సాక్షి, అమరావతి: ఏపీ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఎస్పీడీసీఎల్)లో గత రెండున్నరేళ్లలో చేనేత విద్యుత్ సర్వి సులు పెరిగాయని సంస్థ సీఎండీ కె. సంతోషరావు తెలిపారు. ‘నేతన్నలకు కరెంట్ షాక్’ అనే శీర్షికతో ఈనాడులో వచ్చిన కథనంపై గురువారం ఆయన స్పందించారు. నేతన్నలకు ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలో 2021–22 వరకూ 9,912 విద్యుత్ సర్వీసులు వుండగా, 2022–23 నాటికి ఆ సర్వి సుల సంఖ్య 10,125కు పెరిగిందని.. 2023–24 జూలై నాటికి మొత్తం 10,157 సర్వి సులున్నాయన్నారు.
అయితే, వాస్తవ పరిస్థితులకు విరుద్ధంగా పవర్ లూమ్స్ విద్యుత్ సర్వి సుల సంఖ్య తగ్గినట్లు ఈనాడు కథనంలో రాయడం అవాస్తవమన్నారు. షాక్ ఇస్తే సర్వి సులు ఎలా పెరిగాయని ఆయన ప్రశ్నించారు. చేనేత కార్మికులకు ఇంధన చార్జీల్లో 50 శాతం రాయితీని రాష్ట్ర ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు.
అలాగే, చేనేత కార్మికుల గృహాలకు నెలకు 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందిస్తున్నామని, నేతన్నల అభ్యర్థన మేరకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్‌సీ) కిలోవాట్ హవర్ (కేడబ్ల్యూహెచ్) బిల్లింగ్ విధానానికి అనుమతించిందని తెలిపారు. ఈ ఉత్తర్వులవల్ల మగ్గాలకు సంబంధించిన సర్వీసుల విద్యుత్ బిల్లు కొంతమేరకు తగ్గినట్లు సీఎండీ వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment