ఆటోపై విరిగిపడిన చెట్టు కొమ్మ | tree branch fall on running auto | Sakshi
Sakshi News home page

ఆటోపై విరిగిపడిన చెట్టు కొమ్మ

Published Wed, Aug 10 2016 10:32 PM | Last Updated on Thu, Jul 11 2019 8:56 PM

ఇరుక్కుపోయిన ప్రయాణికులు - Sakshi

ఇరుక్కుపోయిన ప్రయాణికులు

వినాయకపురం(ఖమ్మం): ఆటోపై చెట్టుకొమ్మ విరిగిపడటంతో ఓ యువకుడు మృతిచెందగా.. ఐదుగురు ప్రయాణికులకు గాయాలయ్యాయి. ఈ సంఘటన మండలంలో బుధవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. అశ్వారావుపేట నుంచి దురదపాడు గ్రామానికి చెందిన ప్రయాణికులతో వెళ్తున్న ఆటో.. వినాయకపురం మలుపు దాటిన(మామిళ్లవారిగూడెం రోడ్‌) తర్వాత రోడ్డు పక్కన ఉన్న చెట్టు కొమ్మ విరిగి ఆటోపై పడింది. దీంతో సున్నంబట్టి గ్రామానికి చెందిన కుర్సం సాయికుమార్‌(20) అక్కడికక్కడే మృతిచెందాడు.

ఆటోలో ప్రయాణిస్తున్న మామిళ్లవారిగూడెంకు చెందిన అంకత భారతి తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆసుపాకకు చెందిన సోయం వెంకమ్మ ఎడమ కాలు విరిగిపోయి.. తలకు గాయాలయ్యాయి. కొత్తమామిళ్లవారిగూడెంకు చెందిన నీలం అజయ్‌కుమార్, చండ్రుగొండకు చెందిన కర్నాటి పుల్లమ్మ, ఆటో డ్రైవర్‌ సొడెం నవీన్‌కు స్వల్ప గాయాలయ్యాయి. ప్రమాదం విషయం తెలుసుకున్న స్థానికులు అక్కడికి చేరుకొని ఆటోపై పడిన చెట్టు కొమ్మను తొలగించి.. అందులో ఇరుక్కుపోయిన వారిని బయటకు తీశారు. వీరిని వినాయకపురం పీహెచ్‌సీ.. తర్వాత అశ్వారావుపేట సామాజిక ఆస్పత్రులకు తరలించగా వైద్యులు చికిత్స చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి. దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement