Tourist Trains
-
ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ‘సప్త జ్యోతిర్లింగ దర్శన్’
రైల్వేస్టేషన్ (విజయవాడ పశ్చిమ): ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో ఈ నెల 18న సప్త జ్యోతిర్లింగ దర్శన యాత్ర ప్రత్యేక పర్యాటక రైలు నడపనున్నారు. ఈ విషయాన్ని ఐఆర్సీటీసీ జేజీఎం డీఎస్‌జీపీ కిశోర్ మంగళవారం విజయవాడ రైల్వేస్టేషన్‌లోని ఐఆర్సీటీసీ కార్యాలయంలో విలేకరులకు చెప్పారు. ఈ యాత్రతో పాటు స్టాట్యూ ఆఫ్ యూనిటీ పేరుతో ఏపీ, తెలంగాణలోని యాత్రికుల కోసం ప్రత్యేక రైలు నడపనున్నట్లు తెలిపారు. విజయవాడ నుంచి బయలుదేరే ఈ రైలుకు ఖమ్మం, కాజీపేట, సికింద్రాబాద్, నిజామాబాద్, నాందేడ్, పూర్ణ స్టేషన్ల్లో ఆగనుంది. 12 రాత్రులు, 13 పగళ్లు సాగే ఈ యాత్రలో ఉజ్జయిని, మహాకాళేశ్వర దేవాలయం, ఓంకారేశ్వర జ్యోతిర్లింగ దర్శనం, స్టాట్యూ ఆఫ్ యూనిటీ, ద్వారకాదిస్ దేవాలయం, నాగేశ్వర్ జ్యోతిర్లింగం, సోమనాథ్ జ్యోతిర్లింగం, త్రయంబకేశ్వర్ జ్యోతిర్లింగం, నాసిక్, భీమశంకర్ జ్యోతిర్లింగం దర్శనం, గ్రిషినేశ్వర్ జ్యోతిర్లింగ దర్శనం తదితర పూణ్యక్షేత్రలు, పర్యాటక, చారిత్రక ప్రదేశాలను దర్శించుకోవచ్చు. యాత్రలో ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం, రాత్రి భోజన సదుపాయం, పర్యాటక ప్రదేశాలను దర్శించుకునేందుకు రోడ్డు మార్గంలో రవాణా సదుపాయం, రాత్రుళ్లు బస ఏర్పాట్లు ఉంటాయి. 3 కేటగిరీల్లో ఉండే ఈ ప్యాకేజీలో ఒక్కొక్కరికి ఎకానమీ (స్లీపర్ క్లాస్) రూ. 21,000, స్టాండర్డ్ (3 ఏసీ) రూ.32,500, కంఫర్ట్ (2 ఏసీ) రూ. 42,500 ధరగా నిర్ణయించారు. ఆసక్తి ఉన్న వారు ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదా విజయవాడ కార్యాలయం 8287932312, 9281495848 నంబర్లకు సంప్రదించాలి. -
ఏపీ, తెలంగాణ నుండి భారత్ గౌరవ్ రైలు రేపే ప్రారంభం
ఢిల్లీ: దేశంలోని విశిష్ట ప్రదేశాలు, పుణ్యక్షేత్రాల సందర్శనకు ఉద్దేశించిన ‘భారత్ గౌరవ్’ టూరిస్టు రైలు సర్వీసును దక్షిణ మధ్య రైల్వే పరిధిలో రేపట్నుంచి(శనివారం) ప్రారంభం కానుంది. ఇండియన్ రైల్వేస్ క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) సర్వి స్ ప్రొవైడర్‌గా ఈ రైలు సేవలు కొనసాగనున్నాయి. దీనికి ‘పుణ్యక్షేత్ర యాత్ర– పూరీ–కాశీ–అయోధ్య యాత్ర’గా నామకరణం చేశారు. ఈనెల 18 నుంచి 26 వరకు 8 రాత్రులు, 9 పగళ్లు ఈ యాత్ర కొనసాగనుంది. పూరీ, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య, ప్రయాగ్‌రాజ్ లాంటి పుణ్య క్షేత్రాలను చుట్టిరానుంది. ఈ రైలు 18న మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ స్టేషన్లో బయలుదేరి రెండు తెలుగు రాష్ట్రాల్లోని నిర్ధారిత ముఖ్య స్టేషన్లలో ఆగుతుంది. కాజీపేట, ఖమ్మం, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, విశాఖపట్నం, విజయనగరం స్టేషన్లలో దీనికి హాల్టులుంటాయి. భారత్ గౌరవ్ రైళ్ల యొక్క 26 ట్రిప్పులు 22 రాష్ట్రాలు మరియు 04 కేంద్ర పాలిత ప్రాంతాలను కవర్ చేయనుంది. రైలులోని యాత్రికులు పూరి, కోణార్క్, గయా, వారణాసి, అయోధ్య మరియు ప్రయాగ్‌రాజ్‌లను 9 రోజుల వ్యవధిలో సందర్శించనున్నారు.. రైలు ప్రయాణికులందరికీ ప్రయోజనం చేకూర్చేందుకు, రెండు తెలుగు రాష్ట్రాల్లోని 9 ముఖ్యమైన స్టేషన్లలో బోర్డింగ్ (& డి-బోర్డింగ్) సౌకర్యం కల్పించబడింది. ఈ యాత్ర కోసం అన్ని సీట్లు బుక్ చేయబడ్డాయి, ప్రయాణికులు అన్ని స్టాపింగ్ స్టేషన్ల నుండి సదుపాయాన్ని పొందడంతో మొదటి ట్రిప్‌కు భారీ స్పందన లభించింది. రైలు ప్రయాణీకులకు వారి ప్రయాణ సంబంధిత అవసరాలన్నింటిని చూసుకోవడం ద్వారా రైలు సంపూర్ణ సేవలను అందిస్తుంది. టూర్ ప్యాకేజీలో అన్ని ప్రయాణ సౌకర్యాలు (రైలు మరియు రోడ్డు రవాణాతో సహా), వసతి సౌకర్యం, వాష్ మరియు మార్పు సౌకర్యాలు, క్యాటరింగ్ ఏర్పాట్లు (ఉదయం టీ, అల్పాహారం, లంచ్ మరియు డిన్నర్ - ఆన్-బోర్డ్ మరియు ఆఫ్-బోర్డ్ రెండూ), సేవలు వృత్తిపరమైన మరియు స్నేహపూర్వక టూర్ ఎస్కార్ట్‌లు, రైలులో భద్రత - అన్ని కోచ్‌లలో CCTV కెమెరాల సదుపాయం ఉంది. ఈ రైలు యాత్రలో పూరీ జగన్నాథ ఆలయం, కోణార్క్ సూర్యదేవాలయం, బీచ్, వారణాసిలోని కాశీ విశ్వనాథ దేవాలయం, కారిడార్, కాశీవిశాలాక్షి, అన్నపూర్ణదేవి దేవాలయం, సాయంత్రం గంగా హారతి, అయోధ్య రామ జన్మభూమి, సరయూ నది తీరాన హారతి, ప్రయాగరాజ్ -త్రివేణి సంగమం, హనుమాన్ మందిర్, శంకర్ విమన్ మందిరాలను దర్శించుకునేందుకు అవకాశం ఉందని రైల్వే శాఖ తెలిపింది. గమనిక: భారత్ గౌరవ్ టూరిస్ట్ రైలు యొక్క తదుపరి ట్రిప్ 18 ఏప్రిల్ 2023 నుండి ప్రారంభమవుతుంది. -
‘ప్యాలెస్ ఆన్ వీల్స్’.. రాజ భోగాల ప్రయాణం.. రెండేళ్ల తర్వాత కూత..!
ఇది రైలు మాత్రమే కాదు రాచరికపు ఆనవాళ్లను కళ్లకు కట్టే అద్భుతమైన ప్యాలెస్. రాయల్ ఎక్స్‌ప్రెస్... రాజస్థాన్ రాచరికపు హంగులకు వేదిక. సకల సదుపాయాలనూ పరిచిన పట్టు తివాచీ. ఇండియన్ రైల్వే చేసిన వినూత్న ఆలోచనకు ప్రతిరూపమే ఈ ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’. రాచ మర్యాదలను పొందుతూ, నాటి ముఖ్య ఘట్టాలను కళ్లారా చూస్తూ సాగే ఆ ప్రయాణం మాటల్లో వర్ణించలేని ఓ అద్భుతం. ఈ రైలులో ప్రయాణం జీవితాంతం గుర్తుండిపోయే రాజస్థాన్ రాయల్ అనుభూతి! జైపూర్: కరోనా కారణంగా నిలిచిపోయిన విలాసవంతమైన పర్యాటక రైలు (రాయల్ ట్రైన్) తిరిగి రెండేళ్ల తర్వాత పట్టాలెక్కింది. ‘ప్యాలెస్ ఆన్ వీల్స్’గా పేరుగాంచిన ఈ ట్రైన్‌ను రాజస్థాన్ ముఖ్యమంత్రి అశోక్ గెహ్లోత్ శనివారం గాంధీనగర్ రైల్వే స్టేషన్లో జెండా ఊపి ప్రారంభించారు. గత 40 ఏళ్లగా రాయల్ ట్రైన్ పర్యాటకులను ఆకట్టుకుంటోందని, ఇది ప్రపంచానికే ఒక ఉదాహరణగా నిలుస్తోందని పేర్కొన్నారు. రైలు సేవలను తిరిగి ప్రారంభించటంతో రాష్ట్రంలో పర్యాటక రంగం పుంజుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. రాయల్ ట్రైన్‌ను ప్రారంభించేందుకు ముందు.. అందులోని వసతులపై ఆరా తీశారు సీఎం గెహ్లోత్. ప్రయాణికులకు శుభాకాంక్షలు తెలిపారు. రైలు సర్వీసును తిరిగి ప్రారంభించటం ప్రభుత్వానికి గర్వకారణమని పేర్కొన్నారు. రైలులో అధునాతన సౌకర్యాలను అందుబాటులోకి తీసుకొచ్చినట్లు చెప్పారు. రాష్ట్రంలో పర్యాటక రంగానికి పారిశ్రామిక హోదా ఇచ్చామని, 2022-23 బడ్జెట్లో రూ.1000 కోట్లు కేటాయించినట్లు గుర్తు చేశారు. 40 ఏళ్ల ఘన చరిత్ర..: దేశంలో గత 40 ఏళ్లుగా రాయల్(ప్యాలెస్ ఆన్ వీల్స్) ట్రైన్ సేవలందిస్తోంది. తొలిసారి ఈ రాయల్ ట్రైన్ 1982లో పట్టాలెక్కింది. రైల్ గేజ్‌లను సమయానుసారంగా మారుస్తూ వస్తున్న క్రమంలో రెండో రాయల్ ట్రైన్‌ను 1991లో అందుబాటులోకి తీసుకొచ్చారు. మూడోది 1995లో పట్టాలెక్కినట్లు అధికారులు తెలిపారు. తర్వాత రాజస్థాన్ పర్యాటక అభివృద్ధి కార్పొరేషన్‌తో కలిసి 2009లో అధునాత సౌకర్యాలతో పునరుద్ధరించింది రైల్వే శాఖ. ప్యాలెస్ ఆన్ వీల్స్ అనే భావన కోచ్‌ల్లో రాచరిక నేపథ్యం నుంచి వచ్చింది. వాస్తవానికి రాజ్‌పుత్‌లు, బరోడా, హైదరాబాద్ నిజాం సహా బ్రిటిష్ వైస్రాయ్‌ల వ్యక్తిగత రైల్వే కోచ్‌లుగా వీటిని ఉద్దేశించినట్లు చరిత్ర చెబుతోంది. ఇంటీరియర్ డిజైన్..: ప్రతి బోగిలో ఫర్నిచర్, హస్తకళలు, పెయింటింగ్ వంటి వాటి వాడకం ద్వారా రాష్ట్ర సాంస్కృతిక నైతికతను హైలైట్ చేస్తుంది. జైపూర్‌కు చెందిన నిష్ణాతులైన ఆర్కిటెక్ట్స్ రైలు ఇంటీరియర్స్ డిజైన్ చేశారు. క్యాబిన్ లోపలి పరిసరాలు ఎటు చూసినా రాచరికపు ఫ్యాషన్‌కి చిరునామాలా ఉట్టిపడుతుంటాయి. అలంకరించిన తోలు ఉత్పత్తులు, మృణ్మయపాత్రలు, ఫొటో ఫ్రేమ్‌లు.. మతులు పోగొడతాయి. రాచకళ అడుగడుగునా విస్మయపరుస్తూనే ఉంటుంది. సౌకర్యాలు..: ఈ రాయల్ ట్రైన్లో మొత్తం 23 కోచ్‌లు ఉంటాయి. 104 మంది టూరిస్టులు ఇందులో ఏకకాలంలో ప్రయాణించవచ్చు. ప్రతి కోచ్‌కు రాజ్‌పుత్‌ల పేర్లు పెట్టారు. ఒక్కో బోగీలో లగ్జరీ సౌకర్యాలు, వైఫై ఇంటర్నెట్ వంటివాటితో నాలుగు క్యాబిన్లు ఉంటాయి. ఈ రైలులో ద మహారాజ, ద మహారాణి అనే రెండు రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే.. ఒక బార్ కమ్ లాంజ్, 14 సెలూన్లు, ఒక స్పా ఉన్నాయి. ఏ రూట్లలో వెళ్తుంది..: ఈ రైలు మొత్తం 7 రాత్రులు, 8 రోజుల పాటు ప్రయాణిస్తుంది. న్యూఢిల్లీ నుంచి ప్రారంభమై జైపూర్(రెండో రోజు), సవాయ్ మాధోపుర్, ఛిత్తౌర్గఢ్(మూడో రోజు), ఉదయ్ పూర్(నాలుగో రోజు), జైసల్మేర్(ఐదోరోజు), జోధ్‌పుర్ (ఆరో రోజు), భరత్‌పుర్, ఆగ్రా(ఏడో రోజు), తిరిగి ఎనిమిదో రోజు న్యూఢిల్లీకి చేరుకుంటుంది. ఇదీ చదవండి: రెండుసార్లు ప్రేమలో విఫలం.. విధానసౌధలో బాంబు.. త్వరలో పేలిపోతుందని.. -
తీర్థ యాత్రలకు ప్రత్యేక పర్యాటక రైళ్లు
సాక్షి, అమరావతి: దక్షిణమధ్య రైల్వే వచ్చే ఏడాది నుంచి ఆధ్యాత్మిక, ఆహ్లాదాన్ని పంచే విధంగా ప్రత్యేక పర్యాటక రైళ్లను నడుపుతున్నట్లు ఐఆర్సీటీసీ డిప్యూటీ జనరల్ మేనేజర్ (టూరిజం) కిషోర్ తెలిపారు. గురువారం విజయవాడలోని రైల్వే కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. రవాణాతో పాటు భోజన,వసతి సౌకర్యాలతో అతి తక్కువ ధరలకు ప్యాకేజీలను రూపొందించామన్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగా ప్రయాణం ఉంటుందన్నారు. ప్రత్యేక ఐసోలేషన్ వార్డును సైతం ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ప్యాకేజీ వివరాలు ఇలా.. వైబ్రెంట్ గుజరాత్: విజయవాడ నుంచి ఉత్తరభారత దేశ యాత్రలో భాగంగా సోమనాథ్, ద్వారక, నాగేశ్వర్, బెట్ ద్వారక, అహ్మదాబాద్‌తో పాటు గుజరాత్‌లోని స్టాట్యూ ఆఫ్ యూనిటీ (సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం), సబర్మతి ఆశ్రమం, ఆక్షరధామ్ దేవాలయం సందర్శించవచ్చు. పది రాత్రులు, 11రోజుల ప్రయాణంలో స్లీపర్ క్లాస్ ధర రూ.10,400, త్రీ టైర్ ఏసీ రూ.17,330గా నిర్ణయించారు. వచ్చే నెల21వ తేదీ మధ్యాహ్నం విజయవాడ నుంచి బయలుదేరే రైలు సందర్శనీయ స్థలాలు పర్యటించి 31–01–2022 సాయంత్రానికి గమ్యస్థానానికి చేరుకుంటుంది. భారత్ దర్శన్ ప్యాకేజీ.. విశాఖపట్నం నుంచి గోవా–హంపీకి ప్రత్యేక రైలును ఏర్పాటు చేశారు. ఈ రైలు ఫిబ్రవరి 12వ తేదీన బయలుదేరి 18వ తేదీ (ఆరు రాత్రులు, 7 రోజులు) తిరిగి విశాఖ చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్ ధర రూ.6,620, త్రీ టైర్ ఏసీ రూ.8,090గా నిర్ణయించారు. ఉత్తరభారత్ దర్శన్.. ఉత్తరభారత్ దర్శన్‌తో పాటు వైష్ణోదేవి దర్శనంతో కలిపి ఆగ్రా, అమృతసర్ స్వర్ణదేవాలయం, హరిద్వార్, మధుర చుట్టి వచ్చేలా ఎనిమిది రాత్రులు, తొమ్మిది రోజులతో ప్యాకేజీని తీసుకొచ్చారు. మార్చి 19వ తేదీ రాజమండ్రిలో బయలుదేరే ఈ రైలు తిరిగి 27వ తేదీకి గమ్యస్థానానికి చేరుకుంటుంది. స్లీపర్ క్లాస్ ధర రూ.8,510, త్రీ టైర్ ఏసీ రూ.10,400గా నిర్ణయించారు. వీక్లీ తిరుమల: విజయవాడ, రాజమండ్రి–సామర్లకోట నుంచి ప్రతి శుక్రవారం తిరుపతికి వెంకటేశ్వర స్వామి దర్శనంతో రైలు ప్యాకేజీలు అందుబాటులో ఉన్నాయన్నారు. వీటి టికెట్ ధర రూ.3220, రూ.3380గా నిర్ణయించామన్నారు. www. irctctourism.com వెబ్సైట్లో టికెట్లు బుక్ చేసుకోవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 8287932312లో సంప్రదించాలని సూచించారు. -
మరో రెండు రోజుల్లో స్పెషల్ టూరిస్ట్ ఎక్స్‌ప్రెస్
సాక్షి,న్యూఢిల్లీ: కేంద్ర రైల్వేశాఖ ఆధ్వర్యంలో స్పెషల్ టూరిస్ట్ రైలు పట్టాలెక్కనుంది. ఇండియా శ్రీలంక మధ్య ముఖ్యమైన ప్రదేశాలను కలుపుతూ శ్రీరామాయణ యాత్ర- శ్రీలంక ఎక్స్‌ప్రెస్ టూరిస్టులను అలరించేందుకు సిద్ధంగా ఉంది. నవంబరు 14నుంచి 16 రోజుల యాత్ర మొదలు కానుంది. అలనాటి రామాయణ కాలంనాటి దృశ్యాలను కళ్లకు కట్టే అనుభూతిని ప్రజలకు కల్పించేందుకు భారతీయ రైల్వే ఈ సరికొత్త రైలును పరిచయం చేస్తోంది. 800 సీటింగ్ కెపాసిటీతో శ్రీ రామాయణ యాత్ర- శ్రీలంక పేరిట శ్రీరామాయణ ఎక్స్‌ప్రెస్‌కు మరో రెండురోజుల్లో పచ్చ జెండా ఊపేందుకు రైల్వే అధికారులు సిద్ధంగా ఉన్నారు. ఈ ప్రత్యేక రైలు ద్వారా శ్రీరాముడి జన్మస్థలం అయోధ్య నుంచి కొలంబో దాకా అద్భుతమైన ప్రయాణం సాగుతుందని గోయల్ ఇటీవల ట్విటర్లో వెల్లడించిన సంగతి తెలిసిందే. సందర్శించే ప్రదేశాలు ఢిల్లీ నుంచి బయల్దేరి మొదట అయోధ్యలో ఆగుతుంది. ఆ తరువాత హనుమాన్ గఢీ రామ్‌కోట్, కనక భవన్ ఆలయ ప్రదేశాలకు చేరుతుంది. అనంతరం నందిగ్రామ్, సీతామర్హి, జనక్‌పూర్, వారణాసి, ప్రయాగ్, శ్రింగ్వర్పూర్, చిత్రకూట్, నాసిక్, హంపి ద్వారా రామేశ్వరం చేరుతుంది. ట్రావెల్ ప్యాకేజ్ సమయం: 16 రోజులు ప్యాకేజ్ ధర: ఒక్కొక్కరికి రూ. 15,210, భోజనం, వసతి సదుపాయాలు ఇందులో భాగం. అయితే శ్రీలంక వెళ్లాలనుకొంటే.. ఒక్కొక్కరూ ప్రత్యేక ఛార్జీని చెల్లించాల్సి ఉంటుంది. శ్రీలంక ప్రయాణం శ్రీలంకలోని క్యాండీ, నువారా ఎలియా, కొలంబో, నెగోంబోల మీదుగా కూడా ప్రయాణం సాగుతుంది. అయితే ఇందుకు రూ. 36,970లు అదనం. కాగా శ్రీలంకను ఈ ప్రాంతాల్లో సందర్శించాలనుకునే పర్యాటకులు చెన్నై నుంచి కొలంబోకు విమానంలో ప్రయాణించాల్సి ఉంటుందని భారతీయ రైల్వే వెల్లడించింది. Retracing the Epic Journey of Lord Rama: Indian Railways to introduce a special tourist train 'Shri Ramayana Express' which will cover all the places from Ayodhya to Colombo via Rameshwaram, on the Ramayana circuit.https://t.co/WR9HIYl0ae pic.twitter.com/jcGKeiBz12 — Piyush Goyal (@PiyushGoyal) July 10, 2018 -
ఐఆర్సీటీసీ పర్యాటక రైళ్లు
సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ (ఐఆర్సీటీసీ) వివిధ మార్గాల్లో ప్రత్యేక టూరిస్టు రైళ్లను నడుపనుందని దక్షిణమధ్య రైల్వే ఎస్పీఆర్వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. రామేశ్వరం-కన్యాకుమారి- నాగర్సోయిల్- మధురై మధ్యన, న్యూఢిల్లీ-జైపూర్-ఆగ్రా-మధుర మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. భోజనం, వస తి సదుపాయాలతోపాటు అన్ని సౌకర్యాలను అందజేస్తారు. హైదరాబాద్ నుంచి రామేశ్వరం టూర్ మార్చి 4 నుంచి ప్రారంభమై ఐదు రాత్రులు, ఆరు పగ ళ్లు కొనసాగుతుంది. ఇందుకోసం చార్జీ రూ.16,767. అలాగే ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన హైదరాబాద్-గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది. చార్జీ రూ.20,755. పూర్తి వివరాలకు 9701360701, 9701360647,040-23400606 నంబర్లలో సంప్రదించవచ్చు.