మన దేశంలో యూనిఫైడ్ ఫేమెంట్స్ ఇంటర్‌ఫేస్ (UPI) సేవల కారణంలో చేతిలో నగదుతో ఇప్పుడు పెద్దగా అవసరం ఉండటం లేదు. తగినంత ఇంటర్నెట్, స్మార్ట్ ఫోన్‌లో యూపీఐ యాప్ ఉంటే చాలు. క్షణాల్లో చెల్లింపులు పూర్తవుతున్నాయి.
కానీ ఇలాంటి సేవల వల్ల డెబిట్‌కార్డ్, క్రెడిట్ కార్డ్‌ల అవసరం తగ్గి పోయింది. ఒక వేళ ఏదైనా మారుమూల ప్రాంతానికి వెళితే ఇంటర్నెట్ నెట్ వర్క్ సరిగ్గా లేకపోతే యూపీఐ పేమెంట్స్ లావాదేవీలు సవ్యంగా జరగవు. చేతిలో డెబిట్ కార్డ్ ఉంటే ఏటీఎం సెంటర్‌కి వెళ్లి డబ్బులు డ్రా చేసుకోవచ్చు. కానీ ఇదంతా వ్యయప్రయాసలతో కూడుకున్న పని. కాబట్టే, ఇకపై మనదేశంలో ఫిజికల్ ఏటీఎం స్థానంలో వర్చువల్ ఏటీఎంలు రాబోతున్నాయి. ఈ వర్చువల్ ఏటీఎంలో డబ్బులు డ్రా చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్ తప్పని సరిగా అవసరం.
చండీగఢ్‌కు చెందిన ఫిన్‌టెక్ కంపెనీ పేమార్ట్ ఇండియా వర్చువల్, కార్డ్‌లెస్, హార్డ్‌వేర్ లెస్ మనీ విత్ డ్రాయిల్ సేవతో ముందుకు వచ్చింది. వినియోగదారులకు డబ్బులు కావాలంటే ఏటీఎం మెషిన్, పిన్ నెంబర్ అవసరం లేదు.
వర్చువల్ ఏటీఎం వినియోగించాలంటే ఇవి తప్పని సరి
ఈ వర్చువల్ ఏటీఎం ద్వారా డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు స్మార్ట్‌ఫోన్, మొబైల్ బ్యాంకింగ్ అప్లికేషన్, ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. డబ్బుల్ని డ్రా చేసే సమయంలో మీ బ్యాంక్ అకౌంట్‌తో రిజిస్టర్ చేసిన ఫోన్ నెంబర్ సాయంతో మొబైల్ బ్యాంకింగ్‌లో లాగిన్ అవ్వాలి
వర్చువల్ ఏటీఎంలో డబ్బుల్ని ఎలా డ్రా చేయాలంటే?
వర్చువల్ ఏటీఎంలో డబ్బుల్ని డ్రా చేయాలంటే ముందుగా మీ సమీపంలో ఉన్న కిరాణా స్టోర్‌లకు పేమార్ట్ అనుమతులు ఉండాలి. మీ మొబైల్‌లో పేమార్ట్‌తో వర్చువల్ ఏటీఎం కోసం నమోదు చేసుకున్న దుకాణదారుల జాబితా, పేర్లు, లొకేషన్, ఫోన్ నంబర్‌లతో సహా అందుబాటులో ఉంటాయి. అందుబాటులో ఉన్న కిరాణ స్టోర్‌లో www.vatm.inని ఉపయోగించాలి. ఇందులో లాగిన్ అయిన వెంటనే మీకు కావాల్సిన మొత్తాన్ని ఎంటర్ చేసి అంనతరం ఫోన్‌కి వచ్చిన ఓటీపీని నమోదు చేయాలి. డబ్బుల్ని డ్రా చేసుకునేందుకు డెబిట్ కార్డ్ లేదా సాంప్రదాయ ఏటీఎం మెషీన్ లేదా కియోస్క్, యూపీఐ ఆప్షన్ అవసరం లేదు. కిరాణా స్టోర్ యజమాని వర్చువల్ ఏటీఎంలా పనిచేస‍్తారని పేర్కొన్నారు.
ఈ వర్చువల్ ఏటీఎం ఎవరు ఉపయోగించుకోవచ్చు?
‘వర్చువల్ ఏటీఎం సేవలు ఆరు నెలలుగా ఐడీబీఐ బ్యాంక్‌తో విజయవంతంగా కొనసాగుతున్నాయని పేమార్ట్ వెల్లడించింది. కస్టమర్లకు ఈ వర్చువల్ ఏటీఎం సేవల్ని అందించేందుకు ఫిన్‌టెక్ సంస్థ ఇండియన్ బ్యాంక్ , జమ్మూ - కాశ్మీర్ బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్‌లతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రస్తుతం, చండీగఢ్, ఢిల్లీ, హైదరాబాద్, చెన్నై, ముంబైలలో ఎంపిక చేసిన ప్రదేశాల్లో అందుబాటులో ఉన్నాయి.మార్చి నెలలో పేమార్ట్ తన భాగస్వామి బ్యాంకులతో వర్చువల్ ఏటీఎం సేవల పైలట్ ప్రోగ్రామ్‌లను ప్రారంభించాలని యోచిస్తోంది. ప్రస్తుతానికి ఈ వర్చువల్ ఏటీఎంని ఉపయోగించడానికి కస్టమర్ ఎలాంటి ఛార్జీని చెల్లించాల్సిన అవసరం లేదని నారంగ్ తెలిపారు.
వర్చువల్ ఏటీఎంలలో ఎంత డబ్బు డ్రా చేసుకోవచ్చు?
ఒక వినియోగదారు ప్రతి లావాదేవీకి కనిష్టంగా రూ. 100 నుంచి గరిష్టంగా రూ. 2,000 విత్‌డ్రా చేసుకోవచ్చు. వర్చువల్ ఏటీఎంల ద్వారా విత్‌డ్రా చేసుకోవడానికి గరిష్ట పరిమితి నెలకు రూ. 10,000. చిన్న మొత్తాలను పొందడానికి వర్చువల్ ఏటీఎం ఉపయోగపడుతుంది. షాప్‌కీపర్ చేతిలో పెద్ద మొత్తంలో నగదు ఉండకపోవచ్చు కాబట్టి పెద్ద మొత్తాన్ని విత్‌డ్రా చేసుకోవడానికి ఈ ఫీచర్ అంతగా ఉపయోగపడదు.
వర్చువల్ ఏటీఎంలతో బ్యాంక్ వచ్చే లాభం
వర్చువల్ ఏటీఎంల వల్ల మారుమూల గ్రామాల్లో బ్యాంక్‌లు కస్టమర్లకు సేవల్ని ఉపయోగించికుంటారు. తద్వారా, బ్యాంకులు పెట్టే నిర్వహణ ఖర్చు తగ్గుతుంది.ఇంకా, వర్చువల్ ఏటీఎం ఉన్న కిరాణా స్టోర్ యజమాని కస్టమర్లు డబ్బులు ఎంత డ్రా చేస్తే అంత మొత్తంలో కమిషన్ పొందే సదుపాయం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment