సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల రాయితీ గడువును ప్రభుత్వం పొడిగించింది. చలాన్లపై రాయితీని ఏప్రిల్ 15 వరకు పొడిగిస్తున్నట్లు తెలంగాణ హోం శాఖ ప్రకటించింది. పెండింగ్ చలాన్ల ద్వారా ఇప్పటివరకు రూ.250 కోట్లు వసూలైనట్లు హోంశాఖ తెలిపింది.
చదవండి: రేవంత్‌రెడ్డి చిప్పకూడు తింటావ్.. జాగ్రత్త..!
రాష్ట్ర వ్యాప్తంగా రెండు కోట్ల 40 లక్షల చలాన్లు చెల్లింపు జరిగిందని రాష్ట్ర హోం శాఖ మంత్రి మహ్మద్ మహమూద్ అలీ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి తీసుకున్న ఈ నిర్ణయానికి విశేష స్పందన రావడంతో పాటు, ఈ అవకాశాన్ని పొడిగించాలని విజ్ఞప్తులు రావడంతో పొడిగించామని వివరించారు. ఇంతవరకూ చలాన్లు చెల్లించలేకపోయినవారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని రాష్ట్ర హోం మంత్రి కోరారు.
Comments
Please login to add a commentAdd a comment