
వేల ఏళ్లుగా మానవుడు ఏదో ఓ రూపంలో మట్టి తింటున్నాడు. అందుకే నాటికాలం మనుషులు ఆరోగ్యంగా ఉన్నారని శాస్త్రవేత్తలు అంటున్నారు. టెక్నాలజీ, తెలివీ పెరిగాక చేతులకు సబ్బులూ, వాష్‌లతో కడిగి మట్టికి బదులు రసాయనాలు తింటూ జబ్బు పడుతున్నారు. మట్టి తినడమే శరీరానికి మేలని, బంకమట్టి తింటే పొట్ట తగ్గుతుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు జరిపిన తాజా అధ్యయనంలో వెల్లడైంది. మరీ.. పొట్ట తగ్గుతుందని వెంటనే బంకమట్టిని తినకండోయ్! అది వాళ్లు స్పెషల్‌గా ప్రాసెస్ చేసిన బంకమన్నట!
ఎలుకలపై చేసిన ఈ పరిశోధనలో.. తొలుత కొన్ని ఎలుకలకు ఒబేసిటీ మెడిసిన్, కొన్ని ఎలుకలకు ప్రాసెస్డ్ బంక మన్నూ ఇచ్చారు. ఇలా రెండు వారాలపాటు వారు అధ్యయనం కొనసాగించారు. డ్రగ్ తీసుకున్న ఎలు కల్లో కంటే మట్టి తిన్న ఎలుకల్లో వెయిట్‌లాస్ స్పష్టంగా కనపడినట్లు గుర్తించారు. రెండు గ్రూపులను పోల్చి చూడగా.. మట్టి తిన్న ఎలుకల్లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ కనబడలేదని, అవి ఆరోగ్యంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఈ బంకమట్టిలోని సన్నటి మురికి లాంటి పదార్థం పేగుల్లోని కొవ్వును పీల్చేస్తున్నట్లు శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీన్ని మనుషులపై ప్రయోగించడానికి తమ అధ్యయనం ఇంకా కొనసాగిస్తున్నామని వారు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment