Summer Tips: Top 9 Amazing Health Benefits Of Barley Water In Telugu - Sakshi
Sakshi News home page

Barley Water Health Benefits: బార్లీ నీళ్లు.. అద్భుత ప్రయోజనాలు.. రోజూ గ్లాసుడు తాగారంటే!

Published Sat, May 7 2022 11:53 AM | Last Updated on Sat, May 7 2022 12:36 PM

Summer Tips: Surprising Health Benefits Of  Barley Water In Telugu - Sakshi

Summer Care-  Health Benefits Of  Barley Water: వేసవి వచ్చేసింది... వేడితో అనేక సమస్యలు ఎదురవుతాయి. అన్నం తినాలనిపించదు, తినకపోతే ఆకలి. డీహైడ్రేషన్‌ సమస్యలు తప్పవు. అయితే వేసవిలో ముడిపడి ఉండే ఇటువంటి సమస్యలకు బార్లీనీళ్లతో చెక్‌ పెట్టొచ్చు. కేవలం వేసవి సమస్యలకే కాదు... అనేక ఆరోగ్య సమస్యలకు బార్లీ బాగా పని చేస్తుంది. 

పూర్వం రోజుల్లో ఎవరికైనా జ్వరం వచ్చిందంటే నీరసం నుంచి కోలుకోవడానికానికి బార్లీ నీళ్లు, సగ్గుజావ తాగించేవాళ్లు పెద్దలు. అయితే, కేవలం జ్వరంలోనే కాదు, బార్లీ వాడకం ఎప్పుడూ మంచిదే. వేసవిలో ఇంకా మంచిది. అదెలాగో చూద్దాం. 

వేసవిలో తిన్నది అరగక పోవడం సాధారణ సమస్య. అలాంటప్పుడు బార్లీ నీళ్లు తాగితే చాలా మంచిది. జీర్ణాశయం కూడా చాలా శుభ్రపడుతుంది. అజీర్తి దూరమవుతుంది.
పిల్లలకు బార్లీ నీళ్లు తాగిస్తే మంచి ఫలితం ఉంటుంది.
మలబద్దకం వంటి సమస్యలు దరి చేరవు. ఎండప్రభావం పడకుండా ఉండాలన్నా, వడదెబ్బ తగలకుండా ఉండాలన్నా ఈ నీళ్లు తాగాలి.
మధుమేహులకు బార్లీ చాలా మేలు చేస్తుంది. రక్తంలోని చక్కెర స్థాయులను అదుపులో ఉంచుతుంది. ఇన్సులిన్‌ కూడా అదుపులోనే ఉంటుంది. 
ఇక గర్భిణులు రోజూ బార్లీనీళ్లు తాగితే మరీ మంచిది. కాళ్ల వాపు సమస్య వారి దరిచేరదు. రోజులో ఉదయం, సాయంత్రం బార్లీ నీళ్లు తాగితే బిడ్డ ఆరోగ్యం కూడా బాగుంటుంది. అలసట కూడా త్వరగా రాదు.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా బార్లీ నీళ్లు బాగా ఉపయోగపడతాయి.
రక్తంలో కొలెస్ట్రాల్‌ శాతాన్ని తగ్గిస్తాయి. దీని ద్వారా గుండె సంబంధిత వ్యాధులు దూరంగా ఉంటాయి. రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది.
మహిళలను తరచూ బాధించే ప్రధాన సమస్య మూత్రనాళ ఇన్ఫెక్షన్‌. ఈ సమస్యను దూరం చేసుకోవాలంటే ఉదయాన రోజూ గ్లాసుడు బార్లీ నీళ్లు తాగితే మంచి ఫలితం ఉంటుంది.
మూత్రంలో ఇన్ఫెక్షన్లు కలిగించే కారకాలు, వ్యర్థాలు బయటికి పోతాయి. సూక్ష్మమైన రాళ్లు కూడా కరిగిపోతాయి. ఇకనైనా బార్లీ నీళ్లు ట్రై చేస్తారు కదూ!

చదవండి👉🏾Patika Bellam Health Benefits: పటికబెల్లం ఆరోగ్య ప్రయోజనాలు తెలుసా? కానీ ఎక్కువ తిన్నారంటే
చదవండి👉🏾Health Tips: గ్యాస్ట్రిక్‌ నొప్పి వస్తే గుండెనొప్పిలా అనిపిస్తుంది.. తేడా తెలుసుకోవడం ఎలా?
చదవండి👉🏾Mango Health Benefits: సీజన్‌ కదా అని మామిడి పండ్లు లాగించేస్తున్నారా? ఇందులోని క్వార్సెటిన్‌ వల్ల..

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement