దేశీయ ప్రభుత్వ బ్యాంకింగ్ దిగ్గజం ఎస్‌బీఐ ఖాతాదారులకు శుభవార్త చెప్పింది. వినియోగదారుల కార్యకలాపాల్ని మరింత సులభతరం చేసేందుకు యోనో యాప్‌లో ఎప్పటికప్పుడు మార్పులు చేస్తూనే ఉంది.
తాజాగా యోనో యాప్‌లో యూపీఐ కార్యకలాపాలు నిర్వహించే సదుపాయాన్ని అందుబాటులోకి తెచ్చింది. దీంతో కస్టమర్లు స్కాన్ అండ్ పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సర్వీసుల్ని వినియోగించుకోవచ్చు. అంతేకాదు చేతిలో ఏటీఎం కార్డ్ లేకుండా యోనో యాప్‌లో క్యూఆర్‌కోడ్‌ను స్కాన్ చేసి ఏటీఎం నుంచి డబ్బుల్ని డ్రా చేసుకోవచ్చు.
ఎస్‌బీఐ 68వ వార్షికోత్సవం సందర్భంగా తాజాగా ఈ అప్డేట్‌లు చేసింది. ఇతర బ్యాంకుల కస్టమర్లు కూడా యోనో యాప్ ద్వారా సేవలు పొందొచ్చు. ఎస్‌బీఐ ఇంటర్ ఆపరేబుల్ కార్డ్ లెస్ క్యాష్ విత్ డ్రాయల్ చేసుకోవచ్చు. ఈ కొత్త క్యాష్ విత్ డ్రాయల్ సర్వీసుల ద్వారా ఇతర బ్యాంకుల కస్టమర్లు సైతం బెనిఫిట్ పొందవచ్చు.
వీటితో పాటు ట్రాన్సాక్షన్‌లు, షాపింగ్‌లు ఇతర చెల్లింపులు సైతం ఈ యోనో యాప్‌లో చేసుకునే వెసలు బాటు కల్పిస్తున్నట్లు ఎస్‌బీఐ అధికారికంగా ప్రకటించింది. మరి యూపీఐ వినియోగంతో ఎంత సర్వీస్ ఛార్జీలు వసూలు చేస్తుందనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది.
చదవండి : ‘జీవితాంతం రుణ పడి ఉంటా’.. ఆనంద్ మహీంద్రా భావోద్వేగం!
Comments
Please login to add a commentAdd a comment