బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ తన పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జూలై 31వ తేదిన తన పదవికి రాజీనామా చేయనున్నారు. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభమైనప్పటి ఈయనే పదవిలో కొనసాగుతున్నారు. రాహుల్ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో కంపెనీకి తదుపరి ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ నియమితులవుతారు. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది.
‘‘రాహుల్ బజాజ్ 1987లో బజాజ్ ఫైనాన్స్ ప్రారంభమైనప్పటి నుంచి చైర్మన్ పదవిలో ఉన్నారు. గత 5 దశాబ్దాలుగా ఈ గ్రూప్‌నకు వివిధ బాధ్యతల్లో ఆయన సేవలందించారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా రాహుల్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. అయినప్పటికీ రాహుల్ బజాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలు అందించనున్నారు ’’ అని కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది.
4.50శాతం నష్టంతో ముగిసిన షేరు
రాహుల్ బజాజ్ రాజీనామా వార్తల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు 4.31శాతం నష్టంతో రూ.3292.90 వద్ద ముగిసింది. ఒకదశలో 6.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.3220.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది.
Comments
Please login to add a commentAdd a comment