Vizag police
-
విశాఖ చేరుకున్న షార్జా బాధితులు
-
విశాఖలో రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందా గుట్టురట్టు
సాక్షి, విశాఖపట్నం: నగరంలో భారీ క్రికెట్ బెట్టింగ్ ముఠా పట్టుబడింది. విశాఖ వేదికగా జరుగుతున్న రూ. 350 కోట్ల క్రికెట్ బెట్టింగ్ దందాను సైబర్ పోలీసులు గుట్టురట్టు చేశారు, అంతర్జాతీయ స్థాయిలో బెట్టింగ్ చేస్తున్న కింగ్ మోను అలియాస్ దినేష్, వాసుదేవ్, సూరి బాబులతోపాటు 11 మందిని పోలీసులు అరెస్ట్ చే శారు. కాగా ఒక్క కింగ్ మోను అకౌంట్స్ నుంచే రూ. 145 కోట్ల లావాదేవీలు జరిగినట్టు పోలీసులు గుర్తదించారు. ఈ బెట్టింగ్ ఉచ్చులో విశాఖ పరిసర ప్రాంతాల్లోని వందలాది మంది అమాయక యువకులు చిక్కుకున్నట్లు తెలిపారు. ఈ కేసును సీపీ రవిశంకర్ స్వయంగా విచారణ చేస్తున్నారు. చదవండి: బాలిక హత్య.. బాబాయే హంతకుడు? -
కిడ్నీ రాకెట్ కేసును ఛేదించిన పోలీసులు.. ముగ్గురు అరెస్ట్
సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ రాకెట్ కేసును వైజాగ్ పోలీసులు ఛేదించారు. కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక, ఈ ముఠా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నీ రాకెట్లో ఆపరేషన్ చేసిన డాక్టర్లపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. ఈ కేసులో ఇంకా అరెస్టులు పెరిగే అవకాశముందని పోలీసులు స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా, పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది. ఆస్పత్రి సీజ్.. తిరుమల ఆసుపత్రిలో వైద్య సేవలు, సౌకర్యాలపై అధికారులు కలెక్టర్ మల్లికార్జునకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్ సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేశారు. మోసం, మానవ అవయవాల మార్పిడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు. ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్ మాట్లాడారు -
Vizag: ఇక బంద్! రోడ్డు రోలర్‌తో తొక్కించి సైలెన్సర్ల ధ్వంసం
పెదవాల్తేరు (విశాఖ తూర్పు): నగరంలో శబ్ధ కాలుష్యం, వాయు కాలుష్యానికి కారణమవుతున్న 631 లౌడ్ సైలెన్సర్లను ధ్వంసం చేయించామని నగర పోలీస్ కమిషనర్ సీహెచ్ శ్రీకాంత్ వెల్లడించారు. బీచ్‌రోడ్డులోని పోలీస్ మెస్ ఆవరణలో ఆదివారం రోడ్డు రోలర్‌తో సైలెన్సర్లను ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ వాహనదారులు మోడిఫైడ్ సైలెన్సర్లను వాడరాదని కోరారు. బీచ్‌రోడ్డులో యువకులు బైక్ రేసింగ్‌లకు పాల్పడుతున్నారని ఫిర్యాదులు అందుతున్నాయన్నారు. దీంతో స్పెషల్ డ్రైవ్ ద్వారా ఏడు వాహనాలను, 12 మంది యువకులను అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. బీచ్‌రోడ్డులో బైక్ రేసింగ్‌లు పాల్పడే యువకులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఈ విషయంలో తల్లిదండ్రులు కూడా అప్రమత్తంగా వుండి తమ కుమారులపై నిఘా వుంచాలని సూచించారు. హెల్మెట్ లేకుండా బైక్‌లు నడుపుతూ ప్రమాదాలకు గురై ఇటీవల చాలా మంది ప్రాణాలు కోల్పోయారని విచారం వ్యక్తం చేశారు. అందువల్ల ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా హెల్మట్ ధరించాలని సూచించారు. మద్యపానం చేసి వాహనాలు నడపరాదని ఆయన కోరారు. మద్యం సేవించి వాహనాలు నడిపి పట్టుబడేవారితో కోర్టు ఆదేశాలతో కమ్యూనిటీ సర్వీస్ చేయిస్తున్నామని గుర్తు చేశారు. ఆయా జంక్షన్లలో వీరిచేత ప్లకార్డుల సాయంతో ట్రాఫిక్ నియంత్రణపై అవగాహన కల్పిస్తున్నామని వివరించారు. ఇప్పటి వరకు నగరంలోని పోలీస్ స్టేషన్ల పరిధిలో 205 మందితో కమ్యూనిటీ సర్వీస్ చేయించామన్నారు. కార్యక్రమంలో ట్రాఫిక్ ఏడీసీపీ ఆరిబుల్లా, ట్రాఫిక్ ఏసీపీ – 1 కుమారస్వామి, ట్రాఫిక్ ఏసీపీ – 2 శరత్‌కుమార్, ఈస్ట్ ట్రాఫిక్ సీఐ ఏవీ లీలారావు, ఎస్ఐ అసిరితాత, తదితరులు పాల్గొన్నారు. (క్లిక్: విశాఖలో ఇగ్లూ థియేటర్ ఎక్కడ ఉందో తెలుసా?) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
నకిలీ దందాకు చెక్..13 మంది అరెస్టు
సాక్షి, విశాఖపట్నం : జిల్లాలో జరుగుతున్న నకిలీ దందాను పోలీసులు బట్టబయలు చేశారు. నకిలీ ఆధార్, డాక్యుమెంట్స్, స్టాంప్స్ తయారు చేస్తున్న ముఠాను పసిగట్టి 13 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి నకిలీ పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో విశాఖ కమిషనర్ రాజీవ్ కుమార్ మీనా మాట్లాడుతూ.. కోర్టులనే మోసం చేస్తూ న్యాయవాదుల సహకారంతో ఈ దందా కొనసాగిస్తున్నట్లు తెలిపారు.. ఇతర రాష్ట్రాలకు చెందిన ముద్దాయిలకు పూచీకత్తు ఇచ్చే సమయంలో నకిలీ పత్రాలు సమర్పిస్తున్నట్లు, దాదాపు 150కిపైగా కేసులలో నకిలీ ప్రతాలను న్యాయవాదులు సమర్పించినట్లు వెల్లడించారు. ఈ క్రమంలో నలుగురైదుగురు న్యాయవాదుల పాత్రపై పోలీసులు విచారణ కొనసాగిస్తున్నట్లు సీపీ పేర్కొన్నారు. అత్యధికంగా గంజాయి, రోడ్డు ప్రమాదాలకు సంబంధించిన కేసలలో నకిలీ దందా సాగిస్తున్నట్లు, గంజాయి కేసులో పూచీకత్తులకు 20 వేలు, రోడ్డు ప్రమాద కేసులో 10 వేల వరకు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ పత్రాలతో కోర్టులను మోసం చేసి నిందితులను రక్షించారని, ఇతర రాష్ట్రాల నిందితులకు పూచీకత్తు కోసం నకిలీ పత్రాలు సృష్టించారని వెల్లడించారు. ఈ వ్యవహారం నాలుగు సంవత్సరాలుగా సాగుతోందన్నారు. గత భూదందా కేసులో రికార్డులు తారుమారుపై ఈ ముఠా పాత్ర ఏమైనా ఉందా అన్నది పరిశీలిస్తున్నమని తెలిపారు. అరెస్టు చేసిన 13 మందిలో ఒక రౌడీషీటర్ ఉన్నట్లు కమిషనర్ వెల్లడించారు. -
విచారణకు సహకరించకపోతే వారిపై కోర్టులో రిట్ దాఖలు చేస్తా
-
బీటెక్ చదివి.. జల్సాలకు అలవాటు పడి...
అన్నం పెట్టిన సంస్థకే కన్నం జ్యూయలరీ షాపులో 350 గ్రాముల బంగారు బిస్కట్లు అపహరణ గుట్టు విప్పిన సీసీ కెమెరా యువకుడి కి రిమాండ్ అల్లిపురం : యువత చెడువ్యసనాలకు అలవాటు పడితే దాని పర్యవసానం ఎలా ఉంటుందో తెలిపే ఓ సంఘటన ఇది. బీటెక్ చదివిన కుర్రాడు.. కుటుంబ సభ్యులకు దూరంగా ఉంటూ ఓ జ్యూలరీ షాపులో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా పనిచేస్తూ, వ్యసనాలకు అలవాటుపడి.. సంపాదన చాలక అన్నం పెడుతున్న సంస్థకే కన్నం పెట్టాడు. ఫలితంగా ఆ యువకుడిని త్రీటౌన్ పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతని వద్ద నుంచి 350 గ్రాముల బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు. నగర పోలీసు కమిషనరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో క్రైం డీసీపీ టి. రవికుమార్‌మూర్తి కేసు వివరాలు వెల్లడించారు. అనంతపురం జిల్లా, తాడిపత్రి మండలం, తలారి చెరువు గ్రామానికి చెందిన జంగంరెడ్డి గారి కుమార్‌రెడ్డి బీటెక్ వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు లేకపోవడంతో బాబాయే పెంచి పెద్ద చేశాడు. చదువు పూర్తయిన తరువాత ఈ ఏడాది జనవరి 21న విశాఖలోని తనిష్క్ జ్యూయలరీ షో రూంలో సేల్స్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగంలో చేరాడు. బాబాయికి దూరంగా ఉండటంతో మంచిచెడులు చెప్పేవారు లేక కుమార్ రెడ్డి దుర్వ్యసనాలపైపు ఆకర్షితుడయ్యాడు. గ్యాంబ్లింగ్, కేసినో బెట్టింగ్‌లతో జల్సాలకు అలవాటు పడ్డాడు. ఆదాయం చాలకపోవడంతో పనిచేస్తున్న సంస్థకు కన్నం వేయడానికి తెగించాడు. ఈ మేరకు గత నెల 26 షోరూం సిబ్బంది అంతా సమావేవంలో ఉండగా, పక్క గదిలో సొరుగు తెరిచి రూ.3.50లక్షల విలువ గల 350గ్రాముల బంగారు బిస్కట్లు దొంగిలించి అక్కడి నుంచి పరారయ్యాడు. విషయం సీసీ కెమెరాల ద్వారా తెలుసుకున్న సంస్థ సిబ్బంది త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడని శుక్రవారం ద్వారకా బస్ స్టేషన్లో అదుపులోకి తీసుకున్నారు. అతని వద్ద నుంచి మొత్తం బంగారు బిస్కట్లు స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ సంద ర్భంగా డీసీపీ టి.రవికుమార్‌మూర్తి మాట్లాడుతూ పూర్తి వివరాలు తెలియకుండా, అపరిచిత వ్యక్తులను ఉద్యోగంలో పెట్టుకోవ ద్దని వ్యాపారులకు సూచించారు. -
మాజీ గన్మెన్ల కోసం విశాఖ పోలీసుల ఆరా
కరీంనగర్: కరీంనగర్ లో తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మాజీ గన్మెన్ల కోసం విశాఖ పోలీసులు ఆరా తీస్తున్నట్టు సమాచారం. రెండేళ్ల క్రితం పెందుర్తి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసు విషయంలో మాజీ గన్మెన్లకు నోటీసులు ఇచ్చేందుకు విశాఖ పోలీసులు యత్నించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో కరీంనగర్ పోలీసు అధికారులు నోటీసు స్వీకరించేందుకు నిరాకరించినట్టు తెలుస్తోంది. దాంతో మాజీ గన్మెన్ల ఆచూకీ తెలియక నిరాశతో విశాఖ పోలీసులు వెనుదిరిగినట్టు సమాచారం.