branch
-
కార్పొరేట్లకు మద్దతులో ఎస్బీఐ పాత్ర భేష్
కొలంబో: భారత్‌లోనే కాకుండా, అంతర్జాతీయ వాణిజ్యంలోసైతం కార్పొరేట్లకు మద్దతు ఇవ్వడంలో బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) అందిస్తున్న సేవలు అద్భుతమని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రశంసించారు. అంతక్రితం ఆమె శ్రీలంక తూర్పు ఓడరేవు పట్టణం ట్రింకోమలీలో ఎస్బీఐ శాఖను ప్రారంభించారు. తూర్పు ప్రావిన్స్ గవర్నర్ సెంథిల్ తొండమాన్, శ్రీలంకలో భారత హైకమిషనర్ గోపాల్ బాగ్లే, ఎస్బీఐ చైర్మన్ దినేష్ ఖారా కూడా ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. మూడు రోజుల పర్యటన నిమిత్తం శ్రీలంకకు విచ్చేసిన సీతారామన్ పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఎస్బీఐ బ్రాంచ్‌ను ప్రారంభించే ముందు నగరంలో ప్రధాన హిందూ దేవాలయాన్ని సైతం సందర్శించి పూజలు చేశారు. అనంతరం లంక ఇండియన్ ఆయిల్ కంపెనీ కాంప్లెక్స్‌ను సందర్శించారు. ఎస్బీఐ శాఖ ప్రారంభం అనంతరం ఆమె ఏమన్నారంటే. వాణిజ్యాభివృద్ధిలో ఎస్బీఐ 159 సంవత్సరాల గణనీయమైన ప్రభావాన్ని కలిగిఉంది. ఇది శ్రీలంకలో అత్యంత పురాతనమైన బ్యాంక్. స్వదేశంతో పాటు విదేశాల్లో తన కార్యకలాపాలను విస్తృతం చేస్తోంది. ఆర్థిక సంక్షోభం సమయంలో శ్రీలంకకు భారత్ 1 బిలియన్ అమెరికా డాలర్ల విలువైన క్రెడిట్ లైన్‌ను సజావుగా కొనసాగించడానికి ఎస్బీఐ మార్గం సుగమం చేసింది. శ్రీలంకలోని బ్రాంచ్ కార్యకలాపాలతో పాటు, ఎస్బీఐ శ్రీలంక యోనో యాప్, ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా బలమైన డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ను ఎస్బీఐ నిర్వహిస్తోంది. తద్వారా డిజిటల్ చెల్లింపుల పురోగతికి దోహదపడుతోంది. ద్వైపాక్షిక చర్చల పునఃప్రారంభ నేపథ్యం... దాదాపు ఐదేళ్ల విరామం తర్వాత ఆర్థిక, సాంకేతిక సహకార ఒప్పందం (ఈటీసీఏ) కోసం భారత్– శ్రీలంక ఉన్నతాధికారుల మధ్య చర్చల పునఃప్రారంభం నేపథ్యంలో ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ శ్రీలంక మూడురోజుల పర్యటనకు ప్రాధాన్యత సంతరించుకుంది. 2016 నుంచి 2018 వరకు ఇరుదేశాల మధ్య 11 రౌండ్ల చర్చలు జరిగాయి. ఆ తర్వాత చర్చలు నిలిచిపోయాయి. అక్టోబర్ 30 నుంచి నవంబర్ 1వ తేదీ మధ్య 12వ దఫా చర్చలు జరిగాయి. 12వ రౌండ్లో వస్తు సేవలు, కస్టమ్స్ విధానాలు, వాణిజ్య సౌలభ్యం, వాణిజ్యానికి సాంకేతిక అడ్డంకులు, నివారణ వంటి పలు అంశాలు చోటుచేసుకున్నాయి. భారత్‌కు చెందిన అనేక ప్రముఖ కంపెనీలు శ్రీలంకలో ఇప్పటికే పెట్టుబ డులు పెట్టాయి. పెట్రోలియం రిటైల్, టూరిజం, హోటల్, తయారీ, రియల్ ఎస్టేట్, టెలికమ్యూనికేషన్, బ్యాంకింగ్, ఆర్థిక సేవల రంగాలలో భారతదేశం నుండి ప్రధాన పెట్టుబడులు ఉన్నాయి. 2022–23లో శ్రీలంకకు భారత్ ఎగుమతులు 5.11 బిలియన్ డాలర్లు. 2021–22లో ఈ విలువ 5.8 బిలియన్ డాలర్లు. ఇక భారత్ దిగుమతులు చూస్తే, 2021–22లో ఈ విలువ ఒక బిలియన్ కాగా, 2022–23లో 1.07 బిలియన్ డాలర్లకు చేరింది. -
ఎస్బీఐ అకౌంట్ బ్రాంచ్ మార్చుకోవాలా? ఇదిగో ఇలా సింపుల్‌గా
సాక్షి,ముంబై: ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ)లో మీకు అకౌంట్ ఉందా. ఎస్బీఐ ఖాతాను ఒక శాఖ నుండి మరొక శాఖకు బదిలీ చేయాలనుకుంటున్నారా? బ్యాంకును సందర్శించాల్సిన అవసరం లేకుండానే డిజిటల్‌గా ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. వివరాలు ఇలా.. ముఖ్యంగా ఎస్బీఐలో ఖాతాదారు ఫోన్ నంబరు రిజిస్టర్ అయి ఉండాలి. YONO యాప్ లేదా YONO Lite ద్వారా కూడా బ్రాంచ్ని మార్చుకోవచ్చు. ఆన్లైన్ ద్వారా ఎస్బీ బ్యాంక్ ఖాతా ఒక శాఖ నుండి మరొక శాఖకు ఎలా బదిలీ చేయాలి. ఎస్బీఐ అధికారిక పెర్సనల్ బ్యాంకింగ్ వెబ్యాంకింగ్ విభాగంలోకి వెళ్లి యూజర్ నేమ్, పాస్వర్డ్ నమోదు చేయాలి. తర్వాత ఈ-సర్వీస్ కేటగిరీని ఎంచుకోవాలి. అందులో ట్రాన్స్ఫర్ సేవింగ్స్ అకౌంట్‌పై ఆప్షన్‌పై క్లిక్ చేసి మీరు మార్చుకోవాలనుకుంటున్న బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్ ఎంటర్ చేయాలి. అన్ని వివరాలు నమోదు చేశాక రిజిస్టర్డ్ మొబైల్‌కు వచ్చే ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత కొద్దిరోజుల్లో మీ అకౌంట్ సంబంధిత శాఖకు బదిలీ అవుతుంది. యోనో యాప్‌లో కూడా దాదాపు ఇదే పద్దతిలో బ్రాంచ్‌ను మార్చుకోవచచ్చు. (Nokia C22: నోకియా సీ22 స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది: అదిరే ఫీచర్లు, అతి తక్కువ ధర) ఎస్బీఐ యోనో యాప్ ద్వారా అయితే యోనో యాప్‌లో లాగిన్ అయ్యి 'సర్వీసెస్'ఆప్షన్‌ను ఎంచుకోవాలి. ఇక్కడ ‘ట్రాన్స్ఫర్ ఆఫ్ సేవింగ్ అకౌంట్’ ఆప్షన్‌ను ఎంచుకోవాలి కొత్త బ్రాంచ్ ఐఎఫ్ఎస్సీ కోడ్‌తో పాటు బదిలీ చేయాలనుకుంటున్న ఖాతావివరాలివ్వాలి. గెట్ బ్రాంచ్ నేమ్ క్లిక్ చేయాలి. కొత్త బ్రాంచ్ పేరు ఫ్లాష్ అవుతుంది. అది సరియైనది అని నిర్దారించుకున్నాక, సబ్మిట్ 'సమర్పించు' ఆప్షన్‌పై క్లిక్ చేయండి. -
వెలుగులోకి ఎస్బీఐ నకిలీ బ్రాంచ్
చెన్నై: బ్యాంకులకు కన్నాలు వేసే దొంగల గురించి తెలుసు. పెద్ద మొత్తంలో బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాలకు పరారీ అయ్యే ప్రబుద్ధుల గురించి తెలుసు. రొటీన్‌గా మోసాలు చేస్తే కిక్ ఏముంటుంది అనుకున్నారో ఏమో... ముగ్గురు వ్యక్తులు ఏకంగా నకిలీ ఎస్బీఐ బ్రాంచ్‌ను ఏర్పాటు చేశారు. ఈ సంఘటన తమిళనాడులోని కడలూరు జిల్లా పన్రూటి తాలుకాలో చోటు చేసుకుంది. 3 నెలల పాటు సాఫీగా సాగిన ఈ నకిలీ బ్రాంచ్ వ్యవహారం చివరికి ఓ ఎస్బీఐ కస్టమర్ ఫిర్యాదుతో వెలుగులోకి వచ్చింది. ఈ ముగ్గురిలో ప్రధాన సూత్రధారి కమల్‌బాబు. తల్లి బ్యాంకు మాజీ ఉద్యోగి. ఓ పేరుమోసిన బ్యాంకులో పనిచేసి రెండేళ్ల కిందట ఉద్యోగ విరమణ చేశారు. తండ్రి పదేళ్ల కిందట చనిపోయారు. మరో వ్యక్తి ప్రింటింగ్ ప్రెస్‌లో పనిచేస్తున్నారు. మూడో వ్యక్తి రబ్బర్ స్టాంప్‌లను తయారీ చేస్తున్నారు. బాగోతం బయట పడిందిలా: ఎస్బీఐ కస్టమర్ ఒకరికి ఈ బ్రాంచ్‌పై అనుమానం వచ్చి స్థానిక బ్రాంచ్ మేనేజర్‌కు సమాచారం ఇచ్చారు. సదరు మేనేజర్ ఈ సమాచారాన్ని జోనల్ ఆఫీసుకు తెలియజేశారు. ఎస్బీఐకు సంబంధించి పన్రూటీలో కేవలం 2 బ్రాంచులకు మాత్రమే అనుమతులున్నాయని మూడోది బ్రాంచ్ నకిలీదని జోనల్ అధికారులు నిర్ధారించారు. నకిలీ బ్రాంచ్‌ను సందర్శంచి అందులో సోదాలు నిర్వహించారు. అదృష్టవశాత్తు ఈ బ్రాంచ్ నుంచి ఎలాంటి లావాదేవీలు జరగకపోవడంతో అధికారులు ఊపిరిపీల్చుకున్నారు. కస్టమర్లకు ఏమాత్రం అనుమానం రాకుండా వ్యవస్థలు, మౌలిక సదుపాయాల రూపకల్పన చూసి అధికారులు విస్తుపోయారు. వెంటనే ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఇంకేంముంది కటకటాల్లోకే: సమాచారం అందుకున్న పన్‌రూటీ పోలీసులు ఈ ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. కేసును నమోదు చేసి నిందితులను కోర్టులో హాజరు పరుస్తామని పోలీసు ఇన్స్పెక్టర్ అంబేద్కర్ తెలిపారు. -
హైదరాబాద్‌లో కెఎల్ యూనివర్సిటీ
-
రెండు జిల్లాలకు ఒకే ‘సర్కిల్’
విద్యుత్‌శాఖలో ‘విభజన’ మార్పులు లేవు నిజామాబాద్‌నాగారం: కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో విద్యుత్‌శాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం లేదు. రెండు జిల్లాలకు ఒకే సర్కిల్ కార్యాలయం ఉండనుంది. విద్యుత్‌శాఖ ఎస్ఈ ఒక్కరే రెండు జిల్లాలకు బాస్‌గా కొనసాగనున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డీఈఈ, బాన్సువాడ డీఈఈలు యాథావిథిగా కొనసాగుతారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ డివిజన్ డీఈఈ, ఆర్మూర్డివిజన్ డీఈఈలుంటారు. ఇప్పటికైతే తమ శాఖలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని ఎస్ఈ ప్రభాకర్ స్పష్టం చేశారు. -
ఆటోపై విరిగిపడిన చెట్టు కొమ్మ
వినాయకపురం(ఖమ్మం): ఆటోపై చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఓ యువకుడు మృతిచెందగా.. ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట నుంచి దురదపాడు గ్రామానికి చెందిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటో.. వినాయకపురం మలుపు దాటిన(మామిళ్లవారిగూడెం రోడ్) తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మ విరిగి ఆటోపై పడింది. దీంతో సున్నంబట్టి గ్రామానికి చెందిన కుర్సం సాయికుమార్(20) అక్కడికక్కడే మృతిచెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న మామిళ్లవారిగూడెంకు చెందిన అంకత భారతి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపాకకు చెందిన సోయం వెంకమ్మ ఎడమ కాలు విరిగిపోయి.. తలకు గాయాలయ్యాయి. కొత్తమామిళ్లవారిగూడెంకు చెందిన నీలం అజయ్‌కుమార్, చండ్రుగొండకు చెందిన కర్నాటి పుల్లమ్మ, ఆటో డ్రైవర్ సొడెం నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని ఆటోపై పడిన చెట్టు కొమ్మను తొలగించి.. అందులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. వీరిని వినాయకపురం పీహెచ్సీ.. తర్వాత అశ్వారావుపేట సామాజిక ఆస్పత్రులకు తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు. -
ఈసీఈ ఎవర్గ్రీన్ బ్రాంచ్
బాలాజీచెరువు(కాకినాడ): ఇంజినీరింగ్ కోర్సులలో ఈసీఈ బ్రాంచ్ ఎవర్గ్రీన్ అని, దానికున్న ప్రాముఖ్యం ఎనలేనిదని జేఎన్టీయూకే వీసీ వీఎస్ఎస్ కుమార్ పేర్కొన్నారు. జేఎన్టీయూకేలో మంగళవారం ఈసీఈ విభాగం ఆధ్వర్యంలో రీసెంట్ అడ్వాన్స్మెంట్స్ ఇన్ వీఏఎస్‌ఐ టెక్నాలజీ డిజైన్ యూజింగ్ ఈడీఏ టూల్స్ అనే అంశంపై ఐదు రోజుల పాటు జరిగే జాతీయవర్క్‌షాపును ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా వీసీ కుమార్ మాట్లాడుతూ ఈసీఈ బ్రాంచ్‌కు ఎప్పుడూ డిమాండ్ ఉంటుందని, దీనిలో ముఖ్యంగా వీఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్ స్పెషలైజేషన్‌కు ప్రపంచ వ్యాప్తంగా ఉపాధి అవకాశాలు ఉన్నాయన్నారు. విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు వీటిలో పరిశోధనలు చేసి వ్యవస్థాపకులుగా ఎదగాలని సూచించారు. కోరల్ టెక్నాలజీ జనరల్ మేనేజర్ బి.కె.దేవయ్య మాట్లాడుతూ దేశ రక్షణలో ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్స్ విభాగం చాలా కీలకమైన పాత్ర పోషిస్తోందని, అందువల్ల పరిశోధనపై దృష్టి సారించి సాంకేతిక పరిజ్ఞానంతో ముందుకెళ్లాలని సూచించారు. కళాశాల ప్రిన్సిపాల్ వి.రామచంద్రరాజు మాట్లాడుతూ చర్చాగోష్టిలో పొందిన విషయ పరిజ్ఞానాన్ని ప్రయోగ పద్ధతుల్లో విద్యార్థులకు నేర్పించగలిగితే విద్యార్థుల నైపుణ్యాలను పెంపొందించవచ్చన్నారు. కార్యక్రమంలో ఐఎస్టీ డైరక్టర్ కె.సత్యప్రసాద్, అధ్యాపకులు డాక్టర్ పద్మప్రియ, పి.పుష్పలత, ఝాన్సీరాణి పాల్గొన్నారు.