సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పుచ్చకాయ!
పరిపరి శోధన
పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహించి, అంగస్తంభన సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. నిజానికి సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అందులో పుష్కలంగా లభ్యమయ్యే పోషకానికి ఆ పేరు పెట్టారు.
అయితే ఆరోగ్యం కోసం తినాలే తప్ప అంగస్తంభన కోసం మాత్రమే అదేపనిగా పుచ్చకాయ తినవద్దని ఈ అధ్యయనాల్లో పాల్గొన్న డాక్టర్ భీమూ పాటిల్ అనే నిపుణుడు హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనను కలిగించే టాబ్లెట్ల అంతటి ప్రభావం చూపించాలంటే కిలోల కొద్దీ పుచ్చకాయ ముక్కలను తినాల్సి ఉంటుందని, అది సరికాదని ఆయన పేర్కొంటున్నారు.