భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించబోతుందని పలువురు ఆర్థిక వేత్తలు కొంతకాలంగా చెబుతూనే ఉన్నారు. ఈ తరుణంలో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ గవర్నర్ 'రంగరాజన్' కీలక వ్యాఖ్యలు చేయారు.
ఐసీఎఫ్ఏఐ ఫౌండేషన్ ఫర్ హయ్యర్ ఎడ్యుకేషన్ 14వ స్నాతకోత్సవంలో రంగరాజన్ ప్రసంగిస్తూ.. ఉద్యోగాలు లేకుండా సాధించే వృద్ధి వ్యర్థం. కాబట్టి పెట్టుబడి రేటును పెంచడం, వ్యవసాయం, తయారీ వంటి వాటికి ప్రాధాన్యత ఇవ్వడం, కొత్త టెక్నాలజీలను ప్రవేశపెట్టడం.. ఉపాధికి అనుకూలమైన రంగాలను ప్రోత్సహించడం ద్వారా వృద్ధిని సాధ్యమవుతుందని అన్నారు.
ఏదైనా దిగుమతి ఖరీదైనదైతే దాని వల్ల ప్రయోజనం పెద్దగా ఉండకపోవచ్చు. కాబట్టి ప్రత్యామ్నాయాలను ఎన్నుకోవాలి. ఇది దేశానికి మంచిదని రంగరాజన్ అన్నారు. భారత్ ద్రవ్యోల్బణం.. రూపాయి - డాలర్ రేటు వంటి సమస్యతో సతమతమవుతోంది. అలాగే 6-7 శాతం వృద్ధి సాధిస్తే.. 2024 చివరి నాటికి 13000 డాలర్ల స్థాయికి చేరుకోవడం సులభమవుతుంది.
ఉద్యోగాల కల్పన అనేది భారతదేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అత్యంత కఠినమైన సవాలుగా మారనుంది. భారతదేశం సాధించిన దాన్ని తక్కువ చేసి చూపాల్సిన అవసరం లేదు. నాణ్యత, ప్రభావ పరంగా ఉన్నత విద్యను బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. ఉన్నత విద్య సంస్కరణ అంటే యాక్సెస్, ఈక్విటీ, క్వాలిటీ అని రంగరాజన్ అభిప్రాయపడ్డారు.
Comments
Please login to add a commentAdd a comment