సాక్షి, విశాఖపట్నం: కిడ్నీ రాకెట్ కేసును వైజాగ్ పోలీసులు ఛేదించారు. కిడ్నీ రాకెట్ కేసుకు సంబంధించి పోలీసులు.. ముగ్గురిని అరెస్ట్ చేశారు. ఇక, ఈ ముఠా.. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న కుటుంబాలను టార్గెట్ చేసిన విషయం తెలిసిందే. కాగా, కిడ్నీ రాకెట్‌లో ఆపరేషన్ చేసిన డాక్టర్లపై పోలీసులు దృష్టిసారించినట్టు తెలిపారు. ఈ కేసులో ఇంకా అరెస్టులు పెరిగే అవకాశముందని పోలీసులు స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా.. కిడ్నీ రాకెట్ వ్యవహారాన్ని ప్రభుత్వం సీరియస్‌గా తీసుకుంది. దీనిపై సమగ్ర దర్యాప్తు చేయాలని వైద్య, ఆరోగ్య శాఖను ఆదేశించింది. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికారులు ఈ ఉదంతంపై విచారణ వేగవంతం చేశారు. దీనిపై జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ అధికారులతోపాటు పోలీసులు కూడా సమగ్ర దర్యాప్తు చేపట్టారు. కాగా, పెందుర్తిలో కిడ్నీ మార్పిడి చేసిన తిరుమల ఆస్పత్రిపై జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ, జీవన్‌దాన్ అధికారులు, పోలీసులు దాడులు నిర్వహించారు. డబ్బు ఆశ చూపించి గత ఏడాది డిసెంబర్ 16వ తేదీన మధురవాడ వాంబే కాలనీకి చెందిన జి.వినయ్‌కుమార్‌కు పెందుర్తి తిరుమల ఆస్పత్రిలో కిడ్నీ తీసుకున్న విషయం తెలిసిందే. ఒప్పందం ప్రకారం రూ.8.50 లక్షలు ఇవ్వకుండా కేవలం రూ.2.50 లక్షలు ఇవ్వడంతో బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో విషయం వెలుగులోకి వచ్చింది.
ఆస్పత్రి సీజ్..
తిరుమల ఆసుపత్రిలో వైద్య సేవలు, సౌకర్యాలపై అధికారులు కలెక్టర్ మల్లికార్జునకు అధికారులు ప్రాథమిక నివేదికను అందజేయగా.. ఆస్పత్రిని సీజ్ చేయాలని ఆదేశించారు. దీంతో డీఎంహెచ్‌వో జగదీశ్వరరావు, పెందుర్తి తహసీల్దార్ సమక్షంలో ఆస్పత్రిని సీజ్ చేశారు. మోసం, మానవ అవయవాల మార్పిడి చట్టం 1995, ఐపీసీ 18, 19తో పాటు 420 ఆర్/డబ్ల్యూ 120(బీ) కింద కేసు నమోదు చేశారు.
ఇది కూడా చదవండి: ఎన్టీఆర్ అభిమానులను బాధపట్టేలా రజనీకాంత్ మాట్లాడారు
Comments
Please login to add a commentAdd a comment