
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు.
కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు.
చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు?
Comments
Please login to add a commentAdd a comment