
‘క్లే కింగ్’ రాఫెల్ నాదల్‌కు వరుసగా రెండో క్లే కోర్టు టోర్నమెంట్‌లో ఓటమి ఎదురైంది. గతవారం మోంటెకార్లో ఓపెన్ మాస్టర్స్ సిరీస్ సెమీఫైనల్లో ఫాగ్‌నిని (ఇటలీ) చేతిలో ఓడిపోయిన ఈ స్పెయిన్ స్టార్ తాజాగా బార్సిలోనా ఓపెన్ సెమీఫైనల్లో డొమినిక్ థీమ్ (ఆస్ట్రియా) చేతిలో పరాజయం పాలయ్యాడు.
ఏకపక్షంగా జరిగిన సెమీఫైనల్లో థీమ్ 6–4, 6–4తో నాదల్‌ను ఓడించి ఫైనల్‌కు చేరాడు. 15వసారి బార్సిలోనా ఓపెన్‌లో బరిలోకి దిగిన నాదల్ 11సార్లు విజేతగా నిలువడం విశేషం. ఈ టోర్నీ చరిత్రలో నాదల్‌ను ఓడించిన నాలుగో ప్లేయర్‌గా థీమ్ గుర్తింపు పొందాడు. గతంలో కొరెత్యా (2003లో), అల్మాగ్రో (2014లో), ఫాగ్‌నిని (2015లో) మాత్రమే ఈ ఘనత సాధించారు.
Comments
Please login to add a commentAdd a comment