యమ కాస్ట్‌లీ... పుచ్చకాయ
తిక్క లెక్క
పుచ్చకాయ ధర ఏమాత్రం ఉంటుందేంటి? కిలో ఇరవయ్యో పాతికో ఉంటుంది... మూడు నాలుగు కిలోలకు అటూ ఇటుగా తూగినా వంద రూపాయలకు మించదని డిసైడైపోతున్నారా..? ఈ పుచ్చకాయ ధర వింటే మాత్రం కళ్లు తిరగడం ఖాయం. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన పుచ్చకాయగా గిన్నెస్ రికార్డు బద్దలుకొట్టింది.
విశేషం ఏమంటారా? ఏమాత్రం తేడా రాకుండా గ్లోబులా గుండ్రంగా రూపొందేలా దీనిని పండించారు. ఉత్తర జపాన్‌లో పండించిన ఈ పుచ్చకాయకు ఏకంగా 3.50 లక్షల యెన్ల (రూ.2.01 లక్షలు) ధర పలికింది.