ఐపీఎల్ బెట్టింగ్ నిర్వహిస్తున్న యువకులు
ఎన్‌ఏడీ జంక్షన్(విశాఖ పశ్చిమ): కొత్తపాలెం సాయి గణేష్ మెడికల్ షాపులో క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ఆరుగురు యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు, గోపాలపట్నం పోలీసులు పక్కా సమాచారంతో పట్టుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... కొత్తపాలెం సాయి గణేష్ మెడికల్ షాపులో అల్లిపురానికి చెందిన అల్‌ల్రూ? రామచంద్ర రెడ్డి, గోపాలపట్నానికి చెందిన షేక్ ఇషాక్, శ్రీరామ్‌నగర్‌కు చెం దిన బొడ్డేపల్లి కిషోర్ కుమార్, చంద్రనగర్‌కు చెందిన తుంపల బుజ్జి, నాగేంద్ర కాలనీకి చెందిన అమరపల్లి మహాలక్ష్మి, కొత్తపాలెంకు చెందిన మళ్ల దుర్గాప్రసాద్‌లను అదుపులోకి తీసుకున్నారు. వీరు ముంబయి ఇండియన్స్, కింగ్స్ లెవన్ పంజాబ్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్‌పై ఆన్‌లైన్ ద్వారా బెట్టింగ్ నిర్వహిస్తుండగా పోలీసులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.32 వేలు నగదు, మొబైల్ బెట్టింగ్‌ల వివరాలతో కూడిన మూడు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment