చెరకు మద్దతు ధర రూ.2,650
చెరకు మద్దతు ధర రూ.2,650
Published Sat, Oct 1 2016 10:32 PM | Last Updated on Mon, Sep 4 2017 3:48 PM
కేసీపీ సీవోవో జీ వెంకటేశ్వరరావు
ఉయ్యూరు :
చెరకు 2016–2017 సీజన్‌కు టన్ను మద్దతు ధర రూ.2650 కేసీపీ యాజమాన్యం ప్రకటించింది. 2017–18 సీజన్‌కు సంబంధించి రాయితీలను పెంచింది. స్థానిక కర్మాగార కాన్ఫరెన్స్ హాల్‌లో సీవోవో జీ వెంకటేశ్వరరావు, జీఎం (కేన్) వీవీ పున్నారావు మద్దతు ధర, ప్రోత్సాహకాలపై చెరకు ఉత్పత్తిదారుల సంఘం ప్రతినిధులు, కర్మాగార వ్యవసాయ విభాగం అధికారులతో సమావేశం నిర్వహించి యాజమాన్య నిర్ణయాలను శనివారం వెల్లడించారు. సీవోవో మాట్లాడుతూ, రాష్ట్రంలో ఏ చక్కెర కర్మాగారం మద్ధతు ప్రకటించలేదన్నారు. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని తామే తొలిసారిగా టన్ను మద్ధతు ధర రూ.2,650 (రాష్ట్ర ప్రభుత్వం చెల్లించే రూ.60లు పర్చేజ్ ట్యాక్స్‌తో కలుపుకుని) చెల్లించేందుకు నిర్ణయించామన్నారు. పంచదారకు మంచి ధర ఉంటే టన్నుకు మరో రూ.50లు పెంచే అవకాశం ఉందని చెప్పారు. తొలుత చెరకు ఉత్పత్తిదారుల సంఘం అధ్యక్షుడు ఎస్‌వీ కృష్ణారావు, ప్రతినిధులు మోటూరి వెంకటేశ్వరరావు, చెన్నుపాటి పూర్ణచంద్రరావు, వింతా శ్రీనివాసరెడ్డి, చాగంటి తిమ్మారెడ్డి, వంగా లింగారెడ్డి, ఎలికారెడ్డి కోటిరెడ్డిలతో నిర్వహించిన సమావేశంలో మద్దతు ధర రూ.2800 ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు.
రాయితీలు ప్రకటన..!
రాయితీలపై సీవోవో జీ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ గత సీజన్‌లో మొక్కతోటకు రూ.10 వేలు రాయితీగా ఇస్తే వచ్చే సీజన్‌కు సబ్సిడీని ఎకరాకు రూ.15 వేలుకు పెంచడం జరిగిందన్నారు.
Advertisement