‘ఈ జన్మమే రుచి చూడడానికి దొరికెరా..’ అంటూ వేడి అన్నంలోకి నెయ్యి, పప్పు, ఆవకాయ, అప్పడాలు ఇలా ఎన్నో రకరకాల వంటకాలను తింటుంటారు భోజన ప్రియలు. అదే ప్రతిరోజూ ప్రతిపూట ఒకే ఆహారం తినాల్సి వస్తే? ఆ బాధ వర్ణించరానిది. అలాంటిది ఒక వ్యక్తి ఎంతో ఇష్టంగా ఒకే ఆహారాన్ని గత రెండు దశాబ్దాలుగా తీసుకుంటున్నాడు.
కేరళలోని కాసరగోడ్‌కు చెందిన బాలకృష్ణ పలాయి, గత ఇరవై ఎనిమిది సంవత్సరాలుగా కేవలం కొబ్బరి నీళ్లు, కొబ్బరి కాయలు తింటూ జీవితం సాగిస్తున్నాడు.ఎందుకంటే, అతనికి ‘గ్యాస్ట్రో ఈసోఫాగల్ రిఫ్లెక్స్ డిసీజ్ (జీఈఆర్‌డీ). ఈ జబ్బుతో బాధపడేవారి అన్నవాహిక చివర ఉండే కండరం సరిగ్గా మూసుకోదు. దీంతో, ఏ ఆహారం తిన్నా గుండెల్లో మంట, వాంతులు, కడుపు ఉబ్బరంతో నీరసించి, ఒక్కోసారి కుప్పకూలిపోతారు కూడా.
బాలకృష్ణకు కూడా ఇదే పరిస్థితి. ఆసుపత్రుల చుట్టూ తిరుగుతూ, తక్కువ మొత్తంలో ఆహారం తిసుకునేవాడు. కాలక్రమంలో తనకు కొబ్బరి నీళ్లతో ఏ ఇబ్బంది లేదని గ్రహించాడు. తర్వాత కొంచెం లేత కొబ్బరిని ప్రయత్నించాడు. దాంతో కూడా ఏ ఇబ్బంది లేకపోవడంతో ఇక తన ఆహారం కేవలం కొబ్బరి మాత్రమేనని నిర్ణయించుకున్నాడు.
కొబ్బరినీళ్లతో బోలెడు ప్రయోజనాలు
► కొబ్బరినీళ్లలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ వైరల్ లక్షణాలు ఉంటాయి. ఇవి అనేకరకాల వ్యాధులను దూరం చేస్తాయి.
► కొబ్బరినీళ్లలో 94 శాతం నీరు ఉంటుంది. ఇది వ్యార్థాలను తొలగించి శరీరాన్ని డీటాక్స్ చేస్తాయి.
► కొబ్బరినీళ్లలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని బలోపేతం చేస్తుంది. ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది.
► జీర్ణక్రియ ప్రక్రియను మెరుగుపర్చడమే కాకుండా పొట్ట సంబంధిత వ్యాధులను దూరం చేస్తుంది.
► రోజూ కొబ్బరినీళ్లు తాగడం వల్ల అధిక రక్తపోటును నివారిస్తుంది.
► గుండెజబ్బులు, హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించడంలో కొబ్బరినీళ్లు ముఖ్య పాత్ర వహిస్తుంది.
కొబ్బరిలో ఎన్నో మినరల్స్, కాల్షియం, సోడియం, పొటాషియం, మెగ్నీషియం ఉంటాయి, కాబట్టి బాలకృష్ణ ఆరోగ్యంగా ఉన్నాడు. అంతేకాదు, లోకల్ క్లబ్‌లో తనకెంతో ఇష్టమైన ఫుట్‌బాల్ ఆడుతూ ఫుట్‌బాల్ ప్లేయర్‌గానూ విజయాలు సాధిస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment