SBI home loans processing fees waiver: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలను తీసుకునే ఖాతాదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై రాయితీతోపాటు, 50 - 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది.
పరిమిత కాల ఆఫర్‌గా ఈ వెసులు బాటును అందిస్తోంది. ఎస్‌బీఐ హోమ్ లోన్ వెబ్‌సైట్ సమాచారం ప్రకారం ఆగస్ట్ 31 వరకే హోమ్ లోన్స్‌పై తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని ఎస్‌బీఐ వెల్లడించింది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!)
రెగ్యులర్ హోమ్ లోన్, ఫ్లెక్సిబుల్ హోమ్ లోన్, ఎన్ఆర్ఐ హోమ్ లోన్, నాన్ శాలరీడ్ హోమ్ లోన్, ప్రివైలేజ్ హోమ్ లోన్, అప్నా ఘర్ హోమ్ లోన్ వంటి వాటిపై ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుందనేది గమనార్హం.రాయితీ లేకుండా ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రుణంపై 0.35శాతం, జీఎస్‌టీ కలుపుకొని కనిష్టంగా రూ.2,000 - రూ. 10వేల మధ్య ఉంటుంది. (వెకేషన్‌లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?)
గమనించవలసిన ముఖ్యమైన అంశాలు
♦ హెచ్ఎల్ రీసేల్, రడీ టూ మూవ్ ప్రాపర్టీలకు గతంలో సూచించిన రేట్ల కంటే 20 bps అదనపు రాయితీ. అయితే సిబిల్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి.
♦ బిల్డర్ టై అప్ ప్రాజెక్ట్‌లకుపైన పేర్కొన్న సిఫార్సు చేసిన రేట్ల కంటే 5 bps ఎక్కువ తగ్గింపు.
♦ శౌర్య, శౌర్య ఫ్లెక్సీ పై ప్రతిపాదిత రేట్ల కంటే అదనంగా 10 బేసిస్ పాయింట్ల రాయితీ.
హెచ్ఎల్ అండ్ టాప్ అప్ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 2 వేల నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీంతోపాటు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా పొందొచ్చు. అలాగే ఇన్‌స్టాల్ హోమ్ టాప్ అప్, రివర్స్ మోర్ట్‌గేజ్, ఈఎంఐ వంటి రుణాలకు ఎలాంటి ప్రాపెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ఉండదు. మ రోవైపు రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్‌ఆర్‌ను తాజాగా పెంచింది. కాల వ్యవధి ఆధారంగా దీన్ని 8 శాతం నుంచి 8.75 శాతం మధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే. (కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం)
Comments
Please login to add a commentAdd a comment