సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ)లో మీకు అకౌంట్ ఉందా. ఎస్‌బీఐ ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారా? బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్‌గా ఆన్‌లైన్‌లోనే చేసుకోవచ్చు. వివరాలు ఇలా..
ముఖ్యంగా ఎస్‌బీఐలో ఖాతాదారు ఫోన్ నంబరు రిజిస్టర్ అయి ఉండాలి. YONO యాప్ లేదా YONO Lite ద్వారా కూడా బ్రాంచ్‌ని మార్చుకోవచ్చు. ఆన్‌లైన్ ద్వారా ఎస్‌బీ బ్యాంక్ ఖాతా ఒక శాఖ నుండి మరొక శాఖకు ఎలా బదిలీ చేయాలి. ఎస్‌బీఐ అధికారిక పెర్సనల్ బ్యాంకింగ్ వెబ్యాంకింగ్ విభాగంలోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్‌వర్డ్ నమోదు చేయాలి. తర్వాత ఈ-సర్వీస్ కేటగిరీని ఎంచుకోవాలి. అందులో ట్రాన్స్‌ఫర్ సేవింగ్స్ అకౌంట్‌పై ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్ ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్ సంబంధిత శాఖకు బదిలీ అవుతుంది. యోనో యాప్‌లో కూడా దాదాపు ఇదే పద్దతిలో బ్రాంచ్‌ను మార్చుకోవచచ్చు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర)
ఎస్‌బీఐ యోనో యాప్ ద్వారా అయితే
యోనో యాప్‌లో లాగిన్ అయ్యి 'సర్వీసెస్'ఆప్షన్‌ను ఎంచుకోవాలి.
ఇక్కడ ‘ట్రాన్స్‌ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి
కొత్త బ్రాంచ్ ఐఎఫ్‌ఎస్‌సీ కోడ్‌తో పాటు బదిలీ చేయాలనుకుంటున్న ఖాతావివరాలివ్వాలి.
గెట్ బ్రాంచ్ నేమ్ క్లిక్ చేయాలి.
కొత్త బ్రాంచ్ పేరు ఫ్లాష్ అవుతుంది. అది సరియైనది అని నిర్దారించుకున్నాక, సబ్మిట్ 'సమర్పించు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
Comments
Please login to add a commentAdd a comment