ఆ వెబ్‌సైట్ నకిలీది: ఆర్‌బీఐ | RBI Cautions Public Against Fake Website | Sakshi
Sakshi News home page

ఆ వెబ్‌సైట్ నకిలీది: ఆర్‌బీఐ

Published Tue, May 27 2014 12:25 AM | Last Updated on Sat, Sep 2 2017 7:53 AM

ఆ వెబ్‌సైట్ నకిలీది: ఆర్‌బీఐ

ఆ వెబ్‌సైట్ నకిలీది: ఆర్‌బీఐ

 ముంబై: గుర్తుతెలియని కొందరు వ్యక్తులు ఆర్‌బీఐ పేరుతో నకిలీ వెబ్‌సైట్‌ను ప్రారంభించినట్లు తమ దృష్టికి వచ్చిందని రిజర్వు బ్యాంకు సోమవారం ఓ ప్రకటనలో తెలిపింది. http://www.rbiinonline.org/ savings.htm పేరుతో ఉన్న ఆ వెబ్‌సైట్ ఆఫరు చేస్తున్న సేవింగ్స్ అకౌంట్ల విషయంలో అప్రమత్తంగా ఉండాలని దేశ ప్రజలకు సూచించింది. ఈ వెబ్‌సైట్ ఆఫర్లకు ఆకర్షితులై మోసపోవద్దని కోరింది. సేవింగ్స్ అకౌంటు, కరెంటు అకౌంటు, క్రెడిట్ కార్డుల వంటి వాణిజ్య బ్యాంకింగ్ సేవలను తాము అందించడం లేదని తెలిపింది. నకిలీ వెబ్‌సైట్‌కు సంబంధించి తాము గతంలో విడుదల చేసిన పత్రికా ప్రకటనలను తమ అధికారిక వెబ్‌సైట్ rbi.org.inలో చూడవచ్చని రిజర్వు బ్యాంకు తెలిపింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement