లలో ఫుడ్ సర్వ్ చేసే హోటల్.. ఎక్కడో తెలుసా?) ఒక్కోవైపు ఒక్కో అందం ఈ ఐలాండ్‌కు నైరుతిలో బహుళవర్ణాలతో మెరిసే లోయ ఉంటుంది. దాన్నే రెయిన్బో వ్యాలీ అంటారు. మొత్తం ఐలాండ్ అంతా రంగురంగుల్లో మెరుస్తున్నప్పటికీ ఈ లోయ మరింత ప్రత్యేకం. సూర్య కిరణాల వెలుగుల్లోనే ఈ అందాలను చూడాలనేది పర్యాటకుల మాట. ఆ లోయ పక్కనే మరో లోయ.. శిల్పులు చెక్కిన శిల్పాల్లా ఎన్నో వింత ఆకారాలు దర్శనమిస్తాయి. అయితే వాటిని మనుషులు చెక్కలేదంటే నమ్మబుద్ధి కాదట. వ్యాలీ ఆఫ్ స్టాచ్యూస్ (విగ్రహాల లోయ)గా పేరున్న ఈ లోయలో.. బర్డ్స్‌లా, డ్రాగన్స్‌లా వింతవింత రూపాలు మనల్ని మైమరిపిస్తాయట. అవన్నీ వేలాది సంవత్సరాలుగా ప్రకృతి కోతతో ఏర్పడిన అద్భుతాలే. ఇక ఐలాండ్‌కి పశ్చిమ దిక్కున కిలోమీటర్ మేర విస్తరించిన ఈ లోయలోని ఉప్పు స్ఫటికాలకు వైద్య గుణాలున్నాయని, నెగెటివ్ ఎనర్జీని పారదోలే ఉప్పుదేవతని స్థానికులు విశ్వసిస్తారు. -
స్ఫూర్తి మినియేచర్ సృష్టి... మది దోచే మట్టి రూపాలు
చిట్టి పలకా బలపం చిన్నారి చదువుకునే బడి పుస్తకం నోరూరించే నూడుల్స్, పిజ్జా... ఇడ్లీ, దోసె, మిర్చిబజ్జీ అందమైన పూల మొక్కలు.. ఆకట్టుకునే ముఖచిత్రాలు నూటొక్క పూవుల బతుకమ్మ.. నిదురించే చంటిబిడ్డ పూలవనాలు, పండ్ల రాశులు అన్నీ మట్టి రూపాలే.. మనసుదోచే కళారూపాలే! పార్వతి చేతుల్లో ప్రాణం పోసుకున్న పిండిబొమ్మల్లే స్ఫూర్తి చేతుల్లో వెలుగొందుతున్నాయి మట్టి బొమ్మలు ఆమె కళారూపాలు గ్రామ సరిహద్దులను దాటి విదేశీ గడ్డపైనా ముచ్చటగా మెరిసిపోతున్నాయి. తెలంగాణలోని కామారెడ్డి వాసి అయిన స్ఫూర్తి మినియేచర్ సృష్టి... ముచ్చట ఇది.. క్లేతో ఆమె తయారు చేస్తున్న మినియేచర్స్కు దేశ విదేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. కొనుగోలు చేస్తున్నవారు ఆనందం పొందుతుండగా, తయారు చేసి విక్రయించడం ద్వారా ఆమె ఉపాధి పొందుతోంది. కామారెడ్డి పట్టణంలోని కాకతీయనగర్ కాలనీకి చెందిన శ్రీరాం, గంగల కూతురు స్ఫూర్తి దానబోయిన. చెన్నైలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) లో ఫ్యాషన్ అండ్ లైఫ్ స్టైల్ యాక్ససరీస్ విభాగంలో డిగ్రీ పూర్తిచేసింది. కొంత కాలం పోచంపల్లిలో లెదర్ కంపెనీలో హ్యాండ్ బ్యాగ్స్ తయారీలో, అలాగే కోల్‌కతాలో ఆరు నెలలపాటు ఉద్యోగం చేసింది. విదేశాల్లో పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయాలని ప్రయత్నించింది. అయితే ఆ సమయంలోనే ప్రపంచమంతటా కరోనా మహమ్మారి కమ్ముకోవడంతో పీజీ ఆలోచనను వాయిదా వేసుకుని ఇంటి దగ్గరే ఉండిపోయింది. ఈ సమయంలో క్లేతో మినియేచర్స్ తయారు చేయడం మొదలుపెట్టింది. అలా తయారు చేసిన వస్తువులను ఇన్‌స్టాగ్రామ్‌లో అప్లోడ్ చేయడంతో చాలా మంది అవి తమకు నచ్చాయని, తమకు కూడా కావాలంటూ ఫోన్లు చేయడం, మెసేజ్‌లు పెట్టడం మొదలై ఇప్పుడు వందలాది ఆర్డర్లు వస్తున్నాయి. గడచిన రెండేళ్లుగా స్ఫూర్తి దాదాపు రూ.3 లక్షల విలువైన ఆర్డర్లు తీసుకుంది. రాత్రింబగళ్లూ క్లేతో వారు కోరిన బొమ్మలను తయారు చేసి, వాటిని పోస్ట్, కొరియర్ సర్వీసుల ద్వారా పంపిస్తోంది. దేశ, విదేశాల నుంచి ఆర్డర్లు మన దేశంలో ఎక్కువగా మెట్రో సిటీలైన ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్, సూరత్, లక్నో, తదితర ప్రాంతాల నుంచి ఎక్కువగా ఆర్డర్లు వస్తున్నాయి. వారి ద్వారా విదేశాల్లో ఉన్న వారి వారి బంధువులు కూడా ఆర్డర్లు చేస్తున్నారు. దీంతో వారు కోరుకున్నవి తయారు చేసి పంపిస్తూ ఉపాధి పొందుతోంది. ప్రతి రోజూ ఆర్డర్లు వస్తూనే ఉంటాయని, రూ.150 మొదలుకొని రూ.1200 వరకు వివిధ రకాల మినియేచర్లు తయారు చేస్తున్నట్టు స్ఫూర్తి పేర్కొంది. ఇప్పటివరకు ఇంటి దగ్గర ఉంటూ మినియేచర్స్ తయారీ ద్వారా ఖర్చులన్నీ పోనూ దాదాపు రూ.3 లక్షలు ఆర్జించింది. అలంకార వస్తువులు మినియేచర్స్తోబాటు కొంత మంది మహిళలు తమకు కీచైన్స్ కావాలని, చెవులకు జూకాలు, లాకెట్స్, హెయిర్ క్లిప్‌లు... ఇలా రకరకాల అలంకార వస్తు సామగ్రి కావాలంటూ ఆర్డర్లు ఇస్తున్నారు. వాళ్లు కోరుకున్నట్టుగా తయారు చేస్తూ వారికి పంపిస్తోంది. స్ఫూర్తి ప్రతిభ దేశ, విదేశాలకు పాకింది. ఆమెకు తల్లిదండ్రులు ప్రోత్సాహం అందిస్తున్నారు. ఉద్యోగాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లకుండా ఉన్న చోటనే ఉపాధి పొందవచ్చని నిరూపిస్తోంది స్ఫూర్తి. ప్రశంసలే స్ఫూర్తిగా... క్లేతో మినియేచర్స్ తయారు చేస్తున్న స్ఫూర్తి పలువురి నుంచి అభినందనలు అందుకుంది. హైదరాబాద్ ఆర్ట్ ఎగ్జిబిషన్లో ఆమె తయారు చేసిన మినియేచర్స్ను ప్రదర్శించడానికి ఆహ్వానం అందింది. దీంతో తాను తయారు చేసిన మినియేచర్స్ కళను ప్రదర్శించి నిర్వాహకుల నుంచి ప్రశంసలు, బహుమతులు అందుకుంది. అలాగే నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఓ స్వచ్ఛంద సంస్థ నిర్వహించిన కార్యక్రమంలో పాల్గొని ప్రశంసాపత్రం అందుకున్న స్ఫూర్తి.. పేరుకు తగ్గట్టు అందరికీ స్ఫూర్తి ప్రదాత. అందమైన ఎంపిక మినియేచర్స్ తయారు చేయడం ఎంతో ఇష్టం. ఆ ఇష్టంతోనే వాటి తయారీ మొదలు పెట్టాను, సక్సెస్ అయ్యాను. వివిధ ప్రాంతాలు, దేశాల నుంచి ఆర్డర్లు వస్తున్నాయి. చాలా మంది నేను తయారు చేసిన మీనియేచర్లను కానుకలుగా ఎంపిక చేసుకోవడానికి ఇష్టం చూపుతున్నారు. ఆ విధంగానే ఆర్డర్లు ఎక్కువ వస్తున్నాయి. – స్ఫూర్తి – ఎస్.వేణుగోపాలాచారి, కామారెడ్డి, సాక్షి -
కేవలం మూడున్నర గంటల్లో మట్టి ఇళ్లను నిర్మిస్తున్న ఇటలీ.. కారణం తెలుసా..
మన పూర్వికులు మట్టితో కట్టిన ఇళ్లలో జీవించారు. సైన్స్ అభివృద్ధిచెందని కాలంలో మట్టి ఇళ్లను నిర్మించుకుని నివాసమున్నారు. ఐతే టెక్నాలజీపై ప్రపంచానికే పాఠాలు చెప్పగల ఈ సంపన్న దేశంఎందుకో మట్టితో ఇళ్లను కట్టుతోంది. ఆ విశేషాలేమిటో తెలుసుకుందాం.. ఇటలీలోని రావెన్న ప్రాంతంలో కుండ ఆకారంలో బంకమట్టితో ఇళ్లు కడుతున్నారు. అచ్చం.. మన పూర్వికుల ఇళ్లమాదిరి కట్టేస్తున్నారు. వీటిని టెల్కా హౌసులు అని అంటారు. అంతేకాదు 3డీ ప్రింటింగ్ సహాయంతో కేవలం మూడున్నర గంటల్లో వీటిని నిర్మిస్తున్నారు. 645 చదరపు అడుగుల విస్తీర్ణంలో కట్టిన ఈ గుండ్రని ఇళ్ల లోపల బెడ్ రూం, బాత్ రూం, లివింగ్ రూములతో సకల సౌకర్యాలతో కూడి ఉన్నాయి. ఈ డోమ్ హౌస్‌ల నిర్మాణాల వెనుక గొప్ప సందేశం కూడా ఉందండోయ్! వీటిని నిర్మించాలనే ఆలోచన సుప్రసిద్ధ ఆర్కిటెక్ట్ మారియో కుసినెల్లా నుండి ఉద్భవించింది. ఇళ్లు లేనివారు వీటిని వాడుకోవచ్చట కూడా. రాబోయో రోజుల్లో ఇంకా తక్కువ సమయంలో కట్టేస్తానంటున్నాడు మారియో. ప్రపంచంలోనే మొట్టమొదటి పర్యావరణ హిత ఇళ్లివి (ఎకో ఫ్రెండ్లీ హౌస్). ప్రకృతి విపత్తుల్లో ఒక వేళ ఇవి కూలిపోతే 3డి ప్రింటింగ్‌తో తిరిగి నిర్మించుకోవచ్చిన మారియో చెబుతున్నాడు. విపత్తు సంభవించే ప్రాంతాలకు ఇటువంటి ఇళ్లు మంచి ఎంపిక అని మారియో చెప్పారు. జీరో కార్భన్ కన్స్ట్రక్షన్ ఆవిష్కరణ కోసం ఈ ప్రాజెక్ట్ ఎంపిక చేయబడింది. ఈ ప్రాజెక్ట్ క్లైమాట్ ఛేంజ్ సమ్మిట్‌లో కూడా ప్రదర్శించబడింది. చదవండి: కోట్ల విలువచేసే ఇంటికి నిప్పంటించాడు..ఎందుకో తెలుసా? -
మట్టి కాని గట్టి బొమ్మలు
బంక మట్టితో చేసిన బొమ్మలు ఎక్కువసేపు నిలబడవు. ఎండిపోగానే పగుళ్లు వచ్చేస్తాయి. అందుకే పిల్లలు రసాయనాలతో తయారైన మట్టితో బొమ్మలు చేస్తూ ఆడుకుంటారు. ఆ మట్టిలో ప్రమాదకరమైన కిరసనాయిల్, బొరాక్స్ వంటివి ఉంటాయి. అవి పిల్లల ఆరోగ్యం మీద ప్రభావం చూపిస్తాయి. తన యేడాది వయసున్న కొడుకు మట్టితో ఆడుతుంటే దీప్తికి భయంగా ఉండేది. పిల్లవాడి ఆరోగ్యం కోసం రసాయనాలు లేని బొమ్మలు తయారు చేయాలనుకుంది దీప్తి. ఆ ఆలోచన నుంచి వచ్చినదే పర్యావరణ హితమైన మట్టి. పిల్లల కోసం బెంగళూరుకు చెందిన దీప్తి భండారీ హాని కలిగించని కృత్రిమ మట్టిని తయారు చేయడం ద్వారా ఆ మట్టితో ఆడుకునే పిల్లలకు ఆరోగ్యాన్ని చేకూరుస్తున్నారు.. తాను ఆర్థికంగా ఎదుగుతున్నారు దీప్తి. బయో కెమిస్ట్రీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన దీప్తి.. టీచింగ్ మీద ఆసక్తి పెంచుకున్నారు దీప్తి. బంధువుల పిల్లలకు పాఠాలు చెబుతూ టీచింగ్ లో అనుభవం సంపాదించారు. ఆ అనుభవంతో పిల్లల కోసం ‘మిల్క్ టీత్ యాక్టివిటీ సెంటర్’ను బెంగళూరులోని చామరాజ్‌పేట్‌లో ప్రారంభించారు. పిల్లలకు పాఠాలు చెబుతూ, వృత్తి మీద ప్రేమ పెంచుకున్నారు. ఆ సమయంలోనే ఒక తల్లి పిల్లల్ని ఎలా పెంచాలనే విషయం మీద అవగాహన ఏర్పడింది దీప్తికి. పిల్లల మనస్తత్వాన్ని అర్థం చేసుకుంటూ, వాళ్లకి ఏ విధంగా చెబితే అర్థమవుతుందో తెలుసుకున్నారు దీప్తి. ‘‘పసి వయసులో నేర్చుకున్న విద్య జీవితాంతం గుర్తుండిపోతుంది. అందులో నైపుణ్యం కూడా వస్తుంది’’ అంటారు దీప్తి. ఆటల్లోనే అన్నీ... పిల్లలకు బొమ్మలతో ఆటలు నేర్పుతూ, రంగులు, ఆకారాలు, పరిమాణాల గురించి కూడా నేర్పించటం దీప్తి ప్రత్యేకత. ‘‘మా అబ్బాయి చేతి రాత బాగుండేది కాదు. కాని మట్టితో బొమ్మలు చేయడం ద్వారా అందమైన రాత అలవాటయ్యింది. అంతకుముందు పెన్సిల్ సరిగ్గా పట్టుకోలేకపోయేవాడు. ఇలా మట్టితో ఆటలు మొదలుపెట్టాక, చేతి వేళ్లు, కండరాలు బలంగా తయారు కావడంతో పెన్సిల్ చక్కగా పట్టుకోగలిగాడు. చక్కగా రాయగలుగు తున్నాడు. టీచర్‌గా నాకున్న అనుభవం మా అబ్బాయిని పెంచుకోవటానికి ఉపయోగపడింది’’ అంటారు దీప్తి. అందరూ ఆసక్తి చూపించారు ‘‘నేను పిల్లల కోసం టాడ్లర్ క్లాసులు ప్రారంభించాను. ఆ క్లాసులో పిల్లలంతా మట్టితో బొమ్మలు తయారు చేస్తారు. పిల్లలు చేసిన బొమ్మలు చూసిన తల్లిదండ్రులు ఆ మట్టి గురించి సమాచారం అడిగారు’’ అంటూ ఆనందంగా చెబుతారు దీప్తి. సాధారణంగా మార్కెట్ లో దొరికే మట్టితో చేసిన బొమ్మలు చాలా త్వర గా ఎండిపోతాయి. ఆ మట్టి ని మళ్లీ ఇంక ఉపయోగించలేం. కాని దీప్తి.. ఉప్పు, పిండి, నూనె, ఫుడ్ గ్రేడ్ కలర్స్, నీళ్లు కలిపి తయారు చేసిన మట్టి ఆరునెలల వరకు గట్టి పడకుండా ఉంటుంది. ‘‘నేను చేసిన మట్టి చూసి తల్లిదండ్రులంతా చాలా సంతోషించారు. వాళ్లకి కూడా ఈ మట్టి కావాలి అని అడిగి కొని తీసుకు వెళ్తున్నారు’’అంటున్న దీప్తి 20 వేల పెట్టుబడితో వ్యాపారం ప్రారంభించి ఇప్పుడు నెలకు 35 వేలు సంపాదిస్తున్నారు. పిల్లలకు ఆరోగ్యంతోపాటు, తనకు ఆదాయం వస్తున్నందుకు చాలా ఆనందంగా ఉంది అంటారు దీప్తి భండారీ. -
‘మట్టి’ పద్మం!
పంట భూమికి పోషకాలను అందించాలన్నా.. చీడపీడల బెడద నుంచి పంటలను కాపాడుకోవాలన్నా కావాల్సిందేమిటి? రసాయనిక ఎరువులు, పురుగుమందులు, చివరకు కషాయాలు కూడా అవసరం లేదు.. కేవలం మట్టి ద్రావణం ఉంటే చాలు. ఇది రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి ఆవిష్కరించిన గొప్ప సంగతి. 12–13 ఏళ్ల నుంచి ద్రాక్ష, వరి, గోధుమ, కూరగాయ పంటలకు ఎరువుగా వేయడం, మట్టి ద్రావణాన్ని ద్రవరూప ఎరువుగా, పురుగుల మందుగా పిచికారీ చేయడం విశేషం. ఆయన పండించిన బియ్యంలో విటమిన్ ఎ ఉందని రుజువైంది. అంతేకాదు.. ప్రపంచ మేధోహక్కుల సంస్థ(వైపో)ను మెప్పించి, 2008లోనే 28 ఐరోపా దేశాల్లో పేటెంట్లు పొందారు. చింతల వెంటకటరెడ్డి ఆవిష్కరణ గురించి ఏప్రిల్ 7, 2014న ‘లోపలి మట్టిలోనే పోషకాల లోగుట్టు’ శీర్షికన సాక్షి ‘సాగుబడి’ సమగ్ర కథనాన్ని ప్రచురించింది. తదనంతరం పత్రికలు, టీవీలు, డిజిటల్ మీడియా ద్వారా చింతల వెంకట రెడ్డి(సి.వి.ఆర్.) సాగు పద్ధతి ఇటీవల విస్తృతంగా ప్రచారంలోకి వచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో పలువురు రైతులు వివిధ పంటలపై మట్టి ద్రావణాన్ని వాడుతూ మండే ఎండల్లోనూ చక్కని పంట దిగుబడులు పొందుతుండడం హర్షదాయకం! ఈ ఏడాది పద్మశ్రీ అవార్డుకు చింతల వెంకటరెడ్డి ఎంపికైన సందర్భంగా ఆయన ఆవిష్కరణ విశేషాలు మరోసారి.. మట్టి ద్రావణం.. కొన్ని మెలకువలు! నేలతల్లి అన్నపూర్ణ. అన్ని పోషకాలకూ నిలయం. అటువంటి మట్టిని సేకరించి పంటల సాగులో పోషకాల కోసం, చీడపీడల సమర్థ నివారణ కోసం వినియోగించుకునే వేర్వేరు పద్ధతులు, ఈ క్రమంలో రైతులు పాటించాల్సిన మెలకువలను రైతు శాస్త్రవేత్త చింతల వెంకటరెడ్డి (సీవీఆర్) ‘సాగుబడి’కి వివరించారు. తెలుగు రాష్ట్రాల్లో అనేక పంటలపై రైతులు మట్టి ద్రావణాన్ని ద్రాక్ష, బొప్పాయి, ఆపిల్ బెర్, దానిమ్మ, బత్తాయి, నిమ్మ, టమాటో, వంగ, బీర, కాకర, దొండ, పూల తోటల్లో వాడుతూ సత్ఫలితాలు పొందుతున్నారన్నారు. అయితే, మల్బరీ తోటపై మట్టి ద్రావణం పిచికారీ చేయరాదని వెంకటరెడ్డి స్పష్టం చేశారు. మట్టి ద్రావణం చల్లిన ఆకులు తింటే పట్టుపురుగులు కూడా చనిపోతాయన్నారు. ఇంటర్వ్యూలో ముఖ్యాంశాలు.. ‘పై మట్టి’ అంటే? సీజనల్ పంటలు లేదా తోటలను తాము సాగు చేసుకుంటున్న భూముల్లో నుంచే మట్టిని సేకరించుకోవాలి. ఇతర భూముల నుంచి సేకరించడం ప్రారంభిస్తే.. ఇతర సమస్యలు తలెత్తుతాయి. భూమి పైన 3–4 అంగుళాల లోతు వరకు ఉన్న మట్టిని ‘పై మట్టి’(టాప్ సాయిల్) అని పిలుస్తున్నాం. దీన్ని వర్షాకాలం ప్రారంభానికి ముందే యంత్రాల సాయంతో సేకరించి, వర్షానికి తడవకుండా నిల్వ చేసుకోవాలి. ఇది అత్యంత సారవంతమైనది కాబట్టి.. పంటల పోషణకు ఉపయోగపడుతుంది. ‘లోపలి మట్టి’ అంటే? పైమట్టిని తొలగించిన తర్వాత అదే భూమిలో మీటరు వెడల్పున 4 అడుగుల లోతు వరకు కందకం తవ్వాలి. ఇలా తవ్వి తీసిన మట్టి మొత్తాన్ని ‘లోపలి మట్టి’ (సబ్ సాయిల్) అని పిలుస్తున్నాం. ఈ మట్టిని కుప్పపోసి, కలియదిప్పాలి. ఆ మట్టి మొత్తాన్నీ లోపలి మట్టిగా వాడుకోవచ్చు. లోపలి మట్టిలో(నల్ల రేగడి మట్టిలో మరింత ఎక్కువ) జిగట ఉంటుంది. ఈ జిగట చీడపీడలను సమర్థవంతంగా అరికట్టడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి, లోపలి మట్టిని ఎండబెట్టి వాడితే పోషకాల శాతం పెరుగుతుంది. ఎండబెట్టకుండానే మట్టి ద్రావణం తయారీలో వాడినా పర్వాలేదు. పంటల పోషణ కోసం పిచికారీ ఇలా.. ఎకరానికి 200 లీ. నీరు+ 15 కిలోల పైమట్టి+ 15 కిలోల లోపలి మట్టిని బాగా కలియదిప్పి.. 45 నిమిషాలు ఉంచాలి. పై తేట నీటిని మాత్రమే వడకట్టి పంటలపై సాయంత్రం 4.30 తర్వాత చల్లపూట పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను మొక్కల మొదళ్ల వద్ద వేసుకుంటే బలం. పంటలకు పోషకాలు అందించడానికి వాడే మట్టి నల్ల రేగడి మట్టి అయితే ఎక్కువ ప్రయోజనకరం. పోషకాల కోసం పైమట్టికి బదులుగా క్వారీల దగ్గర నుంచి సేకరించే రాయిపొడిని వాడితే మరీ మంచిది. చీడపీడల నివారణ కోసం పిచికారీ ఇలా.. ► చీడపీడల నివారణకు జిగట ఉన్న ‘లోపలి మట్టి’ని మాత్రమే నీటిలో కలిపి వాడాలి. ఎర్ర మట్టి అయినా, నల్ల మట్టి అయినా అందులో జిగట ఉంటేనే చీడపీడలు పోతాయి. 200 లీ. నీటిలో 20 కిలోల లోపలి మట్టిని వేసి బాగా కలపాలి. అర గంట తర్వాత పైకి తేరుకున్న 170 లీటర్ల నీటిని పంటలపై పిచికారీ చేయాలి. అడుగుకు చేరిన బురదను పంట మొక్కలు, చెట్ల మొదళ్లలో వేసుకోవచ్చు. పైమట్టిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి పైమట్టిని కూడా కలిపితే చీడపీడలు త్వరగా కంట్రోల్ కావు. ► మట్టి ద్రావణంతోపాటు ఎకరానికి 2 కిలోల ఆవు పేడ, 2 కిలోల ఆవు మూత్రం లేదా లాక్టిక్ యాసిడ్ బాక్టీరియా, చేప అమినో ఆమ్లం కలిపితే.. ఉదయం / సాయంత్రం చల్లని వేళ్లల్లో మాత్రమే పిచికారీ చేయాలి. ► పంటల పోషణకు లేదా చీడపీడల నివారణకు కేవలం మట్టి ద్రావణాన్నే పిచికారీ చేయదలచుకుంటే.. 44 డిగ్రీల ఎండకాసేటప్పుడు మిట్ట మధ్యాహ్నమైనా పిచికారీ చేయొచ్చు. ► కూరగాయ తోటలకైతే మట్టి ద్రావణాన్ని 3–4 రోజులకోసారి పిచికారీ చేయాలి. టమాటో, వంగ, బీర తోటలకు వారానికోసారి కొట్టొచ్చు. ► పంటల పోషణ కోసమైతే మట్టి ద్రావణాన్ని కలిపిన అరగంట తర్వాత వడకట్టి వాడాలి. కలిపిన అరగంట తర్వాత 3–4 గంటలలోపు ఎంత తొందరగా వాడితే అంత మంచిది. ► చీడపీడల నివారణ కోసం కలిపిన లోపలి మట్టి ద్రావణమైతే వడకట్టి నిల్వపెట్టుకొని ఎన్నాళ్ల తర్వాతయినా కలియదిప్పి పిచికారీ చేసుకోవచ్చు. ► ఇతర వివరాల కోసం సికింద్రాబాద్‌లోని ఓల్డ్ ఆల్వాల్ వాస్తవ్యుడైన చింతల వెంకటరెడ్డిని 98668 83336 నంబరులో లేదా e-mail: cvreddyind@gmail.com ద్వారా సంప్రదించవచ్చు. మట్టి ద్రావణం మట్టి ఎరువు, ద్రావణంతో సాగైన ద్రాక్ష తోట -
రాఫెల్ నాదల్కు మళ్లీ చుక్కెదురు
‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్కు వరుసగా రెండో క్లే కోర్టు టోర్నమెంట్లో ఓటమి ఎదురైంది. గతవారం మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సెమీఫైనల్లో ఫాగ్నిని (ఇటలీ) చేతిలో ఓడిపోయిన ఈ స్పెయిన్ స్టార్ తాజాగా బార్సిలోనా ఓపెన్ సెమీఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో పరాజయం పాలయ్యాడు. ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో థీమ్ 6–4, 6–4తో నాదల్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. 15వసారి బార్సిలోనా ఓపెన్‌లో బరిలోకి దిగిన నాదల్ 11సార్లు విజేతగా నిలువడం విశేషం. ఈ టోర్నీ చరిత్రలో నాదల్‌ను ఓడించిన నాలుగో ప్లేయర్‌గా థీమ్ గుర్తింపు పొందాడు. గతంలో కొరెత్యా (2003లో), అల్మాగ్రో (2014లో), ఫాగ్నిని (2015లో) మాత్రమే ఈ ఘనత సాధించారు. -
పొట్ట తగ్గాలా.. అయితే బంకమట్టి తింటే సరి..!
వేల ఏళ్లుగా మానవుడు ఏదో ఓ రూపంలో మట్టి తింటున్నాడు. అందుకే నాటికాలం మనుషులు ఆరోగ్యంగా ఉన్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెక్నాలజీ, తెలివీ పెరిగాక చేతులకు సబ్బులూ, వాష్‌లతో కడిగి మట్టికి బదులు రసాయనాలు తింటూ జబ్బు పడుతున్నారు. మట్టి తినడమే శరీరానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరీ.. పొట్ట తగ్గుతుందని వెంటనే బంకమట్టిని తినకండోయ్! అది వాళ్లు స్పెషల్‌గా ప్రాసెస్ చేసిన బంకమన్నట! ఎలుకలపై చేసిన ఈ పరిశోధనలో.. తొలుత కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, కొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్ బంక మన్నూ ఇచ్చారు. ఇలా రెండు వారాలపాటు వారు అధ్యయనం కొనసాగించారు. డ్రగ్ తీసుకున్న ఎలు కల్లో కంటే మట్టి తిన్న ఎలుకల్లో వెయిట్‌లాస్ స్పష్టంగా కనపడినట్లు గుర్తించారు. రెండు గ్రూపులను పోల్చి చూడగా.. మట్టి తిన్న ఎలుకల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడలేదని, అవి ఆరోగ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్ని మనుషులపై ప్రయోగించడానికి తమ అధ్యయనం ఇంకా కొనసాగిస్తున్నామని వారు చెప్పారు. -
యథేచ్ఛగా మట్టి అక్రమ రవాణా..
-విషయాన్ని తహసీల్దార్‌కు తెలిపిన విలేకరులు - ఇరిగేషన్ ఏఈకి తహసీల్దార్ క్లాస్ - చివరకు పోలీసులకు ఫిర్యాదు చేసిన ఏఈ - మట్టి తరలింపును అడ్డుకున్న పోలీసులు మిడుతూరు : మండలంలోని మద్దిగుండం చెరువు నుంచి మట్టి అక్రమంగా తరలిపోతోంది. నందికొట్కూరు నియోజకవర్గ అధికార పార్టీ నేత అండదండలతో మండలంలోని పలు గ్రామాలకు చెందిన టీడీపీ నేతలు ఈ చర్యలు పాల్పడతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇంత జరుగుతున్నా మైనర్ ఇరిగేషన్ అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముందస్తు అనుమతులు.. మద్దిగుండం చెరువులో 20 రోజుల కిత్రం ఓ నీటి సంఘం చైర్మన్‌కు మైనర్ ఇరిగేషన్ అధికారులు రైతుల పొలాలకు మట్టిని తవ్వుకునేందుకు అనుమతులు ఇచ్చినట్లు సమాచారం. జిల్లా కలెక్టర్ నీరు – ప్రగతి కార్యక్రమంలో భాగంగా చెరువుల్లో పూడికతీత పనులకు అనుమతులు మంజూరు చేయకమునుపే మైనర్ ఇరిగేషన్ అధికారులు సదరు చైర్మన్‌కు అనుమతివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ట్రాక్టర్‌కు రూ.100 వసూలు మద్దిగుండం చెరువు సమీపంలోని గ్రామాలకు చెందిన కొందరు నాయకులు సైతం అక్రమంగా మట్టిని తవ్వుకునేందుకు ఆరు హిటాచీలను ఏర్పాటు చేసినట్లు తెలిసింది. ఒక్కో ట్రాక్టర్ మట్టికి రూ.90 నుంచి రూ.100 దాకా వసూలు చేస్తున్నట్లు రైతులు, ట్రాక్టర్లు డ్రైవర్లు పేర్కొంటున్నారు. విలేకరుల చొరవతో.. మట్టిని అక్రమంగా తరలిస్తున్న విషయాన్ని విలేకరులు తహసీల్దార్ భూలక్ష్మి, మైనర్ ఇరిగేషన్ ఏఈ లక్కప్ప దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన తహసీల్దార్ వెంటనే మైనర్ ఇరిగేషన్ ఏఈతో ఫోన్లో మట్టి తవ్వకం పనులపై ఆరా తీశారు. మట్టి తరలింపుతో చెరువుకట్ట బలహీనమై ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని తహసీల్దార్ హెచ్చరించారు. దీంతో చివరకు ఆయనస్థానిక పోలీస్ స్టేషన్‌కు చేరుకొని ఎస్ఐ సుబ్రహ్మణ్యంకు మౌఖిక ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సిబ్బందిని పంపించి పనులను నిలిపివేయించారు. ఇదిలా ఉండగా వారం రోజులపైబడి తవ్వకం పనులు జరుగుతున్నా అధికార పార్టీ ఒత్తిడితో స్పందించని మైనర్ ఇరిగేషన్ అధికారులు పాత్రికేయులు మట్టి తరలింపును పరిశీలించే ందుకురావడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే అక్రమ తవ్వకందారులపై ఎలాంటి చర్యలు చేపట్టకుండా వదలివేయడం పట్ల రైతులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. -
హస్తకళాక్లేళి
బంకమన్ను (క్లే)తో పిల్లలు ఆడుకోవడం చూసే ఉంటారు. క్లేతో వారు రకరకాల బొమ్మలు చేస్తారు. తర్వాత క్లేని ముద్దలా చేసి దాచుకుంటారు. అయితే రేవతికి అలాంటి క్లే పనికిరాదు. ఒకసారి ఒక ఆకృతిలోకి మలిస్తే ఇక అదెప్పటికీ అదే ఆకృతిలో ఉండిపోవాలి. కానీ అలాంటి వండర్ క్లే మార్కెట్లో లేదే! రేవతి ఆలోచించారు. ప్రయోగాలు చేశారు. ఎంతో ముడిసరుకును వృథా చేశారు. చివరికి విజయం సాధించారు. వండర్ క్లే తయారైంది! దానికావిడ ‘ఆర్ట్ క్లే’అని పేరు పెట్టారు. అదిప్పుడు ‘రేవతి ఆర్ట్ క్లే’ గా కూడా వ్యవహారంలో ఉంది. ఇంతటి ఘనత సాధించిన రేవతి నేపథ్యం ఏమిటి? మహిళలకు ఆమె ఇచ్చిన స్ఫూర్తి ఎలాంటిది? రేవతి పశ్చిమగోదావరి జిల్లా భీమవరం అమ్మాయి. తండ్రి శ్రీపాద భగవన్నారాయణ స్వాతంత్య్ర సమరయోధులు. ఇంట్లో తనే చిన్న. ఇద్దరన్నయ్యలు, ఐదుగురు అక్కలు. రేవతికి చిన్నప్పటి నుంచి బొమ్మలు చేయడం ఇష్టం. రేగడిమట్టితో బొమ్మలు చెయ్యడం, పేపర్‌పై స్కెచ్‌లు వేయడం.. ఇదే ఆమె లోకం. దాంతో పెద్దన్నయ్య ఆమెను గుంటూరులోని మహిళా కళాశాలలో బి.ఎ ఫైన్ ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సులో చేర్పించారు. బి.ఎ మొదటి సంవత్సరం పూర్తికాగానే పెళ్లయింది. భర్త ఎయిర్‌ఫోర్స్ అధికారి. చండీగఢ్‌లో ఉద్యోగం. దాంతో రేవతి ఫైన్ ఆర్ట్స్ కోర్సు పూర్తి చేయలేకపోయారు. టర్నింగ్ పాయింట్ రేవతికి ఇద్దరబ్బాయిలు. వాళ్లు పెద్దయి, పెళ్లిళ్లయిన తర్వాత ఆమెకు ఖాళీ దొరికింది. పద్దెనిమిదవ యేట అర్ధంతరంగా ఆపేసిన చదువుని కొనసాగించాలని ఎం.ఎ ఇంగ్లిష్‌లో చేరారు. కొంతకాలం పిల్లల దగ్గర గడుపుదామని అమెరికా వెళ్లారు. ఓరోజు వాళ్లబ్బాయి మార్కెట్లో కనిపించిన పేపర్ క్లే చూపించి ‘బొమ్మలు చేసుకోవడానికి బావుంటుంది’ అని తీసిచ్చాడు. ‘‘దాంతో బొమ్మలు చాలా అద్భుతంగా వస్తాయి. అలా మళ్లీ నాకిష్టమైన బొమ్మలు చేయడం మొదలుపెట్టాను. పద్దెనిమిదవ యేట మానేసిన ఆర్ట్స్ అండ్ స్కల్ప్చర్ కోర్సుని యాభై దాటిన తర్వాత సొంత ప్రయోగాలతో పట్టాలెక్కించాను’’ అని చెప్పారు రేవతి. ఆ ప్రయోగాలలో ఒకదాని ఫలితమే మూడేళ్ల క్రితం ఆమె కనిపెట్టిన ఎకో ఫ్రెండ్లీ ‘ఆర్ట్ క్లే’. అన్నీ ఆహారపదార్థాలే! ఆర్ట్ క్లే కోసం రేవతి వాడే ముడిసరుకు అంతా ఆహార పదార్థాల మిశ్రమం. రంగులు కూడా ఫుడ్ కలర్సే కావడంతో ఈ క్లేతో ఎంతసేపు పని చేసినా చేతులకు, చర్మానికి, కళ్లకు, శ్వాసకోశానికి ఎటువంటి హాని కలగదు. పైగా ఆమె కనిపెట్టిన క్లే, పేపర్ క్లే లాగానే మృదువైనది. క్లే ఆరిన తర్వాత కనిపించే కొద్దిపాటి పెళుసుదనం కూడా అందులో ఉండదు. ఒకసారి ఒక రూపం ఇచ్చి ఇరవైనాలుగ్గంటలపాటు కదల్చకుండా ఉంచితే ఇక అది అలాగే ఆరిపోయి ఆకారం శాశ్వతంగా ఉండిపోతుంది. ఆ క్లేతో చేసిన పూలలో దుమ్ము చేరినా సబ్బు నీటిలో జాడించి శుభ్రం చేసుకోవచ్చు. కుటీర పరిశ్రమగా... హైదరాబాద్‌లోని బేగంపేటలో ‘రేవతి ఆర్ట్ క్లే హ్యాండీక్రాఫ్ట్స్’ ఉంది. అందులో ఎందరో మహిళలు శిక్షణ పొందుతున్నారు. ఆసక్తితో మొదలు పెట్టి, ఇలా కుటీర పరిశ్రమగా ఓ యూనిట్‌ను వృద్ధి చేశారు రేవతి. ఇప్పుడది వ్యాపార పరిశ్రమగా కూడా విస్తరించడానికి సిద్ధంగా ఉంది. అందమైన ఆకృతికి రూపం ఇవ్వడంలో నైపుణ్యం ఉంది కానీ మార్కెట్ చేసే చాకచక్యం తనలో లేదంటారామె. ప్రభుత్వం నుంచి పేటెంట్ పరీక్ష ఎదుర్కొన్న తర్వాత తనలా ఆసక్తి ఉన్నవారితో కలిసి మార్కెట్లోకి రావాలన్నది ఆమె ఆలోచన. అరవై ఆరేళ్ల వయసులో కూడా రేవతి ఇంత ఉత్సాహంగా ఉండడానికి కారణం... ఎప్పుడూ సృజనాత్మకంగా ఆలోచించడం, ఆలోచనకు ఒక రూపం ఇచ్చి మురిసిపోవడం, పదిమందికి నేర్పించి తృప్తి పొందడమే కావచ్చు. ఫొటోలు: శివ మల్లాల క్లే తయారీ కోసమే ఓ యంత్రం! నా క్లే తో శిల్పాలు, సీనరీలు, పూలు చేయవచ్చు. ఒకసారి తయారైన క్లే ఆరు నెలలపాటు తాజాగా ఉంటుంది. ఆ తర్వాత కూడా జిగురు తగ్గుతుంది తప్ప ఫంగస్ రాదు. మార్కెట్లో దొరికే మామూలు యంత్రానికి మరికొన్ని విడిభాగాలు చేర్చి ఈ క్లే తయారీ కోసం ప్రత్యేకంగా తయారు చేయించుకున్నాను. రోజుకు వంద కిలోల క్లే తయారు చేయగలను. - రేవతి, ఆర్ట్ క్లే రూపకర్త