సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఐఆర్‌సీటీసీ నడిపే ప్రత్యేక రైళ్ల చార్జీల్లో విద్యార్థులకు 60 శాతం రాయితీ ఇవ్వనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో కె.సాంబశివరావు మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐఆర్‌సీటీసీ ఏర్పాటు చేసే రైళ్ల స్లీపర్ క్లాస్, సెకెండ్‌క్లాస్, జనరల్ బోగీల్లో ఈ ఏడాది డిసెంబర్ 14 వరకు ఈ రాయితీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
కొత్తగా హాల్టింగ్ సదుపాయం అందుబాటులోకి వచ్చిన జల్పాయ్‌గురితో సహా దేశమంతటా రాకపోకలు సాగించే ఐఆర్‌సీటీసీ రైళ్లకు ఇది వర్తిస్తుంది. టూరిజం ప్యాకేజీ ఉన్న రైళ్లకు మినహాయింపు ఉందని తెలిపారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొనేందుకు విద్యార్థులు తమ గుర్తింపు పొందిన స్కూల్/కాలేజీ/ ఇతర విద్యా సంస్థల నుంచి ధ్రువీకరణ పత్రాన్ని సమర్పించి టిక్కెట్‌లు బుక్ చేసుకోవచ్చని పేర్కొన్నారు.
ఐఆర్‌సీటీసీ చార్జీల్లో విద్యార్థులకు రాయితీ
Published Wed, Jan 14 2015 5:30 AM | Last Updated on Sat, Sep 2 2017 7:39 PM
Advertisement
Advertisement