న్యూఢిల్లీ: ఆదాయపన్ను శాఖ 2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వివిధ వర్గాలు దాఖలు చేయాల్సిన రిటర్నుల పత్రాలను (ఐటీఆర్ ఫామ్) నోటిఫై చేసింది. సహజ్ (ఐటీఆర్–1), ఐటీఆర్–2, ఐటీఆర్–3, సుగమ్ (ఐటీఆర్–4), ఐటీఆర్–5, ఐటీఆర్–6, ఐటీఆర్–7 నోటిఫై చేసిన వాటిల్లో ఉన్నాయి. అధిక విలువ కలిగిన లావాదేవీలకు సంబంధించిన వివరాలను వీటిల్లో తెలియజేయాల్సి ఉంటుందని ప్రత్యక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీడీటీ) స్పష్టం చేసింది. కరెంటు ఖాతాలో డిపాజిట్లు రూ.కోటికి మించి ఉంటే, విదేశీ ప్రయాణం కోసం రూ.2 లక్షలకు మించి ఖర్చు చేసి ఉంటే, విద్యుత్తు బిల్లు రూ.లక్షకు మించితే రిటర్నుల్లో తెలియజేయాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment