Texas A & M University
-
సెక్స్ సామర్థ్యాన్ని పెంచే పుచ్చకాయ!
పరిపరి శోధన పుచ్చకాయలోని సిట్రులిన్ అనే పోషకం వల్ల రక్తనాళల్లోకి రక్తం వేగంగా ప్రవహించి, అంగస్తంభన సామర్థ్యాలు పెరుగుతాయని పేర్కొంటున్నారు టెక్సస్ ఏ అండ్ ఎమ్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు. నిజానికి సిట్రులిన్ అనేది ఒక అమైనో యాసిడ్. లాటిన్ భాషలో పుచ్చకాయను సిట్రులిన్ అంటారు. అందులో పుష్కలంగా లభ్యమయ్యే పోషకానికి ఆ పేరు పెట్టారు. అయితే ఆరోగ్యం కోసం తినాలే తప్ప అంగస్తంభన కోసం మాత్రమే అదేపనిగా పుచ్చకాయ తినవద్దని ఈ అధ్యయనాల్లో పాల్గొన్న డాక్టర్ భీమూ పాటిల్ అనే నిపుణుడు హెచ్చరిస్తున్నారు. అంగస్తంభనను కలిగించే టాబ్లెట్ల అంతటి ప్రభావం చూపించాలంటే కిలోల కొద్దీ పుచ్చకాయ ముక్కలను తినాల్సి ఉంటుందని, అది సరికాదని ఆయన పేర్కొంటున్నారు. -
సాంబరెడ్డికి అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో..
ప్రపంచంలో 15 అత్యంత ప్రతిభావంత శాస్త్రవేత్తల్లో స్థానం వరంగల్: వరంగల్ జిల్లాకు చెందిన ఫార్మసీ వైద్య శాస్త్రవేత్త, అమెరికాలో టెక్సాస్ ఏ అండ్ ఎం వర్సిటీ ప్రొఫెసర్ సాంబరెడ్డికి ప్రతిష్టాత్మక అమెరికా ఫార్మా సొసైటీ ఫెల్లో(ఏఏపీఎస్) అవార్డు లభించింది. మెదడు సంబంధ జబ్బులకు నూతన ఔషధాలు కనుగొనడంలో 20 ఏళ్లుగా పరిశోధనలు చేసి, నరాల వ్యాధులకు చికిత్సలు కనిపెట్టి ప్రపంచ ఫార్మారంగానికి కీర్తి ప్రతిష్టలు తీసుకువస్తున్నందుకు ఆయనను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ బిరుదు అందుకున్న వారిని ప్రపంచంలోని 15 అత్యంత ప్రతిభావంత శాస్త్రవేత్తల్లో ఒకరిగా గౌరవిస్తారు. అమెరికాలోని కాలిఫోర్నియా శాండియాగో నగరంలో నవంబర్ 21న అమెరికా ఫార్మాస్యూటికల్ శాస్త్రవేత్తల సంఘం వార్షిక సమావేశంలో జరిగిన అవార్డు బంకేట్లో అమెరికా ఫార్మా అధ్యక్షురాలు డాక్టర్ మేరిలిన్ మెర్రిస్ ఈ అవార్డును సాంబరెడ్డికి ప్రదానం చేశారు.