
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: యోనో యాప్ ద్వారా ద్విచక్ర వాహనం కొనుగోలుకు రూ.3 లక్షల వరకు ముందుగా అనుమతించబడిన (ప్రీ–అప్రూవ్డ్) రుణం ఇవ్వనున్నట్టు ఎస్‌బీఐ ప్రకటించింది. అర్హతగల వినియోగదార్లు బ్యాంక్ శాఖను సంప్రదించకుండానే యాప్ ద్వారా రుణం పొందవచ్చు.
కనీస రుణ మొత్తం రూ.20,000. కాల పరిమితి గరిష్టంగా నాలుగేళ్లు. వడ్డీ సాలీనా 10.5 శాతం నుంచి ప్రారంభం. వాహనం ఆన్‌రోడ్ ధరపై 85 శాతం దాకా రుణం తీసుకోవచ్చు. రూ.1 లక్ష లోన్ తీసుకుంటే నెల వాయిదా సగటున రూ.2,560 చెల్లించాల్సి ఉంటుంది.