
భారతీయ రిజర్వ్ బ్యాంక్ (RBI) 'అవిరల్ జైన్'ను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ (ED)గా నియమించింది. ఈడీగా పదోన్నతి పొందక ముందు, జైన్ మహారాష్ట్రకు ప్రాంతీయ డైరెక్టర్‌గా పనిచేశారు.
అవిరల్ జైన్‌కు కరెన్సీ నిర్వహణ, విదేశీ మారకద్రవ్య నియంత్రణ, పర్యవేక్షణ, మానవ వనరుల నిర్వహణ విభాగాల్లో మూడు దశాబ్దాలకు పైగా అనుభవం ఉంది. ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా, జైన్ జైన్ లీగల్ డిపార్ట్‌మెంట్, ప్రాంగణాల విభాగాన్ని చూసుకుంటారు. అంతే కాకుండా సమాచార హక్కు చట్టం కింద మొదటి అప్పీలేట్ అథారిటీగా వ్యవహరిస్తారు.
ఆర్థికశాస్త్రంలో పోస్ట్ గ్రాడ్యుయేట్ పూర్తి చేసిన జైన్.. యాంటీ మనీ లాండరింగ్ (AML), నో యువర్ కస్టమర్ (KYC) నిబంధనలు, క్యాపిటల్ మార్కెట్‌లకు సంబంధించిన సర్టిఫికేట్లను కలిగి ఉన్నట్లు సమాచారం. అంతే కాకుండా ఈయన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ అండ్ ఫైనాన్స్ (IIBF) సర్టిఫైడ్ అసోసియేట్ కూడా.
RBI appoints Shri Aviral Jain as new Executive Directorhttps://t.co/Oy4ADeR5Qy
— ReserveBankOfIndia (@RBI) October 4, 2024