కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా | Benefits Of Coconut In Telugu | Sakshi
Sakshi News home page

కొబ్బరిబోండంతో ఎన్ని ప్రయోజనాలో తెలుసా

Published Wed, May 27 2020 11:09 AM | Last Updated on Wed, May 27 2020 11:42 AM

Benefits Of Coconut In Telugu - Sakshi

వేసవి అనగానే గుర్తుకు వచ్చేది కొబ్బరిబోండం. ఈ కొబ్బరి నీళ్ల ప్రయోజనాలు అన్నీఇన్నీ కావు. అందుకే పోషకాల నిధిగా పేరుపొందుతుంది. ఇందులో విటమిన్లు, మినరల్స్, ఎలక్ట్రోలైట్స్, ఎంజైమ్‌లు, ఎమైనో యాసిడ్స్, సైటోకిన్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఎండ వేడిమికి అలసిపోయిన శరీరానికి ఎన్నో సుగుణాలు, పోషక విలువలు ఉన్న కొబ్బరి నీళ్లు హుషారునిస్తాయి. 

♦   కొబ్బరిబోండంలో ఎమైనో ఆమ్లాలు, ఎంజైమ్‌లు, ఆహార ఫైబర్, విటమిన్‌ సీ, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్‌ వంటి ఖనిజ సంపద పుష్కలంగా ఉంటుంది. క్లోరైడ్‌లు, కొలెస్ట్రాల్‌లు తక్కువ మోతాదులో ఉంటాయి.
♦   ఎండలో తిరిగి వచ్చిన వారికి వడదెబ్బ తగలకుండా చేస్తాయి. గుండె నీరసాన్ని పోగొడుతుంది. ఫైల్స్‌ నివారణకు ఉపయోగపడుతుంది.
♦   కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్‌ పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఇది శరీర ద్రవాలలో ఎలక్ట్రోలైట్‌ను తిరిగి భర్తీ చేస్తుంది. 
♦   ఇవి తేమకోసం సిరల ద్వారా పంపే ద్రవంలా ఉపయోగపడతాయి. వైద్య సదుపాయాలు అందుబాటులో లేని లోతట్టు ప్రాంతాల్లో ప్రమాదకరమైన జబ్బులతో బాధపడుతున్న రోగులకు పునరుజ్జీవం కలిగిస్తాయి.

ఉపయోగాలు
► ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలనే కోరికను కొబ్బరినీళ్లు తగ్గిస్తాయి. మధుమేహం ఉన్న వారికి మంచిది. ఇది చక్కెర స్థాయిలను నియంత్రించి అవసరమైన పోషకాలను అందిస్తాయి. 
► ఒక వ్యక్తి శరీరం ఫ్లూ లేదా సలిపి రెండు రకాల బ్యాక్టీరియాల బారిన పడినప్పుడు ఇవి వైరల్, బ్యాక్టీరియాలను అరికట్టడానికి బాగా ఉపయోగపడతాయి. 
► కొబ్బరి నీళ్లలో పొటాషియం ఎక్కువగా ఉండటం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. రక్తపోటు, గుండెపోటు వంటి ప్రమాదాలను తగ్గించటానికి కూడా ఉపయోగపడతాయి. 
► కొబ్బరినీళ్లలోని ఖనిజాలు, పొటాషియం, మెగ్నీషియం వల్ల మూత్రపిండాలలో రాళ్లు వచ్చే ప్రమాదాలను కూడా తగ్గించవచ్చు. 
► మొటిమలు, మచ్చలు, ముడతలు, సాగిన గుర్తులు, సెల్యులైట్, తామర వంటి వాటిపై కొబ్బరినీళ్లను రెండు, మూడు వారాల పాటు రాసి వదిలేస్తే అది చర్మాన్ని శుభ్రపరుస్తుంది. 
► కేన్సర్‌ను తగ్గించే కారకాలు రక్తప్రసరణకు ఉపయోగకరంగా ఉండే సైటోకినిన్లను కలిగి ఉంటాయని పరిశోధనలు నిరూపించాయి. 
► ఈ నీళ్లలో సెలేనియం, యాంటీఆక్సిడెంట్‌ లక్షణాల వంటి కొన్ని మిశ్రమాలు ఉండడం వల్ల ఇవి కేన్సర్‌పై పోరాటం చేస్తాయని ప్రయోగశాలలో రుజువైంది.
► ఇందులో ఆమ్ల ఫాస్పటేస్, కాటలేస్, హైడ్రోజినస్, డయాస్టెస్, పెరాక్సిడేస్, ఆర్‌ఎన్‌ఏ, పాలిమెరాసేస్‌ లాంటి జీవ ఎంజైమ్‌లు ఉంటాయి. 
► పెద్దగా స్థిరత్వం లేనప్పటికీ ఈ నీళ్లలో కాల్షియం, ఐరన్, మాంగనీస్, మెగ్నీషియం, జింక్‌ లాంటి ఖని జా లు నారింజ లాంటి పళ్లలో కన్నా ఎక్కువగా ఉంటాయి. 
► ఈ నీళ్లలో థయామిన్, ఫైరిడాక్సిన్, ఫోలేట్‌ లాంటి బీ–కాంప్లెక్స్‌ విటమిన్‌లు పుష్కలంగా దొరుకుతాయి. 
► కొబ్బరినీళ్లలో ఎలక్ట్రోలైట్‌ పొటాషియం పుష్కలంగా ఉంటుంది. 100 మిల్లీలీటర్ల కొబ్బరినీళ్లలో 250 మిల్లీ గ్రాముల పొటాషియం, 105 మిల్లీ గ్రాముల సోడియం లభిస్తాయి. ఈ  రెండు ఎలక్ట్రోలైట్లు కలిసి శరీరంలో విరేచనాల వలన తగ్గిన ఎలక్రోటైట్లను పునరుత్పత్తి చేస్తాయి. పైగా తాజా కొబ్బరినీళ్లలో విటమిన్‌–  సీ కూడా ఉంటుంది. 
► లేత కొబ్బరినీళ్లు దాహానికి మంచి పానీయం. అలసటను తగ్గించి మూత్రం సాఫీగా అయ్యేలాగా చేస్తాయి. దగ్గు, అస్తమా, అజీర్తితో బాధపడేవారికి మాత్రం కొబ్బరినీళ్లు అంత మంచివి కావు.
► కొబ్బరినీళ్లు, బార్లీ నీళ్లు కలిపి గర్భిణులకు ఇస్తే మూత్ర విసర్జన సమయంలో మంటను నివారిస్తుంది. 
► పిల్లలకు పచ్చి కొబ్బరి ముక్కలను, బెల్లంతో కలిపి తినేలా చేస్తే పళ్లు దృఢంగా మారతాయి. చిగుళ్లు, దంత సమస్యలు రావు. 
► పచ్చి కొబ్బరి పాలలో గసగసాలు రుబ్బి తీసిన పాలను, తేనెను కలిపి తాగితే  పొడిదగ్గు, చాతిలో మంట, డయేరియా వంటి వాటిని నివారించవచ్చు. 
► కొబ్బరినీళ్లు ముఖానికి మంచి క్లీనర్‌గా పనిచేస్తాయి. ఈ నీటితో ముఖం కడుక్కుంటే మొటిమలు, బ్లాక్‌హెడ్స్‌ పోతాయి.
► కొబ్బరినీళ్లలో సమానంగా నిమ్మరసం కలిపి చిటికెడు పసుపు అరికాళ్లకు పూస్తే పాదాలు, అరచేతుల్లోని చురుకు మంటను నివారిస్తుంది. 
► పిల్లల పెరుగుదలకు కొబ్బరినీళ్లు బాగా పనిచేస్తాయి. శరీరంలోని వేడిని త్వరగా తగ్గించి సత్వర శక్తిని ఇస్తుంది. 
► గుండె, కాలేయం, కిడ్నీ వ్యాధులతో బాధ పడేవారికి కొబ్బరినీళ్లు ఎంతగానో ఉపయోగపడతాయి. 
► డయేరియాతో బాధపడేవారికి కొబ్బరినీళ్లు, నిమ్మరసం కలిపి ఇస్తే మేలు కలుగుతుంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement