
ముంబై: గృహ రుణ వడ్డీరేట్లను 30 బేసిస్ పాయింట్లు (100 బేసిస్ పాయింట్లు ఒకశాతం) తగ్గిస్తున్నట్లు బ్యాంకింగ్ దిగ్గజం– స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) శుక్రవారం ప్రకటించింది. ప్రాసెసింగ్ ఫీజును పూర్తిగా రద్దు చేస్తున్నట్లూ వివరించింది. కొత్త గృహ రుణ వడ్డీరేట్లను సిబిల్ స్కోర్‌ను అనుసంధానిస్తున్నట్లు కూడా బ్యాంక్ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. అంటే సిబిల్ స్కోర్ బాగుంటే, వడ్డీరేట్లు మరింత తగ్గించే అవకాశం కూడా ఉంటుందన్నమాట. క్తొత వడ్డీరేట్లు చూస్తే...
► రూ. 30 లక్షల వరకూ రుణాలపై వడ్డీరేటు 6.80 వద్ద మొదలవుతుంది.
► రూ.30 లక్షలుపైబడిన రుణాలపై వడ్డీరేటు 6.95 నుంచి ఉంటుంది.
► మహిళా రుణ గ్రహీతలకు 5 బేసిస్ పాయింట్ల రాయితీ కూడా లభిస్తుంది.
యోనో యాప్ ద్వారా దరఖాస్తుకు 5 బేసిస్ పాయింట్ల తగ్గింపు
బ్యాంక్ మేనేజింగ్ డైరెక్టర్ (రిటైల్ అండ్ డిజిటల్ బ్యాంకింగ్) సీఎస్ షెట్టి ప్రకటనలో పేర్కొన్న వివరాల ప్రకారం, పండుగ సీజన్‌లో కస్టమర్లను ఆకర్షించడం, అందరికీ గృహ సౌలభ్యం లక్ష్యంగా తాజా నిర్ణయాలను తీసుకోవడం జరిగింది. రూ.5 కోట్ల వరకూ రుణాలకు ఎనిమిది మెట్రో పట్టణాల్లోనూ 30 బేసిస్ పాయింట్ల రాయితీ లభిస్తుంది. యోనో యాప్ ద్వారా కూడా గృహ రుణ దరఖాస్తు చేసుకోవచ్చు. తద్వారా అదనంగా ఐదు బేసిస్ పాయింట్ల వడ్డీ రాయితీ పొందవచ్చు. 2021 మార్చి వరకూ తాజా రేట్లు అమల్లో ఉంటాయి. టాప్–అప్ గృహ రుణాలకు కూడా అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment