![Telangana Govt Released Go On Concession Of Pending Traffic Challans - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/26/pending.jpg.webp?itok=y3Uy96K8)
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ వాహనదారులకు ప్రభుత్వం గుడ్‌న్యూస్ చెప్పింది. పెండింగ్ ట్రాఫిక్ చలాన్ల రాయితీపై తెలంగాణ సర్కార్ జీవో విడుదల చేసింది. నేటి నుంచే పెండింగ్ చలాన్లపై రాయితీ వర్తింపజేస్తున్నట్లు ఆదేశాలు జారీ చేసింది. బైక్‌లు, ఆటోలకు 80 శాతం.. బస్సులకు 90 శాతం, కార్లు, హెవీ వెహికల్స్‌కు 60 శాతం రాయితీ ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
మంగళవారంనుంచి జనవరి 10వ తేదీ వరకు పెండింగ్ జరిమానాలను రాయితీతో చెల్లించొచ్చు. దీంతో ప్రభుత్వానికి భారీ ఆదా యం రానుంది. దీంతోపాటు పెండింగ్ చలాన్ల పేరిట ట్రాఫిక్ పోలీసులనుంచి ఎదురయ్యే ఇబ్బందునుంచి వాహనదారులకు విముక్తి లభించనుంది.
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో ట్రాఫిక్ రూ ల్స్‌ను అతిక్రమించిన వాహనదారుల జరిమానాలు భారీ మొత్తంలో పేరుకుపోయాయి. ఇటీవల ట్రైసిటీ పరిధిలోని మూడు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లలో పనిచేసే అధికారులు, సిబ్బంది నగరంలోని వాహనదారులనుంచి జరిమానాలను ముక్కుపిండి వసూలు చేశారు. జరిమానాల్లో 50 శాతం చెల్లిస్తేనే వాహనాలను వదిలిపెట్టిన సందర్భాలు ఉన్నాయి. తాజాగా రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన రాయితీ అవకాశాన్ని వాహనదారులు వినియోగించుకుంటే ప్రభుత్వానికి ఆదాయం సమకూరనుంది.
ఇదీ చదవండి: ‘బావ-బావమరిది చెమట కక్కి సంపాదించారా?’
Comments
Please login to add a commentAdd a comment