కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో విద్యుత్‌శాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు
-
విద్యుత్‌శాఖలో ‘విభజన’ మార్పులు లేవు
నిజామాబాద్‌నాగారం:
కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో విద్యుత్‌శాఖలో ఎలాంటి మార్పులు చేర్పులు చోటుచేసుకోవడం లేదు. రెండు జిల్లాలకు ఒకే సర్కిల్ కార్యాలయం ఉండనుంది. విద్యుత్‌శాఖ ఎస్‌ఈ ఒక్కరే రెండు జిల్లాలకు బాస్‌గా కొనసాగనున్నారు. కామారెడ్డి జిల్లాలో కామారెడ్డి డీఈఈ, బాన్సువాడ డీఈఈలు యాథావిథిగా కొనసాగుతారు. నిజామాబాద్ జిల్లాలో నిజామాబాద్ డివిజన్ డీఈఈ, ఆర్మూర్‌డివిజన్ డీఈఈలుంటారు. ఇప్పటికైతే తమ శాఖలో ఎలాంటి మార్పులు, చేర్పులు ఉండవని ఎస్‌ఈ ప్రభాకర్ స్పష్టం చేశారు.