ఆల్-టైమ్ హైలో సెన్సెక్స్ సెలబ్రేషన్స్
ఆల్-టైమ్ హైలో సెన్సెక్స్ సెలబ్రేషన్స్
Published Thu, Jun 22 2017 11:36 AM | Last Updated on Tue, Sep 5 2017 2:14 PM
ముంబై: ట్రేడింగ్ ప్రారంభంలో 100 పాయింట్లకు పైగా జంప్ చేసిన సెన్సెక్స్, ఆల్-టైమ్ గరిష్టంలో దూసుకుపోతుంది. 230 పాయింట్లకు పైగా జంప్ చేసిన బీఎస్ఈ సెన్సెక్స్ 31,500 మార్కును చేధించింది. బ్యాంకు నిఫ్టీ సైతం 23,895.35ను తాకింది. నిఫ్టీ 62 పాయింట్ల లాభంలో 9700కు చేరువలో జోరు కొనసాగిస్తోంది.
నాస్కామ్ గైడెన్స్ తో టెక్నాలజీ స్టాక్స్ భారీగా లాభపడుతున్నాయి. ఇన్ఫోసిస్ 2.35శాతం పైకి ఎగిసింది. గైడెన్స్ ప్రకటించడాన్ని ఫిబ్రవరిలో వాయిదా వేసిన ఇండస్ట్రీ బాడీ నాస్కామ్ గైడెన్స్ రేంజ్ ను ప్రకటించేసింది. ఎక్స్ పోర్టు గ్రోత్ గైడెన్స్ 7-8శాతం ఉంటుందని నాస్కామ్ అంచనావేసింది. అంతేకాక దేశీయంగా రెవెన్యూ కూడా 10-11శాతం ఉంటుందని తెలిపింది. అనిశ్చితిగా ఉన్న టెక్నాలజీ పరిశ్రమకు ఇది సానుకూలంగా ఉండటంతో, మార్కెట్లో ఈ షేర్లు సెలబ్రేషన్స్ చేసుకుంటున్నాయి. నిఫ్టీ ఐటీ ఇంట్రాడే హైలో కొనసాగుతోంది. కాగ, త్వరలోనే ట్రంప్ తో మోదీ భేటీ కాబోతున్నారు.
పెట్టుబడులను మరింత ఆకట్టుకోవడానికి సెబీ తీసుకుంటున్న చర్యలు మార్కెట్లకు గట్టి మద్దతిచ్చాయి. స్ట్రెస్డ్ ఆస్తులతో సతమతమవుతున్న లిస్టెడ్ కంపెనీలను పునర్వ్యస్థీకరించడానికి టేక్ఓవర్ నిబంధనలను సెబీ సడలించింది. అంతేకాక అంతర్జాతీయంగా వస్తున్న పాజిటివ్ సంకేతాలతో మార్నింగ్ నుంచి మార్కెట్లు లాభాలు పండిస్తున్నాయి.
హెచ్డీఎఫ్‌సీ టాప్ గెయినర్ గా 1.60శాతం లాభాల్లో కొనసాగుతోంది. హెచ్డీఎఫ్సీ తో పాటు పవర్ గ్రిడ్, ఏసియన్ పేయింట్స్, టాటా మోటార్స్, టాటామోటార్స్ డీవీఆర్, సన్ ఫార్మా, యాక్సిస్ బ్యాంకులు కూడా 1.37 శాతం పైకి జంప్ చేశాయి.
Advertisement
Advertisement