ప్రతీకాత్మక చిత్రం
వేసవి కాలం మొదలైంది. ఇప్పటికే ఎండలు ముదిరిపోయాయి. ఉదయం పదకొండు దాటిందంటే సూర్యుడు సుర్రుమంటున్నాడు. మరి.. ఇలాంటి సమయంలో ఎలాంటి జాగ్రత్తలు లేకుండా బయటకు వెళ్తే సన్‌స్ట్రోక్(వడదెబ్బ) తగిలితే అంతే సంగతులు! ఈ గడ్డు కాలాన్ని దాటాలంటే లక్షణాలను ముందే పసిగట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. అప్పుడే సాంత్వన చేకూరుతుంది.
లక్షణాలు:
►తలనొప్పి, తల తిరగడం, మెదడు బ్లాంక్‌గా మారి అయోమయంలోకి జారిపోవడం
►ఆకలి నశించడం, అనారోగ్యంగా అనిపించడం, ఫలానా సమస్య అని స్పష్టంగా తెలియకపోవడం, అలసట
►చేతులు, కాళ్లు, కడుపు కండరాల నొప్పులు, పట్టేసినట్లు ఉండడం
►ఊపిరి తీసుకోవడంలో వేగం పెరగడం
►దేహం ఉష్ణోగ్రతలు పెరగడం...
►పిల్లలైతే ఊరికే పడుకోవడానికి ఇష్టపడుతుంటారు. సాధారణంగా కంటే ఎక్కువ సమయం నిద్రపోతుంటారు. లేచిన తర్వాత కూడా హుషారుగా ఉండలేకపోతారు. ఈ లక్షణాలు కనిపిస్తే సన్‌స్ట్రోక్ నుంచి సాంత్వన కోసం వైద్యం చేయాల్సిందే.
సాంత్వన ఇలాగ
►ఎండ నుంచి వెంటనే చల్లటి ప్రదేశంలోకి మారాలి.
►పడుకుని పాదాలను కొంచెం ఎత్తులో ఉంచాలి.
►డీ హైడ్రేషన్‌కు గురయిన దేహం తిరిగి హైడ్రేషన్ పొందడానికి ఇన్‌స్టంట్ రీ హైడ్రేషన్ ద్రవాలను తాగాలి.
►తడి టవల్‌తో దేహాన్ని, పాదాలను, అరచేతులను, ముఖాన్ని, మెడను తరచుగా తుడవాలి. ∙గాలి ధారాళంగా తగిలేటట్లు, హాయిగాఊపిరి పీల్చుకోగలిగిన స్థితిలో విశ్రాంతి తీసుకోవాలి.
►ఈ జాగ్రత్తలు పాటిస్తే అరగంట సేపటికి వడదెబ్బ నుంచి దేహం సాంత్వన పొందుతుంది. తీవ్రంగా వడదెబ్బ బారిన పడినప్పుడు నీళ్లు, ఇతర రీ హైడ్రేషన్ ద్రవాలు ఏవి తాగినా వాంతి అవుతుంది. అలాంటప్పుడు వెంటనే వైద్యుని పర్యవేక్షణలో సెలైన్ పెట్టించుకోవాల్సి ఉంటుంది.
చదవండి: Health Tips: ఉడికించిన శనగలు, బొబ్బర్లు తిన్నారంటే.. ఇక
Comments
Please login to add a commentAdd a comment