సాక్షి, హైదరాబాద్: పర్యాటక ప్రియుల కోసం ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరి జం కార్పొరేషన్ (ఐఆర్‌సీటీసీ) వివిధ మార్గాల్లో ప్రత్యేక టూరిస్టు రైళ్లను నడుపనుందని దక్షిణమధ్య రైల్వే ఎస్పీఆర్వో షకీల్ అహ్మద్ ఒక ప్రకటనలో తెలిపారు. రామేశ్వరం-కన్యాకుమారి- నాగర్‌సోయిల్- మధురై మధ్యన, న్యూఢిల్లీ-జైపూర్-ఆగ్రా-మధుర మధ్య ఈ రైళ్లు నడవనున్నాయి. భోజనం, వస తి సదుపాయాలతోపాటు అన్ని సౌకర్యాలను అందజేస్తారు.
హైదరాబాద్ నుంచి రామేశ్వరం టూర్ మార్చి 4 నుంచి ప్రారంభమై ఐదు రాత్రులు, ఆరు పగ ళ్లు కొనసాగుతుంది. ఇందుకోసం చార్జీ రూ.16,767. అలాగే ఏడు రాత్రులు, ఎనిమిది పగళ్లతో కూడిన హైదరాబాద్-గోల్డెన్ ట్రయాంగిల్ టూర్ ఫిబ్రవరి 20న ప్రారంభమవుతుంది. చార్జీ రూ.20,755. పూర్తి వివరాలకు 9701360701, 9701360647,040-23400606 నంబర్‌లలో సంప్రదించవచ్చు.
ఐఆర్‌సీటీసీ పర్యాటక రైళ్లు
Published Fri, Jan 30 2015 2:15 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM
Advertisement
Advertisement