SBI Easy Ride: దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్‌బీఐ) ద్విచక్ర వాహనాలు కొనేవారికి తీపికబురు అందించింది. ఎస్‌బీఐ యోనో ఫ్లాట్ ఫారం ద్వారా సులభంగా ద్విచక్ర వాహనా రుణాలను పొందవచ్చు అని తెలిపింది. ద్విచక్ర వాహనా రుణాల కోసం ఎస్‌బీఐ "ఈజీ రైడ్" పేరుతో మరో ఆప్షన్ తీసుకొనివచ్చింది. అర్హత కలిగిన ఎస్‌బీఐ కస్టమర్లు బ్యాంకు బ్రాంచీని సందర్శించకుండానే యోనో యాప్ ద్వారా క్షణాలలో ద్విచక్ర వాహన రుణాలను పొందవచ్చు అని తెలిపింది.
"కస్టమర్లు గరిష్టంగా 4 సంవత్సరాల వరకు సంవత్సరానికి 10.5% వడ్డీరేటుతో రూ.3 లక్షల వరకు ఈజీ రైడ్ రుణం కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. కనీస రుణ మొత్తాన్ని రూ.20,000గా నిర్ణయించారు' అని బ్యాంకు విడుదల చేసిన పత్రికా ప్రకటనలో పేర్కొంది. కస్టమర్ పొందిన రుణం నేరుగా డీలర్ ఖాతాలోకి జమ కానుంది. ఈ పథకం కింద వాహనం ఆన్-రోడ్ ధరలో 85% వరకు రుణాలను పొందవచ్చని ఎస్‌బీఐ పేర్కొంది. ఎస్‌బీ ఛైర్మన్ దినేష్ ఖారా మాట్లాడుతూ.. 'ఎస్‌బీఐ ఈజీ రైడ్' రుణ పథకం మా కస్టమర్లకు అంతరాయం లేని అనుభవాన్ని అందిస్తుందని మేం ఆశిస్తున్నాం అని అన్నారు.
(చదవండి: ఎలక్ట్రిక్ కారు రేసులోకి టొయోటా.. రేంజ్ కూడా అదుర్స్!)
Comments
Please login to add a commentAdd a comment