చెన్నై: ప్రైవేట్ రంగ కరూర్ వైశ్యా బ్యాంక్ (కేవీబీ) తమ 800వ శాఖను చెన్నైలో ప్రారంభించింది. దీనితో పాటు తెలుగు రాష్ట్రాల్లో మరో రెండు (తెలంగాణలోని గద్వాల్, ఆంధ్రప్రదేశ్‌లోని సత్తెనపల్లి) తమిళనాడులో ఇంకో ఆరు బ్రాంచీలను తెరిచింది. దీంతో మొత్తం శాఖల సంఖ్య 808కి చేరిందని బ్యాంకు ఎండీ రమేష్ బాబు తెలిపారు.
అటు తొలి డిజిటల్ బ్యాంకింగ్ యూనిట్ (డీబీయూ)ని కూడా చెన్నైలో ప్రారంభించినట్లు వివరించారు. ఇందులో పూర్తిగా డిజిటల్ పద్ధతిలో సేవింగ్స్ ఖాతాలను తెరవడం, రిటైల్ రుణాలకు దరఖాస్తు చేసుకోవడం, టర్మ్ డిపాజిట్లు తదితర లావాదేవీలన్నింటినీ నిర్వహించుకోవచ్చని రమేష్ బాపు చెప్పారు. కేవీబీ గత ఆర్థిక సంవత్సరంలో రూ. 1,40,806 కోట్ల వ్యాపారాన్ని నమోదు చేసింది. రూ. 1,106 కోట్ల లాభం ఆర్జించింది.
Comments
Please login to add a commentAdd a comment