concession
-
ఎన్ని ఎలక్ట్రిక్ వాహనాలు కొన్నా రాయితీ
సాక్షి, హైదరాబాద్: ఇక నుంచి కొనుగోలు చేసే ప్రతీ ఎలక్ట్రిక్ వాహనానికి రాయితీ వర్తించనుంది. రిజిస్ట్రేషన్ చార్జీలు, లైఫ్ ట్యాక్స్ సహా అన్ని రకాల పన్నులు చెల్లించాల్సిన పని ఉండదు. ఈ మేరకు ఎలక్ట్రిక్ వాహన పాలసీని మారుస్తూ రాష్ట్ర ప్రభుత్వం కొత్త విధానాన్ని ప్రకటించింది. 2021లో బీఆర్ఎస్ ప్రభుత్వం తొలిసారి రాష్ట్రంలో ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అమలులోకి తెచ్చింది. తక్కువ వాహనాలే ఉంటాయన్న ఉద్దేశంతో.. కొనుగోలు చేసే తొలి 5 వేల కార్లకు, ద్విచక్ర వాహనాల్లో తొలి 2 లక్షల వాహనాలకు.. ఇలా అన్ని కేటగిరీలు కలిపి దాదాపు 2.25 లక్షల వాహనాలకు ఆ రాయితీలను పరిమితం చేశారు. వాటిల్లో దాదాపు 1.60 లక్షల వాహనాలు భర్తీ అయ్యాయి. కార్లలో 5 వేల పరిమితి దాటి పోయింది. కొత్తగా కార్లు కొనేవారికి రాయితీలు అందే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో ఆ విధానాన్ని సమూలంగా మార్చాలని నిర్ణయించిన కాంగ్రెస్ ప్రభుత్వం, వాహనాల సంఖ్యతో ప్రమేయం లేకుండా.. ఎన్ని వాహనాలు కొన్నా, రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రకటిస్తూ జీఓ నెం.41 జారీ చేసింది. అపరిమిత రాయితీ.. గతంలో ఉన్న రాయితీ విధానాన్ని య«థావిధిగా కొనసాగిస్తూనే, రాయితీ పొందే వాహనాల సంఖ్యపై సీలింగ్ ఎత్తేసింది. ఇక నుంచి ఎంతమంది, ఎన్ని వాహనాలు కొన్నా పూర్తి రాయితీ వర్తించేలా పాలసీలో మార్పులు చేసింది. అయితే బస్సుల వరకు వచ్చే సరికి కొన్ని పరిమితులు విధించింది. ఆర్టీసీ బస్సులు, ఉద్యోగులను ఉచితంగా తరలించేందుకు వినియోగించే ప్రైవేట్ కంపెనీల బస్సులకు మాత్రం పూర్తి రాయితీలు వర్తిస్తాయి. పర్మిట్లతో నడిచే టూరిస్టు, ట్రావెల్స్ బస్సులు, విద్యార్థులను తరలించే విద్యా సంస్థల బస్సులకు ఈ రాయితీలు వర్తించవని స్పష్టం చేసింది. 2026 డిసెంబరు 31 వరకు వర్తింపు గత ప్రభుత్వం వాహనాల సంఖ్యపై సీలింగ్ విధిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కాలపరిమితిని ఉత్తర్వుల్లో పేర్కొంది. కొత్త విధానం ఈ సంవత్సరం నవంబరు 18 నుంచి 2026 డిసెంబరు 31 వరకు వర్తిస్తుందని స్పష్టం చేసింది. గడువు తీరిన తర్వాత మరోసారి సమీక్షించి నిర్ణయం తీసుకోనున్నట్టు వెల్లడించింది. అప్పుడు రూ.473 కోట్లు.. ఇప్పుడు ఎంతో? బీఆర్ఎస్ ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహన విధానాన్ని అందుబాటులోకి తెచ్చే నాటికి రాష్ట్రంలో కేవలం పది వేల ఎలక్ట్రిక్ వాహనాలే ఉన్నాయి. ఇప్పటి వరకు 1.61 లక్షల కొత్త వాహనాలు రోడ్డెక్కాయి. కొత్తగా కొన్న వాహనాలకు (సీలింగ్ లోపు ఉన్న వాహనాలు) వర్తించిన రాయితీ మొత్తం రూ.473 కోట్లు. ఇప్పుడు ఎలక్ట్రిక్ వాహనాల కొనుగోలు భారీగా పెరిగింది. అన్ని కేటగిరీ వాహనాలు కలిపి నిత్యం 15 వరకు అమ్ముడవుతున్నాయి. వీటిల్లో ఐదారు కార్లు ఉంటున్నాయి. ఈ సంఖ్య క్రమంగా పెరుగుతోంది. దీంతో రాయితీ రూపంలో వాహన దారులకు కలిగే లబ్ధి విలువ భారీగానే ఉండనుంది. ఈ లెక్కన గతంతో పోలిస్తే రాయితీల మొత్తం మూడురెట్లు పెరుగుతుందని అంచనా. ప్రతి ఎలక్ట్రిక్ వాహనం వినియోగంతో సంవత్సరానికి రూ. లక్ష వరకు ఆదా అవుతుందని ప్రభుత్వం చెబుతోంది (కేటగిరీ ఆధారంగా కాస్త అటూ ఇటుగా). ఆ వాహనదారుల సంగతేంటి..? గత ప్రభుత్వ విధానం ప్రకారం కొన్ని కేటగిరీల వాహనాలకు సంబంధించి సంఖ్యాపరంగా ఉన్న పరిమితి దాటిపోయింది. ఆ తర్వాత కొన్న వాహనాలకు రాయితీ రావటం లేదు. అన్నింటికి రాయితీ వర్తించేలా కొత్త విధానాన్ని ప్రభుత్వం ప్రకటించినందున, తమను వాటిల్లో భాగంగా పరిగణించాలంటూ యజమానులు కోరుతూ రవాణాశాఖ కార్యాలయాలకు ఫోన్లు చేస్తున్నారు. కానీ, కొత్త విధానం సోమవారం నుంచి అమలులోకి వస్తున్నందున, రాయితీ ఇవ్వలేమంటూ అధికారులు చెబుతున్నారు. దీంతో వారు ప్రభుత్వాన్ని అభ్యర్థించి, రాయితీ తెచ్చుకునే ప్రయత్నం మొదలుపెట్టారు.ఎలక్ట్రిక్ వాహనాలు కొనేలా చైతన్యం తెస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం పెరగాలని, ఈ దిశలో ప్రజల్లో చైతన్యం తెచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఎలక్ట్రిక్ వాహన విధానంలో చేసిన మార్పులను ఆయన ఆదివారం సచివాలయంలో వెల్లడించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, గత ప్రభుత్వం ఎలక్ట్రిక్ వాహనాల సంఖ్యపై సీలింగ్ విధించటంతో కొత్తగా ఆ వాహనాలు కొనేవారికి రాయితీలు రావటం లేదని, అందుకే తాము వాటి సంఖ్యపై ఉన్న పరిమితిని తొలగించామ న్నారు. అయితే, ఎలక్ట్రిక్ వాహనాలను తయారు చేసే సంస్థలు సామాజిక బా ధ్యతగా భావించి, ప్రైవేట్‌గా చార్జింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయాలని కోరారు. విద్యా సంస్థల బస్సులకు రాయితీ వర్తింపు విషయంలో చర్చించి నిర్ణయం తీసుకోవాల్సి ఉందన్నారు. -
3 రోజుల్లో చలాన్లకు రూ. 8.44 కోట్ల చెల్లింపు
సాక్షి, హైదరాబాద్: పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీకి రాష్ట్ర వ్యాప్తంగా వాహనదారుల నుంచి భారీ స్పందన లభి స్తోంది. పెద్దఎత్తున జరిమానాలు పడిన వాహనదారులు ప్రభుత్వం ప్రకటించిన రాయితీని వినియోగించుకుంటు న్నారు. 3 రోజుల్లోనే 9.61 లక్షల చలాన్లకు సంబంధించి రూ.8.44 కోట్ల మేర జరిమానాలను చెల్లించారు. ఈ మేరకు రవాణా శాఖ వర్గాలు వివరాలు వెల్లడించాయి. హైదరా బాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో 3.54 లక్షల చలాన్లతో రూ. 2.62 కోట్లు, సైబరాబాద్ కమిషనరేట్ పరి ధిలో 1.82 లక్షల చలాన్ల చెల్లింపుతో రూ.1.80 కోట్లు, రాచకొండ కమిషనరేట్ పరిధిలో 93 వేల చలాన్ల నుంచి రూ.76.79 లక్షల ఆదాయం సమకూరిందని అధికారులు తెలిపారు. కాగా, చెల్లింపులు అధికంగా ఉంటున్న నేపథ్యంలో సర్వర్ తరచూ మొరాయిస్తున్నట్లు వాహనదారులు తెలిపారు. -
తెలంగాణ వాహనదారులకు గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ సర్కార్ జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బైక్‌లు, ఆటోలకు 80 శాతం.. బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ వెహికల్స్‌కు 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరిట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. ఇదీ చదవండి: ‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’ -
ట్రాఫిక్ చలాన్ల చెల్లింపునకు నేటినుంచే రాయితీ
వరంగల్ క్రైం: ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారులకు జరిమానాల చెల్లింపు రాయితీ కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీపికబురు అందించిన విషయం తెలిసిందే. మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరి ట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది. అందరూ చెల్లిస్తే రూ.80కోట్లు వసూలయ్యే అవకాశం.. వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలు ఉన్నాయి. 2018 జనవరి ఒకటి నుంచి ఈ నెల 25వ తేదీ వరకు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలకింద 47,31,823 చల్లాన్లు ఉండగా, జరిమానా రూ.140,91,52,550 విధించారు. గత మార్చి నెలలో రాష్ట్ర ప్రభుత్వం రాయితీ కల్పించిన సమయంలో, పోలీస్ అధికారులు వాహనాల తనిఖీల సందర్భంగా 20,17,109 చల్లానకుగాను రూ.62,72,66,426 వసూలయ్యాయి. మిగిలిన చలాన్లు 27,14,714 ఉండగా, జరిమానా రూ.80,18,86,124 పెండింగ్‌లో ఉంది. కాగా, ఈ ఏడాది జనవరినుంచి ఈ నెల 25వ తేదీ వరకు వరంగల్ కమిషనరేట్ పోలీసులు ద్విచక్ర వాహనాలపై 5,73,436, ఆటోలపై 20,700, కార్లపై 1,15,421, లారీలపై 938, భారీ వాహనాలపై 2081, మొత్తం 7,14,720 చలాన్లు విధించారు. వాహనాలపై రాయితీ ఇలా.... బైక్‌లు, ఆటోలపై 80శాతం, కార్లు, ట్రక్కులు, భారీ వాహనాలపై 60 శాతం, ఆర్టీసీ, తోపుడు బండ్లపై 90 శాతం రాయితీని ప్రభుత్వం కల్పించింది. రాయితీ అవకాశాన్ని వినియోగించుకోవాలి ట్రాఫిక్ నిబంధనలను అతిక్రమించిన వాహనదారులకు రాష్ట్ర ప్రభుత్వం రాయితీ అవకాశం కల్పించింది. చలాన్లు ఉన్న వాహనదారులు తప్పకుండా వినియోగించుకోవాలి. వాహనదారులు ఎట్టిపరిస్థితుల్లోనూ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించొద్దు. ముఖ్యంగా మైనర్లకు వాహనాలు ఇవ్వొద్దు. అతివేగంగా ప్రయాణించి ప్రమాదాలకు గురికావద్దు. వాహనదారులు నిబంధనలను పాటిస్తూ ట్రాఫిక్ పోలీసులకు సహకరించాలి. – సీపీ అంబర్ కిషోర్ ఝా ఇష్టారాజ్యంగా చలాన్ల విధింపు.. కమిషనరేట్ పరిధిలో వాహనదారులపై పోలీస్ అధికారులు విధించిన చలాన్లపై సర్వతా విమర్శలు వెల్లువెత్తాయి. ఉదయం సమయంలో వాకింగ్వెళ్లొచ్చే వాహనదారులపైనా విత్అవుట్ హెల్మెట్కింద జరిమానాలు విధిస్తున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా నగరంలో ప్రత్యేకంగా ఎక్కడ కూడా పార్కింగ్ స్థలాలు లేవు. కానీ ట్రాఫిక్ పోలీసులు వాహనాలను రోడ్డు పక్కన నిలిపితే నో పార్కింగ్ పేరిట జరిమానాలు విధించారు. ట్రాఫిక్ నిబంధనలను తెలియజేసే సైన్ బోర్డులు అక్కడక్కడ మాత్రమే కనిపిస్తున్నాయి. కానీ జరిమానాలు మాత్రం అంతటా వేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ట్రాఫిక్‌లో పనిచేసే కొంతమంది రోడ్డు పక్కనే పార్కింగ్ చేసిన వాహనాల ఫొటోలు తీసి చలాన్లు పంపించే పనికి మాత్రమే పరిమితమయ్యారన్న విమర్శలు లేకపోలేదు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర సిబ్బంది చాలామంది జరిమానాల విధింపుపైనే దృష్టి కేంద్రీకరించడం గమనార్హం. -
అవ్వా తాతలకు ‘ఆత్మియుడి’ అండ
సాక్షి, అమరావతి: జీవితంలో ఎన్నో ఒడిదొడుకులను ఎదుర్కొని, పిల్లల కోసం ఎంతో కష్టపడి వయస్సు మీద పడిన వృద్ధులకు కావాల్సింది ఓ ఆత్మీయ పలకరింపు. అవ్వా బాగున్నావా.. తాతా బాగున్నావా.. అంటూ మలి సంధ్యలో ఉన్న వారి అవసరాలను తీరిస్తే వారికి అదే ఆనందం. సీఎంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి రాష్ట్రంలోని వయో వృద్ధులకు అండగా నిలుస్తున్నారు. ప్రభుత్వమే పెద్ద భరోసా అన్నట్లుగా వారికి అవసరమైన అన్ని వనరులు సమకూరుస్తున్నారు. అవ్వా.. తాతా.. అంటూ ఆత్మీయతను అందిస్తున్నారు. వృద్ధాప్య పింఛన్ల నుంచి వైద్యం, ఇతర సౌకర్యాలు కల్పిస్తున్నారు. సంక్షేమంతో పాటు భద్రత, హక్కుల పరిరక్షణకు పటిష్టమైన చర్యలు చేపట్టారు. గతంలోలా వృద్ధులు పింఛను కోసం మండల, జిల్లా కేంద్రాల్లోని అధికారుల చుట్టూ తిరగాల్సిన అవసరం లేకుండా, ఎవరెవరినో బతిమాలుకోవాల్సిన పని లేకుండా వారు ఉన్న చోటుకే వచ్చి పింఛను డబ్బు ఇచ్చేలా ఏర్పాట్లు చేశారు సీఎం వైఎస్ జగన్. గతంలో వృద్ధులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగలేక, సొమ్మసిల్లి పడిపోయిన సందర్భాలు అనేకం. సీఎం జగన్ ఆ కష్టాల నుంచి అవ్వా తాతలను గట్టెక్కించారు. ఇప్పుడు వలంటీర్లు స్వ యంగా వారు ఉన్న చోటుకు వచ్చి పింఛను డబ్బు అందిస్తున్నారు. వైద్యం కోసం ఆస్పత్రుల వరకు వెళ్లాల్సిన అవసరం లేకుండా వైద్యులే గ్రామాలకు వచ్చి, పరీక్షలు చేసి, మందులు కూడా ఇస్తున్నారు. సామాజిక భద్రతలో భాగంగా నెలకు రూ.2,750 చొప్పున వృద్ధాప్య పింఛన్లు అందిస్తోంది. గతంలో వృద్ధాప్య పింఛన్ 65 ఏళ్ల వయోపరిమితి ఉంటే దాన్ని 60 ఏళ్లకే కుదించి ఎక్కువ మందికి వైఎస్సార్ పెన్సన్ కానుక అందిస్తోంది. వృద్ధాప్య, ఇతరత్రా పింఛన్లతో మొత్తం 41,05,501 మంది వృద్ధులు లబ్ధి పొందుతున్నారు. ఏడాదికి సగటున రూ.13,260.41 కోట్లు వృద్ధులకు పింఛన్ రూపంలో ప్రభుత్వం అందిస్తోంది. ప్రభుత్వం ఏపీఎస్‌ఆరీ్టసీ బస్సుల్లో టిక్కెట్ చార్జీ పై 25 శాతం రాయితీ ఇస్తోంది. బస్సుల్లో ముందు డోర్ సమీపంలోని మూడు సీట్లు వృద్ధుల కోసం కేటాయించింది. బస్టాండ్లలో వీల్చైర్లు అందుబాటులో ఉంచింది. వృద్ధుల కోసం మచిలీపట్నం, చిత్తూరులో రాష్ట్ర ప్రభుత్వం 2 వృద్ధాశ్రమాలను నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ సహకారంతో స్వచ్ఛంద సంస్థలు (ఎన్జీవోలు) 68 వృద్ధాశ్రమాలు నిర్వహిస్తున్నాయి. శ్రీకాకుళం, విశాఖ, తూర్పుగోదావరి, ఎన్టీఆర్, కర్నూలు, వైఎస్సార్, తిరుపతి జిల్లా కేంద్రాల్లోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో 7 ఫిజియోథెరపీ కేంద్రాలను ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇప్పటివరకు 47,490 మంది వృద్ధులు వీటిని ఉపయోగించుకున్నారు. వృద్ధుల సమస్యలు, అవసరాలను గుర్తించి తక్షణ చర్యలు చేపట్టేందుకు 2021 డిసెంబర్ నుంచి ఎ ల్డర్ లైన్ 14567 (హెల్ప్‌లైన్) నిర్వహిస్తోంది. 26 జిల్లాల నుంచి 39,332 మంది దీని సేవలు ఉపయోగించుకున్నారు. సీఎం జగన్ ప్రత్యేక శ్రద్ధ రాష్ట్రంలో 2011 జనాభా లెక్కల ప్రకారం 50,08,662 మంది వృద్ధులు ఉన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత వృద్ధుల సంక్షేమంపై సీఎం వైఎస్ జగన్ ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. మలి సంధ్యలో ఎవరూ అవస్థలు పడకూడదనే ఉద్దేశంతో వారి కోసం అనేక కార్యక్రమాలు చేపట్టారు. వయోవృద్ధుల సమస్యలు, అవసరాలు గుర్తించి సకాలంలో చర్యలు తీసుకునేలా జిల్లా స్థాయిలో ప్రత్యేక యంత్రాంగాన్ని ఏర్పాటు చేశారు. – బి.రవిప్రకాశ్‌రెడ్డి, సంచాలకులు, రాష్ట్ర వయోవృద్ధులు, దివ్యాగుల సంక్షేమ శాఖ 5న వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం ఏపీ వయో వృద్ధుల రాష్ట్ర కౌన్సిల్ తొలి సమావేశం అక్టోబర్ 5న నిర్వహించనున్నారు. మహిళ, శిశు, విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్ అధ్యక్షతన వెలగపూడిలోని రాష్ట్ర సచివాలయంలో తొలి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ట్రిబ్యునల్స్, అప్పిలేట్ ట్రిబ్యునల్స్‌లో తల్లిదండ్రులు, వయోవృద్ధుల ఫిర్యాదుల పరిస్థితి, వారి వైద్య సంరక్షణ, జీవనం, వంటి ప్రధాన అంశాలపై ఈ సమావేశంలో చర్చించి తగిన చర్యలు తీసుకో వాలని సంబంధిత శాఖలకు ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి జి.జయలక్ష్మి ఉత్తర్వులు జారీ చేశారు. -
‘షాక్’ ఇస్తే సర్వీసులెలా పెరిగాయి?.. ఈనాడు కథనం అవాస్తవం
సాక్షి, అమరావతి: ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో గత రెండున్నరేళ్లలో చేనేత విద్యుత్ సర్వి సులు పెరిగాయని సంస్థ సీఎండీ కె. సంతోషరావు తెలిపారు. ‘నేతన్నలకు కరెంట్ షాక్’ అనే శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై గురువారం ఆయన స్పందించారు. నేతన్నలకు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 2021–22 వరకూ 9,912 విద్యుత్ సర్వీసులు వుండగా, 2022–23 నాటికి ఆ సర్వి సుల సంఖ్య 10,125కు పెరిగిందని.. 2023–24 జూలై నాటికి మొత్తం 10,157 సర్వి సులున్నాయన్నారు. అయితే, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పవర్ లూమ్స్ విద్యుత్ సర్వి సుల సంఖ్య తగ్గినట్లు ఈనాడు కథనంలో రాయడం అవాస్తవమన్నారు. షాక్ ఇస్తే సర్వి సులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇంధన చార్జీల్లో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. అలాగే, చేనేత కార్మికుల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, నేతన్నల అభ్యర్థన మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) కిలోవాట్ హవర్ (కేడబ్ల్యూహెచ్) బిల్లింగ్ విధానానికి అనుమతించిందని తెలిపారు. ఈ ఉత్తర్వులవల్ల మగ్గాలకు సంబంధించిన సర్వీసుల విద్యుత్ బిల్లు కొంతమేరకు తగ్గినట్లు సీఎండీ వెల్లడించారు. -
ఎస్బీఐ ఖాతాదారులకు అదిరిపోయే వార్త!
SBI home loans processing fees waiver: దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ రంగ బ్యాంక్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తాజాగా కస్టమర్లకు గుడ్ న్యూస్ చెప్పింది. గృహరుణాలను తీసుకునే ఖాతాదారులకు ఊరటనిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. గృహ రుణాలపై రాయితీతోపాటు, 50 - 100 శాతం ప్రాసెసింగ్ ఫీజును రద్దు చేసింది. పరిమిత కాల ఆఫర్‌గా ఈ వెసులు బాటును అందిస్తోంది. ఎస్బీఐ హోమ్ లోన్ వెబ్సైట్ సమాచారం ప్రకారం ఆగస్ట్ 31 వరకే హోమ్ లోన్స్‌పై తగ్గింపు ఆఫర్ వర్తిస్తుందని ఎస్బీఐ వెల్లడించింది. (నిజంగా భయంకరమే..! రేణూ దేశాయ్ అద్భుతమైన పిక్స్ వైరల్!) రెగ్యులర్ హోమ్ లోన్, ఫ్లెక్సిబుల్ హోమ్ లోన్, ఎన్ఆర్ఐ హోమ్ లోన్, నాన్ శాలరీడ్ హోమ్ లోన్, ప్రివైలేజ్ హోమ్ లోన్, అప్నా ఘర్ హోమ్ లోన్ వంటి వాటిపై ఈ తగ్గింపు ప్రయోజనం అందుబాటులో ఉంటుందనేది గమనార్హం.రాయితీ లేకుండా ప్రాసెసింగ్ ఫీజు మొత్తం రుణంపై 0.35శాతం, జీఎస్టీ కలుపుకొని కనిష్టంగా రూ.2,000 - రూ. 10వేల మధ్య ఉంటుంది. (వెకేషన్లో ఉన్న ఈ నటి ఎవరు, ఆ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?) గమనించవలసిన ముఖ్యమైన అంశాలు ♦ హెచ్ఎల్ రీసేల్, రడీ టూ మూవ్ ప్రాపర్టీలకు గతంలో సూచించిన రేట్ల కంటే 20 bps అదనపు రాయితీ. అయితే సిబిల్ స్కోర్ 700 లేదా అంతకంటే ఎక్కువ ఉండాలి. ♦ బిల్డర్ టై అప్ ప్రాజెక్ట్లకుపైన పేర్కొన్న సిఫార్సు చేసిన రేట్ల కంటే 5 bps ఎక్కువ తగ్గింపు. ♦ శౌర్య, శౌర్య ఫ్లెక్సీ పై ప్రతిపాదిత రేట్ల కంటే అదనంగా 10 బేసిస్ పాయింట్ల రాయితీ. హెచ్ఎల్ అండ్ టాప్ అప్ రుణాలకు ప్రాసెసింగ్ ఫీజులో 50 శాతం తగ్గింపు లభిస్తుంది. దీని ప్రకారం జీఎస్టీ కాకుండా రూ. 2 వేల నుంచి గరిష్టంగా రూ. 5 వేల వరకు ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. దీంతోపాటు 100 శాతం ప్రాసెసింగ్ ఫీజు బెనిఫిట్ కూడా పొందొచ్చు. అలాగే ఇన్స్టాల్ హోమ్ టాప్ అప్, రివర్స్ మోర్ట్గేజ్, ఈఎంఐ వంటి రుణాలకు ఎలాంటి ప్రాపెసింగ్ ఫీజు మాఫీ బెనిఫిట్ ఉండదు. మ రోవైపు రుణాలపై వసూలు చేసే ఎంసీఎల్ఆర్ను తాజాగా పెంచింది. కాల వ్యవధి ఆధారంగా దీన్ని 8 శాతం నుంచి 8.75 శాతం మధ్య నిర్ణయించిన సంగతి తెలిసిందే. (కంపెనీ సీఈవో కాదు, అయినా రోజుకు నాలుగు లక్షల జీతం) -
Tsrtc: ప్రయాణికులకు బంపర్ ఆఫర్.. ఆ రూట్లలో 10 శాతం రాయితీ
సుదూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం బెంగుళూరు, విజయవాడ రూట్లలో టికెట్ పై 10 శాతం రాయితీ కల్పించాలని తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ(టీఎస్ఆర్టీసీ) నిర్ణయించింది. ఆ రెండు మార్గాల్లో రాకపోకలు సాగించే ప్రయాణికులు ముందస్తు రిజర్వేషన్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై ఈ 10 శాతం డిస్కౌంట్ ను సంస్థ ఇవ్వనుంది. ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో ఆదివారం(జులై 2) నుంచి 10 శాతం రాయితీ అమల్లోకి వస్తుంది. ఈ రాయితీ ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉంటుంది. ''విజయవాడ, బెంగళూరు మార్గాల్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. వారికి ఆర్థిక భారం తగ్గించాలనే ఉద్దేశంతోనే ముందస్తు రిజర్వేషన్ సదుపాయం ఉన్న అన్నీ సర్వీసుల్లో 10 శాతం రాయితీ కల్పించాలని సంస్థ నిర్ణయించింది. రానూపోను ఒకే సారి బుక్ చేసుకుంటే తిరుగు ప్రయాణంపై 10 శాతం రాయితీ ఉంటుంది. ఈ డిస్కౌంట్ వల్ల విజయవాడ మార్గంలో రూ.50 వరకు, బెంగళూరు మార్గంలో రూ.100 వరకు ఒక్కో ప్యాసింజర్‌కు ఆదా అవుతుంది. ఆగస్టు 15 వరకు అందుబాటులో ఉండే ఈ రాయితీ సదుపాయాన్ని ప్రయాణికులు వినియోగించుకోవాలి" అని టీఎస్ఆర్టీసీ చైర్మన్, ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్దన్, సంస్థ ఎండీ వీసీ సజ్జనర్, ఐపీఎస్ కోరారు. ముందస్తు రిజర్వేషన్ కోసం తమ అధికారిక వెబ్సైట్ www.tsrtconline.com ను సంప్రదించాలని సూచించారు. చదవండి: గ్రూప్-4 ఎగ్జామ్: అభ్యర్థి కొంపముంచిన గూగుల్ మ్యాప్ -
పరిశ్రమలపై రాయితీల జల్లు
విజయనగరం ఫోర్ట్: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంతో పాటు ఉన్న పరిశ్రమలకు ఆర్థిక ఊతం అందిస్తోంది. రాయితీల జల్లు కురిపిస్తోంది. చిన్న, మధ్య, పెద్ద తరహా పరిశ్రమలకు విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తోంది. బిల్లుల భారం తగ్గించి అధిక ఉత్పాదకతకు తోడ్పాటునందిస్తోంది. జిల్లాలో సగానికిపైగా విద్యుత్‌ను వినియోగించే ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమల ఆర్థిక వృద్ధికి విద్యుత్ రాయితీలు ఉపయోగపడుతున్నా యి. పరిశ్రమలు ఇలా.. జిల్లాలో 11 ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలు ఉన్నాయి. ఫేకర్ ఎల్లాయీస్ లిమిటెడ్, హిరఎలక్ట్రో స్మిల్టర్స్ పీవీటీ లిమిటెడ్, ఆంజనేయ ఫెర్రో ఎల్లాయీస్ లిమిటెడ్, మీడీఏ మినరల్ దాతు ప్రైవేట్ లిమిటెడ్, మోరో ఎల్లాయీస్ పీవీటీ లిమిటెడ్, సిరి స్మిల్టర్స్ ఎనర్జీపీవీటీ లిమిటెడ్, జిందాల్ స్టేషనల్స్ లిమిటెడ్, ఆరో శ్రీ వెంకటేశ్వర స్వామి స్టీల్స్, డెక్కన్ ఫెర్రో ఎల్లాయీస్ లిమిటెడ్, శ్రీ మహలక్ష్మి స్మిల్టర్స్ పీవీటీ లిమిటెడ్, బెర్రా ఎల్లాయీస్ లిమిటెడ్ పరిశ్రమలు ఉన్నాయి. ఏడాదికి రూ.80 కోట్ల వరకు రాయితీ ఫెర్రోఎల్లాయీస్ పరిశ్రమలకు ప్రభుత్వం ఏడాదికి రూ. 80 కోట్లు వరకు విద్యుత్ రాయితీ కల్పిస్తోంది. ఏడాదికి జిల్లాలో అన్ని రకాల విద్యుత్ కనెక్షన్లకు కలిపి 3,252 మిలియన్ యూనిట్ల విద్యుత్ వినియోగం అవుతోంది. వీటిలో ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలు 2,400 మిలియన్ యూనిట్ల విద్యుత్‌ను వినియోగిస్తున్నాయి. 852 మిలియన్ యూనిట్లు మిగతా విద్యుత్ వినియోగదారులు వినియోగిస్తున్నారు. పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదం ఫెర్రో ఎల్లాయీస్ పరిశ్రమలకు ప్రభుత్వం విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తోంది. ఏడాదికి రూ.77.93 కోట్ల విలువైన్ విద్యుత్‌ను రాయితీపై సరఫరా చేస్తున్నాం. ఇది పరిశ్రమల ఆర్థిక వృద్ధికి దోహదపడుతుంది. – పి.నాగేశ్వరరావు, విద్యుత్‌శాఖ ఎస్ఈ -
పోటాపోటీగా పేటెంట్లు.. రాయితీలతో కేంద్రం వెన్నుదన్ను
సాక్షి, అమరావతి : కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ ఉన్నత విద్యాసంస్థలతో పాటు ప్రైవేటు యూనివర్సిటీలు, విద్యాసంస్థలు పేటెంట్ల విషయంలో పోటీపడుతున్నాయి. వీటిల్లో పరిశోధనా కార్యక్రమాలను మరింత పగడ్బందీగా కొనసాగిస్తుండడంతో కొత్త ఆవిష్కరణలతో స్వయం సమృద్ధికి వీలుగా మేథో సంపత్తి హక్కుల (ఇంటెలెక్యువల్ ప్రాపర్టీ రైట్స్) సాధనలో పురోగతి సాధిస్తున్నాయి. కేంద్రం కూడా ఈ ఉన్నత విద్యా సంస్థల్లో చేపట్టే ఆవిష్కరణలకు పేటెంట్లు కల్పించడంలో 80 శాతం ఫీజు రాయితీలు ఇవ్వడం కూడా నూతన ఆవిష్కరణలకు కారణమవుతున్నాయి. ఫలితంగా ఈ సంస్థలలో పేటెంట్ల సంఖ్య క్రమేణా పెరుగుతోంది. నిజానికి.. ఏదైనా సంస్థ పేటెంట్ దాఖలు చేయాలంటే ముందుగా రూ.20వేల ఖర్చుపెట్టాలి. ఆ తరువాత వాటి పరిశీలన తదితర ప్రక్రియలలో మరికొంత మొత్తాన్ని ఛార్జీలుగా చెల్లించాలి. దీనికి అదనంగా.. పేటెంట్ చేసే వ్యక్తి 20 ఏళ్లపాటు దాని నిర్వహణ రుసుమును కూడా జమచేయాల్సి ఉంటుంది. దీనివల్ల ఇప్పటివరకు ఉన్నత విద్యాసంస్థల్లో పేటెంట్లపై ఆసక్తి కనబర్చలేదు. అయితే, కేంద్ర ప్రభుత్వం పరిశోధన, నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించే దిశగా చట్టాన్ని సవరించి 80 శాతం రాయితీలను ప్రకటించడంతో క్రమేణా పేటెంట్లు పెరిగేందుకు ఆస్కారమేర్పడుతోంది. నూతన జాతీయ విద్యావిధానం–2020లో కూడా ఉన్నత విద్యా సంస్థల్లో నూతన ఆవిష్కరణలకు పెద్దపీట వేయాలని.. వాటి ద్వారా ఆయా సంస్థలు ఆర్థికంగా స్వయం సమృద్ధి సాధించేందుకు ప్రణాళికలు అమలుచేయాలని సూచించింది. సమగ్ర పరిశోధనలతో నూతన ఆవిష్కరణలు చేసే వారికి ఆర్థిక సహకారం కూడా అందించేలా మార్గనిర్దేశం చేసింది. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఏటా అధ్యాపకులు, పరిశోధక అభ్యర్థులకు నిధులు కూడా ఇస్తోంది. ఇలా ఏటా 10వేల పేటెంట్ల లక్ష్యంగా ఈ ప్రోత్సాహకాలను అందిస్తోంది. పేటెంట్ల వాణిజ్యీకరణను ప్రోత్సహించడం ద్వారా ప్రపంచ పేటెంట్ ర్యాంకింగ్స్‌లో స్థానాన్ని మెరుగుపర్చుకునేందుకు కేంద్రం చర్యలు చేపట్టింది. ఏయూలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు ఈ పేటెంట్లను ప్రోత్సహించడానికి రాష్ట్రంలోని ఆంధ్రా విశ్వవిద్యాలయం తన క్యాంపస్‌లో మేథో సంపత్తి హక్కుల కోసం ప్రత్యేక కేంద్రాన్ని ఏర్పాటుచేసింది. ఈ కేంద్రం డాక్యుమెంటేషన్ ప్రక్రియను పర్యవే„ìక్షించడంతో పాటు దాఖలుకు అయ్యే ఖర్చును కూడా భరిస్తోంది. అనేక విద్యాసంస్థల విద్యార్థులు తమ మెంటార్ల మార్గదర్శకత్వంలో వినూత్న ప్రాజెక్టుల పేటెంట్ల దాఖలుకు ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. మరోవైపు.. 2020–21లో విద్యాసంస్థలు, ఇతర పరిశోధనా సంస్థలు అందించిన పేటెంట్ దరఖాస్తులు 58,503గా ఉన్నాయి. అందులో ప్రధానంగా మహారాష్ట్ర 4,214, తమిళనాడు 3,945, కర్ణాటక 2,784, యూపీ 2,317, తెలంగాణ 1,662, పంజాబ్ 1,650, ఢిల్లీ 1,608, గుజరాత్ 921, హర్యానా 765, ఆంధ్రప్రదేశ్ 709, పశ్చిమ బెంగాల్ 505 రాజస్థాన్ 449, కేరళ 426, మధ్యప్రదేశ్ 398, ఒడిశా 144, పాండిచ్చేరి నుంచి 139 దరఖాస్తులు వచ్చాయి. పేటెంట్లలో ముందున్నవి ఇవే.. ఇక కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్, డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ అగ్రికల్చరల్ రీసెర్చ్ వంటి పరిశోధనా సంస్థలు అత్యధిక సంఖ్యలో పేటెంట్లను దాఖలు చేయడంలో ముందున్నాయి. కంట్రోలర్ జనరల్ ఆఫ్ పేటెంట్స్, డిజైన్, ట్రేడ్‌మార్క్ (సీజీపీడీటీఎం) నివేదిక ప్రకారం 2019–2020లో టాప్–10 విద్యాసంస్థలు అందించిన పేటెంట్ల సంఖ్య 2,533 కాగా.. 2020–21లో ఆ సంఖ్య 3,103కి పెరిగింది. 2019–20లో ఐఐటీలు 664 పేటెంట్లను దాఖలు చేశాయి. లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, చండీగఢ్ వర్సిటీ వంటి ప్రైవేట్ విశ్వవిద్యాలయాలు తక్కిన పేటెంట్లకు దరఖాస్తు చేశాయి. అలాగే, 2020–21లో ఐఐటీలు 640 పేటెంట్లు ప్రకటించగా తక్కిన సంస్థల్లో అవి మరింత మెరుగుపడ్డాయి. ఈ వర్సిటీల్లో టెక్నాలజీ బిజినెస్ ఇంక్యుబేటర్లను ఏర్పాటుచేసి ఈ పేటెంట్లను దాఖలు చేశాయి. ఇదీ చదవండి: AP: ఫ్యామిలీ డాక్టర్.. సరికొత్త ‘జీవన శైలి’ -
APSRTC: ఆర్టీసీలో ఆఫర్లు.. టిక్కెట్లో 25 వరకు శాతం రాయితీ
కడప (వైఎస్ఆర్ జిల్లా): ప్రజా రవాణా సంస్థ ప్రయాణికులను ఆకర్శించేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది. ఇందుకోసం వివిధ రకాల ఆఫర్లను ప్రకటించింది. ప్రయాణికులు ప్రైవేటు ఆపరేటర్ల వైపు వెళ్లకుండా అనేక చర్యలు చేపడుతోంది. మరోవైపు ఆక్యుపెన్సీ రేషియో (ఓఆర్) మెరుగు పరుచుకునేందుకు పాటుపడుతోంది. అలాగే సీనియర్ సిటిజన్ల (వయో వృద్ధులు)కు టిక్కెట్లో 25 శాతం రాయితీ కల్పిస్తోంది. దీంతోపాటు ఇప్పుడు మరికొన్ని రాయితీలను కల్పించింది. నలుగురు ప్రయాణికులు (పిల్లలతోసహా) ఒకేసారి టిక్కెట్ తీసుకుంటే ఛార్జి మొత్తంలో 5 శాతం రాయితీ కల్పించింది. ఇది కుటుంబాలతో కలిసి ప్రయాణం చేసే వారికి లాభదాయకంగా ఉంటుంది. మరోవైపు ఈ–వ్యాలెట్ ద్వారా టిక్కెట్‌ను బుక్ చేసుకుంటే ఛార్జిలో ఐదుశాతం సొమ్ము తగ్గించే వెసులుబాటు కల్పించింది. ప్రయాణికులు రానుపోను టిక్కెట్‌ను ముందుగా రిజర్వు చేసుకుంటే తిరుగు ప్రయాణ ఛార్జిలో పది శాతం తగ్గిస్తోంది. ఈ సదుపాయాన్ని సంక్రాంతి, దసరా వంటి పండుగల సీజన్లలో నడిపే ప్రత్యేక సర్వీసులకు వర్తింపజేస్తోంది. ప్రస్తుతం సంక్రాంతి సీజన్ కావడంతో వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో ప్రయాణికులు రాకపోకలు సాగిస్తారు. దీంతో ప్రయాణికులకు, ఆర్టీసీకి ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. ఆర్టీసీ అధికారులు ఇప్పటికే రానున్న సంక్రాంతికి కడప జోన్‌లోని కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, సత్యసాయి, చిత్తూరు, తిరుపతి జిల్లాల నుంచి 400–450 ప్రత్యేక సర్వీసులను నడపనున్నారు. ఈ బస్సుల్లో రెగ్యులర్ ఛార్జీలే తప్ప మునుపటిలా టిక్కెట్‌పై 50 శాతం అదనపు ఛార్జీలు వసూలు చేయబోమని ఆర్టీసీ అధికారులు ఇప్పటికే ప్రకటించారు. ఆర్టీసీ అందిస్తున్న రాయితీ సదుపాయాలను వినియోగించుకోవాలని కడప జోన్ ఈడీ గోపీనాథ్‌రెడ్డి కోరారు. (క్లిక్ చేయండి: సంక్రాంతి సంబరాలు షురూ.. గిరి పల్లెల్లో మొదలైన సందడి) -
వంట నూనెలపై కేంద్రం కీలక నిర్ణయం, సామాన్యులకు ఊరట
న్యూఢిల్లీ: వంట నూనెలపై రాయితీతో కూడిన కస్టమ్స్ డ్యూటీని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్టు కేంద్ర ఆర్థిక శాఖ ప్రకటించింది. 2023 మార్చి 31 వరకు రాయితీ కస్టమ్స్ సుంకం కొనసాగుతుందని ఆర్థిక శాఖ పరిధిలో పనిచేసే పరోక్ష పన్నుల కేంద్ర మండలి (సీబీఐసీ) ప్రకటించింది. దీనివల్ల దేశీయంగా వంట నూనెల సరఫరా పెరగడమే కాకుండా, ధరలు నియంత్రణలో ఉంటాయని పేర్కొంది. ముడి పామాయిల్, ఆర్బీడీ పామోలీన్, ఆర్బీడీ పామ్ ఆయిల్, ముడి సోయా ఆయిల్, రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్, ముడి పొద్దుతిరుగుడు నూనె, రిఫైన్డ్ పొద్దుతిరుగుడు నూనెపై ప్రస్తుత సుంకాలే కొనసాగుతాయని స్పష్టం చేసింది. ప్రస్తుతం ముడి పామాయిల్, సోయాబీన్ ఆయిల్, సన్‌ఫ్లవర్ ఆయిల్ దిగుమతులపై సుంకాల్లేవు. కాకపోతే 5 శాతం అగ్రి సెస్, దీనిపై 10 శాతం సంక్షేమ సెస్ కలుపుకుని 5.5 శాతం పడుతోంది. రిఫైన్డ్ నూనెలు అయితే, పామాయిల్‌పై 12.5 శాతం, దీనిపై 10 శాతం సామాజిక సంక్షేమ సెస్ కలిపి 13.75 శాతం అమల్లో ఉంది. రిఫైన్డ్ సోయాబీన్ ఆయిల్‌పై ఇది 19.25 శాతంగా అమల్లో ఉంది. వినియోగదారుల ప్రయోజనాల కోణంలో సుంకాల రాయితీని కేంద్రం పొడిగించినట్టు సాల్వెంట్ ఎక్స్ట్రాక్షర్స్ అసోసియేషన్ ఈడీ బీవీ మెహతా తెలిపారు. -
రైళ్ళలో రాయితీలను పునరుద్ధరించాలి
కోవిడ్ మహమ్మారి దేశంపై విరుచుకుపడేంతవరకూ 60 ఏళ్లు పైబడిన వృద్ధులకు రైళ్ళలో రాయితీ అమలులో ఉంది. కోవిడ్ బూచి చూపించి రైళ్లను రద్దు చేసి మళ్లీ పునరుద్ధరించిన తర్వాత... అనేక వర్గాలకు టిక్కెట్ ధరలను పూర్వ విధానంలోనే ఉంచి, 53 కేటగిరీలుగా ఉన్న రాయితీలను 11 కేటగిరీలకు మాత్రమే పరిమితం చేశారు. రోగులకు, దివ్యాంగులకు, మరికొందరికి మాత్రమే పునరుద్ధరిం చారు. అవకాశం దొరికిందని వృద్ధులకిచ్చే రాయితీ సైతం రద్దుచేశారు. దీంతో వృద్ధులకు రాయితీలు పునరుద్ధరించాలని దేశవ్యాప్తంగా డిమాండ్ వ్యక్తమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల రాయితీలపై రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ పార్లమెంట్లో ఒక కీలక ప్రకటన చేశారు. వృద్ధులకు రాయితీ పునరుద్ధరించే ఉద్దేశం లేదని అందులో తేల్చి చెప్పారు. వృద్ధులకు, సౌకర్యాలు, గౌరవం కల్పించడం భారతీయ సంస్కృతి ప్రధాన లక్షణం. అటువంటిది కేంద్రం వృద్ధులకిచ్చే రైల్వే టికెట్ రాయితీని రద్దు చేయడం ద్వారా మన సాంస్కృతిక విలువలను తుంగలో తొక్కు తోంది. పెద్దవాళ్లు చేసే తీర్థయాత్రలు, తప్పనిసరి ప్రయాణాలను ప్రభుత్వ నిర్ణయం భారంగా మార్చింది. (క్లిక్: ఎంత ఖర్చుకు ఎంత ప్రయోజనం?) దేశ వ్యాప్తంగా వెల్లడవుతున్న అసంతృప్తిని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం 70 ఏళ్లు పైబడినవారికి రాయితీ ఇచ్చేందుకు సిద్ధమవుతుందని తెలుస్తోంది. కానీ ఈ కంటి తుడుపు చర్య ఎంతమాత్రం సమర్థనీయం కాదు. కరోనా మహమ్మారికి ముందు ఉన్నట్లే 58 ఏళ్లు దాటిన మహిళలకు, 60 సంవత్సరాలు దాటిన పురుషులకు రాయితీ వర్తింప జేయాలి. (క్లిక్: వృద్ధ భారత్‌కు పరిష్కారమేది?) – డా. టేకుమళ్ళ వెంకటప్పయ్య, నెల్లూరు -
వాహనదారులకు తెలంగాణ సర్కార్ గుడ్‌న్యూస్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం పొడిగించింది. చలాన్లపై రాయితీని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ హోం శాఖ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటివరకు రూ.250 కోట్లు వసూలైనట్లు హోంశాఖ తెలిపింది. చదవండి: రేవంత్‌రెడ్డి చిప్పకూడు తింటావ్.. జాగ్రత్త..! రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు, ఈ అవకాశాన్ని పొడిగించాలని విజ్ఞప్తులు రావడంతో పొడిగించామని వివరించారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి కోరారు. -
మహిళలకు 'మహా' మినహాయింపు.. ఎందులో తెలుసా..?
ముంబై: అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు మహారాష్ట్ర సర్కార్ తీపి కబురు చెప్పింది. మహిళల పేరిట జరిగే ఆస్తుల రిజిస్ట్రేషన్లకు సంబంధించి స్టాంప్ డ్యూటీని ఒక శాతం తగ్గిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఆర్థిక మంత్రి, డిప్యూటీ సీఎం అజిత్ పవార్ ప్రకటించారు. సోమవారం జరిగిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 2021-22 ఆర్ధిక సంవత్సరానికి గానూ మహిళలకు భారీ కేటాయింపులు చేయన్నుట్లు ప్రకటించారు. మహిళలకు ఆస్తుల రిజిస్ట్రేషన్‌లో మినహాయింపు ఇవ్వడం వల్ల ప్రభుత్వ ఖజానాపై రూ.1000 కోట్ల అదనపు భారం పడనుందని వివరించారు. మహిళలకు మహారాష్ట్ర సర్కార్ పెద్దపీట వేస్తుందని, రాష్ట్రంలో అమలవుతున్న మహిళా సంక్షేమ పథకాలే ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. -
వేస్తున్నారు.. ఉల్లికి కళ్లెం
మహారాణిపేట(విశాఖ దక్షిణ), సీతమ్మధార(విశాఖ ఉత్తర): ఉల్లిపాయల డిమాండ్ తగ్గే వరకు అన్ని రైతు బజార్లుకు ఇస్తున్న వారంతపు సెలవులను ప్రభుత్వం తాత్కాలికంగా రద్దు చేసింది. గిరాకీ తగ్గి సాధారణ పరిస్దితులు నెలకొనే వరకు జిల్లాలోని 13 రైతుబజార్లు ప్రతిరోజూ పని చేస్తాయి. సబ్సిడీ ఉల్లి విక్రయాలు నిరంతరం అందుబాటులో ఉంటాయి. మరోవైపు ఒక వ్యక్తే పలుమార్లు లైన్లలో నిల్చొని ఎక్కువ పరిమాణంలో ఉల్లి కొనుగోలు చేస్తుండటంతో మరికొంతమందికి ఉల్లి అందకుండా పోతోంది. దీన్ని నిరోధించేందుకు గుర్తింపు కార్డు ఉన్నవారికే ఉల్లి విక్రయించే పద్ధతి చేపట్టాలన్న ఆలోచన అధికారవర్గాల్లో ఉంది. గోపాలపట్నం రైతుబజార్లో రేషన్ కార్డు, ఇతర గుర్తింపు కార్డు జెరాక్స్ కాపీ తీసుకొని సబ్సిడీ విక్రయాలను ప్రయోగాత్మకంగా సోమవారం ప్రవేశపెట్టినట్లు జాయింట్ కలెక్టర్ టి.శివశంకర్ చెప్పారు. ఇది విజయవంతమైతే అన్ని రైతుబజార్లకు వర్తింపజేస్తామన్నారు. 23 రోజులు.. 410 టన్నులు.. జిల్లాలో గత నెల 16 నుంచి ఇప్పటి వరకు 410 టన్నుల ఉల్లిపాయలు సబ్సిడీ ధరపై విక్రయించారు. సోమవారం ఒక్క రోజే 42165 కిలోల ఉల్లిపాయలు విక్రయించారు. ఇంతవరకు మహరాష్ట్రలోని షోలాపూర్, మన రాష్ట్రంలోని కర్నూలు నుంచి తెప్పిస్తున్న అధికారులు.. డిమాండ్‌ను తట్టుకునేందుకు కె.పి.రకం ఉల్లిని కూడా తెప్పిస్తున్నారు. వీటి ధర ఎక్కువగా ఉండటంతో కిలో రూ.50 రేటుకు రైతుబజార్లలో విక్రయిస్తున్నారు. దీనితోపాటు రూ.25 రకం ఉల్లి విక్రయాలు కూడా కొనసాగుతున్నాయి. నేడూ సీతమ్మధారలో అమ్మకాలు.. ఉల్లి డిమాండ్ తగ్గేవరకు వారాంతపు సెలవులు రద్ద చేయడంతో సీతమ్మధార రైతు బజారు మంగళవారం కూడా పని చేయనుంది. సోమవారం ఈ బజారులో 2925 కిలోల కర్నూలు ఉల్లి రూ.25 రేటుకు అమ్మారు. మధ్యాహ్నం రూ.50 రేటుతో కె.పి.రకం ఉల్లి అందుబాటులోకి తెచ్చారు. రకాల్లో తేడా తెలియక పలువురు వినియోగదారులు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కొద్దిసేపు గందరగోళం నెలకొన్నా పోలీసులు జోక్యం చేసుకొని సర్దుబాటు చేశారు. మరోవైపు మంగళవారం సీతమ్మధార రైతుబజారులో షోలాపూర్ ఉల్లి 3150 కిలోలు మంగళవారం విక్రయించనున్నారు. ఉదయం 6.30 నుంచే విక్రయాలు ప్రారంభమవుతాయని రైతుబాజరు ఈవో వరహాలు తెలిపారు. జనం రద్దీని తట్టుకొని విక్రయాలు సాఫీగా జరిగేందుకు వీలుగా రైతుబజార్లలోని ఉల్లి కౌంటర్ల వద్ద బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు. ప్రతి వినియోగదారుడికి కిలో ఉల్లి అందేలా ఏర్పాట్లు చేస్తున్నామని మార్కెటింగ్ అధికారులు తెలిపారు. -
చెరకు మద్దతు ధర రూ.2,650
కేసీపీ సీవోవో జీ వెంకటేశ్వరరావు ఉయ్యూరు : చెరకు 2016–2017 సీజన్‌కు టన్ను మద్దతు ధర రూ.2650 కేసీపీ యాజమాన్యం ప్రకటించింది. 2017–18 సీజన్‌కు సంబంధించి రాయితీలను పెంచింది. స్థానిక కర్మాగార కాన్ఫరెన్స్ హాల్లో సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎం (కేన్) వీవీ పున్నారావు మద్దతు ధర, ప్రోత్సాహకాలపై చెరకు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, కర్మాగార వ్యవసాయ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి యాజమాన్య నిర్ణయాలను శనివారం వెల్లడించారు. సీవోవో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ చక్కెర కర్మాగారం మద్ధతు ప్రకటించలేదన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తామే తొలిసారిగా టన్ను మద్ధతు ధర రూ.2,650 (రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే రూ.60లు పర్చేజ్ ట్యాక్స్‌తో కలుపుకుని) చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. పంచదారకు మంచి ధర ఉంటే టన్నుకు మరో రూ.50లు పెంచే అవకాశం ఉందని చెప్పారు. తొలుత చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్వీ కృష్ణారావు, ప్రతినిధులు మోటూరి వెంకటేశ్వరరావు, చెన్నుపాటి పూర్ణచంద్రరావు, వింతా శ్రీనివాసరెడ్డి, చాగంటి తిమ్మారెడ్డి, వంగా లింగారెడ్డి, ఎలికారెడ్డి కోటిరెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో మద్దతు ధర రూ.2800 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. రాయితీలు ప్రకటన..! రాయితీలపై సీవోవో జీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సీజన్లో మొక్కతోటకు రూ.10 వేలు రాయితీగా ఇస్తే వచ్చే సీజన్‌కు సబ్సిడీని ఎకరాకు రూ.15 వేలుకు పెంచడం జరిగిందన్నారు. -
ఐఆర్సీటీసీ చార్జీల్లో విద్యార్థులకు రాయితీ
సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఆర్సీటీసీ నడిపే ప్రత్యేక రైళ్ల చార్జీల్లో విద్యార్థులకు 60 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఆర్సీటీసీ ఏర్పాటు చేసే రైళ్ల స్లీపర్ క్లాస్, సెకెండ్‌క్లాస్, జనరల్ బోగీల్లో ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు. కొత్తగా హాల్టింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన జల్పాయ్గురితో సహా దేశమంతటా రాకపోకలు సాగించే ఐఆర్సీటీసీ రైళ్లకు ఇది వర్తిస్తుంది. టూరిజం ప్యాకేజీ ఉన్న రైళ్లకు మినహాయింపు ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు విద్యార్థులు తమ గుర్తింపు పొందిన స్కూల్/కాలేజీ/ ఇతర విద్యా సంస్థల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.