సాక్షి, అమరావతి: దక్షిణమధ్య రైల్వే వచ్చే ఏడాది నుంచి ఆధ్యాత్మిక, ఆహ్లాదాన్ని పంచే విధంగా ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్‌సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టూరిజం) కిషోర్ తెలిపారు. గురువారం విజయవాడలోని రైల్వే కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రవాణాతో పాటు భోజన,వసతి సౌకర్యాలతో అతి తక్కువ ధరలకు ప్యాకేజీలను రూపొందించామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణం ఉంటుందన్నారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు.
ప్యాకేజీ వివరాలు ఇలా..
వైబ్రెంట్ గుజరాత్: విజయవాడ నుంచి ఉత్తరభారత దేశ యాత్రలో భాగంగా సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్‌తో పాటు గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం), సబర్మతి ఆశ్రమం, ఆక్షరధామ్ దేవాలయం సందర్శించవచ్చు. పది రాత్రులు, 11రోజుల ప్రయాణంలో స్లీపర్ క్లాస్ ధర రూ.10,400, త్రీ టైర్ ఏసీ రూ.17,330గా నిర్ణయించారు. వచ్చే నెల21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరే రైలు సందర్శనీయ స్థలాలు పర్యటించి 31–01–2022 సాయంత్రానికి గమ్యస్థానానికి చేరుకుంటుంది.
భారత్ దర్శన్ ప్యాకేజీ..
విశాఖపట్నం నుంచి గోవా–హంపీకి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు ఫిబ్రవరి 12వ తేదీన బయలుదేరి 18వ తేదీ (ఆరు రాత్రులు, 7 రోజులు) తిరిగి విశాఖ చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్ ధర రూ.6,620, త్రీ టైర్ ఏసీ రూ.8,090గా నిర్ణయించారు.
ఉత్తరభారత్ దర్శన్..
ఉత్తరభారత్ దర్శన్‌తో పాటు వైష్ణోదేవి దర్శనంతో కలిపి ఆగ్రా, అమృతసర్ స్వర్ణదేవాలయం, హరిద్వార్, మధుర చుట్టి వచ్చేలా ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులతో ప్యాకేజీని తీసుకొచ్చారు. మార్చి 19వ తేదీ రాజమండ్రిలో బయలుదేరే ఈ రైలు తిరిగి 27వ తేదీకి గమ్యస్థానానికి చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్ ధర రూ.8,510, త్రీ టైర్ ఏసీ రూ.10,400గా నిర్ణయించారు.
వీక్లీ తిరుమల: విజయవాడ, రాజమండ్రి–సామర్లకోట నుంచి ప్రతి శుక్రవారం తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనంతో రైలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటి టికెట్ ధర రూ.3220, రూ.3380గా నిర్ణయించామన్నారు. www. irctctourism.com వెబ్‌సైట్‌లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 8287932312లో సంప్రదించాలని సూచించారు.
తీర్థ యాత్రలకు ప్రత్యేక పర్యాటక రైళ్లు
Published Fri, Dec 17 2021 5:28 AM | Last Updated on Fri, Dec 17 2021 5:28 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment