Rahul Bajaj
-
బజాజ్ కుటుంబంలో విషాదం..
ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ కుమార్తె, కమల్‌నయన్ బజాజ్ హాల్ అండ్ ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్ సునైనా కేజ్రీవాల్ (53) మృతి చెందారు. క్యాన్సర్‌తో సుదీర్ఘ పోరాటం తర్వాత శనివారం ఆమె ముంబైలో కన్నుమూశారు.సునైనాకు ఆమె భర్త, ఇద్దరు కుమారులు ఉన్నారు. సునైనా భర్త మనీష్ కేజ్రీవాల్ కేదారా క్యాపిటల్ వ్యవస్థాపకుడు, మేనేజింగ్ పార్ట్నర్. సునైనా గత మూడేళ్లుగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. దాతృత్వం, కళల పట్ల ఆసక్తి ఉన్న ఆమె కమల్‌నయన్ బజాజ్ హాల్, ఆర్ట్ గ్యాలరీ డైరెక్టర్‌గా దేశ ఆర్థిక రాజధానిలో కళారంగాన్ని సుసంపన్నం చేయడంలో కృషి చేశారు.బజాజ్ కుటుంబం ఇప్పటికే దాతృత్వంలో ఉంది. అనేక ఛారిటబుల్ ట్రస్ట్‌లను కలిగి ఉంది. తన భర్త మనీష్‌తో కలిసి సునైనా కేదారా క్యాపిటల్‌ను స్థాపించారు. ప్రైవేట్ ఈక్విటీ సంస్థ 5 బిలియన్ డాలర్ల కంటే ఎక్కువ నిర్వహణలో ఆస్తులను కలిగి ఉంది. -
రాహుల్ బజాజ్ ఇక లేరు
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: ప్రముఖ పారిశ్రామికవేత్త, స్వాతంత్య్ర సమరయోధుడు, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ కన్నుమూశారు. ఆయన వయస్సు 83 సంవత్సరాలు. వృద్ధాప్య సంబంధిత, గుండె, ఊపిరితిత్తుల వ్యాధులతో నెల క్రితం పుణేలోని రూబీ హాల్ క్లినిక్ హాస్పిటల్లో చేరిన ఆయన శనివారం మధ్యాహ్నం 2.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. ఆయన లోటు పూడ్చలేనిదంటూ రాజకీయ, పారిశ్రామిక ప్రముఖులు సంతాపం తెలిపారు. ఆదివారం ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ సంస్కారాలు జరుగనున్నాయి. ఆయనకు ఇద్దరు కుమారులు రాజీవ్, సంజీవ్, కుమార్తె సునైనా కేజ్రివాల్ ఉన్నారు. భారత్‌ను ప్రపంచ పటంలో నిలిపారు రాహుల్‌బజాజ్ 1938 జూన్ 10న జన్మించారు. ఢిల్లీ వర్సిటీ నుంచి ఆర్థిక శాస్త్రంలో బీఏ (ఆనర్స్), ముంబై వర్సిటీ నుంచి న్యాయ శాస్త్రంలో డిగ్రీ, హార్వర్డ్ బిజినెస్ స్కూల్ నుంచి ఎంబీఏ చేశారు. బజాజ్ గ్రూప్ 1926లో ప్రారంభమైంది. జమ్నాలా ల్ బజాజ్ ఈ సంస్థను స్థాపించారు. తన తండ్రి కమల్‌నయన్ బజాజ్ బృందంలో రాహుల్ డిప్యూటీ జనరల్ మేనేజర్‌గా చేరారు. 30 ఏళ్ల వయసులో 1968లో బజాజ్ ఆటో సీఈవో అయ్యారు. రాహుల్ నేతృత్వంలో సంస్థ వృద్ధిబాటన పయనించింది. జపాన్ మోటార్‌సైకిల్ కంపెనీల పోటీని తట్టుకుని బజాజ్ స్కూటర్లను విదేశీ గడ్డపైనా పరుగెత్తించా రు. విభిన్న ఉత్పత్తులతో అంతర్జాతీయ మార్కెట్లో బజాజ్ బ్రాండ్‌ను మెరిపించారు. ఆటోమొబైల్‌తో పాటు సాధారణ, వాహన బీమా, ఇన్వెస్ట్మెంట్స్, కన్సూమర్ ఫైనాన్స్, గృహోపకరణాలు, ఎలక్ట్రిక్ పరికరాలు, పవన విద్యుత్, అలాయ్, స్టెయిన్లెస్ స్టీల్ తదితర రంగాలకు గ్రూప్ అంచెలంచెలుగా విస్తరించింది. రాహుల్ సారథ్యంలో బజాజ్ ఆటో టర్నోవర్ రూ.7.2 కోట్ల నుంచి రూ.12,000 కోట్లకు పెరిగింది. ప్రస్తుతం గ్రూప్‌లో 60 వేల పైచిలుకు ఉద్యోగులున్నట్టు చెబుతారు. 2005లో బజాజ్ ఆటో బాధ్యతలను కుమారుడు రాజీవ్‌కు అప్పగించారు. వరల్డ్ ఎకనమిక్ ఫోరం, ఇంటర్నేషనల్ బిజినెస్ కౌన్సిల్, ఇండియన్ ఎయిర్‌లైన్స్ చైర్మన్‌గా చేశారు. 2021 ఏప్రిల్ 30 దాకా బజాజ్ ఆటో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, చైర్మన్‌గా ఉన్నారు. 2001లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. 2006లో రాజ్యసభకు ఎంపికయ్యారు. ముక్కుసూటి మనిషి.. రాహుల్‌కు నిక్కచ్చిగా, ముక్కుసూటిగా మాట్లాడతారన్న పేరుంది. ప్రభుత్వంపై విమర్శలకూ వెనకాడేవారు కాదు. సొంత కొడుకుతోనూ తలపడ్డ చరిత్ర ఆయనది. విమర్శలను ప్రభుత్వం అణచివేస్తోందంటూ ముంబైలో 2019లో కేంద్ర మంత్రులు అమిత్ షా, నిర్మల సమక్షంలోనే సంచలనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘భయంతో కూడిన ఈ వాతావరణం కచ్చితంగా మా మనస్సుల్లో ఉంటుంది. విమర్శలను మీరు స్వీకరిస్తారన్న నమ్మకం మాకు లేదు’ అంటూ కుండబద్దలు కొట్టారు. స్కూటర్లకు స్వస్తి చెప్పి మోటార్‌సైకిళ్లపై దృష్టి పెట్టాలని కుమారుడు రాజీవ్ నిర్ణయించుకున్నప్పుడు తన నిరాశను బహిరంగంగా వెల్లడించారు. హమారా బజాజ్ బజాజ్ గ్రూప్ అనగానే టక్కున గుర్తొచ్చేది బజాజ్ చేతక్ స్కూటరే. 1972లో బజాజ్ స్కూటర్ మార్కెట్లోకి వచ్చింది. ‘హమారా బజాజ్..’ అంటూ మధ్యతరగతి కుటుంబాలకు చేరువైంది. చేతక్ స్కూటర్ భారతీయ కుటుంబాలకు ఒక ఆకాంక్షగా మారిందంటే అతిశయోక్తి కాదు. బజాజ్ ప్రియ స్కూటర్లు సైతం ఆదరణ పొందాయి. 2006లో బజాజ్ స్కూటర్ల ఉత్పత్తి ఆగిపోయింది. బజాజ్ చేతక్ అర్బనైట్ ఈవీ సబ్‌బ్రాండ్ పేరుతో 2019 అక్టోబర్‌లో ఎలక్ట్రిక్ స్కూటర్లతో రీ–ఎంట్రీ ఇచ్చింది. రాహుల్ కెరీర్ దేశ కార్పొరేట్ రంగం పెరుగుదలకు సమాంతరంగా సాగింది. ఆయన మరణం పారిశ్రామిక ప్రపంచంలో శూన్యాన్ని మిగిల్చింది. – రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వాణిజ్య, పారిశ్రామిక ప్రపంచానికి చేసిన విశేషమైన కృషికి ఆయన ఎప్పటికీ గుర్తుండిపోతారు. గొప్ప సంభాషణకర్త. సమాజ సేవపైనా మక్కువ చూపారు. – ప్రధాని నరేంద్ర మోదీ భారతీయ వ్యాపార ప్రపంచంపై ఆయన పాదముద్రలు ఎప్పటికీ చెరిగిపోవు – మహీంద్రా గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్రా నేను చెప్పలేనంత షాక్‌కు గురయ్యాను. దేశం ఒక గొప్ప పుత్రున్ని, నిర్మాతను కోల్పోయింది. – బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా -
బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్ రాహుల్ బజాజ్ అరుదైన ఫోటోలు
-
రాహుల్ బజాజ్ మృతి... సీఎం వైఎస్ జగన్ సంతాపం
సాక్షి, అమరావతి: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ చైర్మన్ రాహుల్ బజాజ్ (83) మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. వారి కుటుంబ సభ్యులకు ఆయన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. భారత పారిశ్రామిక రంగంలో రాహుల్ బజాజ్ అనేక సేవలనందించారని సీఎం గుర్తు చేశారు. కాగా గత కొద్ది రోజులుగా రాహుల్ బజాజ్ న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో ఫిబ్రవరి 12 శనివారం రోజున మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనను విడుదల చేసింది. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా ఆయన సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా ఆయన పనిచేశారు. రాహుల్ బజాజ్ మృతి పట్ల గవర్నర్ సంతాపం సాక్షి, విజయవాడ: ప్రముఖ పారిశ్రామికవేత్త, బజాజ్ గ్రూప్ మాజీ ఛైర్మన్, పద్మభూషణ్ రాహుల్ బజాజ్ మృతిపైట్ల ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు జమ్నాలాల్ బజాజ్ మనవడు రాహుల్ బజాజ్ దేశంలో ఆటోమొబైల్ రంగం ఉన్నతికి దోహద పడ్డారని వివరించారు. బజాజ్ స్కూటర్‌ను ఆవిష్కరించి దేశంలోని ప్రతి ఇంటికి దానిని చేరువ చేశారన్నారు. మృతుల కుటుంబ సభ్యులకు గవర్నర్ హరి చందన్ తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ మేరకు రాజ్ భవన్ నుంచి ఒక ప్రకటన విడుదల చేశారు. (చదవండి: చంద్రబాబు నిద్రపోవట్లేదు.. నిద్రపోడు కూడా: ఎమ్మెల్యే జోగి రమేష్) -
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ కన్నుమూత..!
ప్రముఖ పారిశ్రామిక వేత్త రాహుల్ బజాజ్ (83) శనివారం రోజున పుణేలో మరణించారు. గత కొద్ది రోజులుగా ఆయన న్యుమోనియా, గుండె సమస్యలతో బాధ పడుతున్నారు. చికిత్స నిమిత్తం నెల రోజులుగా ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆరోగ్యం పూర్తిగా విషమించడంతో సన్నిహిత కుటుంబ సభ్యుల సమక్షంలో 12 ఫిబ్రవరి, 2022 మధ్యాహ్నం 2. 30 గంటలకు తుదిశ్వాస విడిచారని బజాజ్ గ్రూప్ ఒక ప్రకటనను విడుదల చేసింది. గతేడాది ఏప్రిల్‌లో బజాజ్ ఆటో చైర్మన్ పదవికి రాహుల్ బజాజ్ రాజీనామా చేశారు. భారతీయ కార్పొరేట్ పరిశ్రమలో తనదైన ముద్రను వేశారు రాహుల్ బజాజ్. 40 ఏళ్ల పాటు బజాజ్ గ్రూప్ చైర్మన్‌గా సేవలను అందించారు. 2001లో భారత మూడో అత్యున్నత పౌర పురస్కారం పద్మభూషణ్ రాహుల్ బజాజ్‌కు లభించింది. అంతేకాకుండా రాజ్యసభ ఎంపీగా ఆయన పనిచేశారు. నితిన్ గడ్కరీ సంతాపం..! గత ఐదు దశాబ్దాలుగా బజాజ్ గ్రూప్‌కు నాయకత్వం వహించిన రాహుల్జీ పరిశ్రమలో కీలకపాత్ర పోషించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని అందించాలని కేంద్ర రోడ్డు శాఖ మంత్రి నితిన్ గడ్కరీ ట్విటర్లో స్పందించారు. -
బజాజ్ ఫైనాన్స్ లాభాలకు కరోనా షాక్
సాక్షి, ముంబై: కరోనా కల్లోల సమయంలో బజాజ్ ఫైనాన్స్ లిమిటెడ్ (బీఎఫ్ఎల్) నికర లాభం భారీగా పడిపోయింది. జూన్ 30 తో ముగిసిన త్రైమాసికంలో సంస్థ నికర లాభం 19శాతం క్షీణించి 962 కోట్ల రూపాయలకు పడిపోయింది. అంతకుముందు ఏడాది ఇదే క్వార్టర్లో ఇది 1,195 కోట్లుగా ఉంది. కోవిడ్-19 సంక్షోభం తమ వ్యాపార కార్యకలాపాలను దెబ్బతీసిందని ప్రకటించింది. కంపెనీ నికర వడ్డీ ఆదాయం మాత్రం12 శాతం ఎగిసి 3,694 కోట్ల నుంచి 4,152 కోట్లకు పెరిగింది. అలాగే ఆపరేషన్ల ద్వారా వచ్చిన ఆదాయం 15 శాతం పుంజుకుని 6648 కోట్ల రూపాయలను నమోదు చేసింది. 2020, ఏప్రిల్ 30 నాటికి ఏకీకృత మారటోరియం బుక్ 38,599 కోట్ల రూపాయల నుండి 21,705 కోట్లకు తగ్గిందని కంపెనీ స్టాక్ ఎక్స్ఛేంజీలకు తెలియజేసింది. మరోవైపు బజాజ్ ఫైనాన్స్ కంపనీ ఆరంభం(1987) నుంచి ఛైర్మన్‌గా కొనసాగుతున్న రాహుల్ బజాజ్ కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. మూడు దశాబ్దాలకు పైగా సంస్థను అభివృద్దిపథంలో పరుగులు పెట్టించిన ఆయన జూలై 31 నుంచి తన పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. అయితే నాన్-ఎగ్జిక్యూటివ్, నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా తన సేవలను కొనసాగిస్తారు. కంపెనీ వైస్ ఛైర్మన్, రాహుల్ బజాజ్ కుమారుడు ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ బాధ్యతలను స్వీకరించనున్నారు. ఈ నేపథ్యంలో కంపెనీ షేరు 4 శాతం నష్టాలతో ముగిసింది. తండ్రితో సంజీవ్ బజాజ్ (ఫైల్ ఫోటో) -
బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ రాజీనామా
బజాజ్ ఫైనాన్స్ ఛైర్మన్ రాహుల్ బజాజ్ తన పదవి నుంచి వైదొలగేందుకు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు జూలై 31వ తేదిన తన పదవికి రాజీనామా చేయనున్నారు. బజాజ్ ఫైనాన్స్ కంపెనీ ప్రారంభమైనప్పటి ఈయనే పదవిలో కొనసాగుతున్నారు. రాహుల్ రాజీనామా తర్వాత ఆయన స్థానంలో కంపెనీకి తదుపరి ఛైర్మన్‌గా సంజీవ్ బజాజ్ నియమితులవుతారు. ఆగస్ట్ 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కంపెనీ ఎక్చ్సేంజ్‌లకు సమాచారం ఇచ్చింది. ‘‘రాహుల్ బజాజ్ 1987లో బజాజ్ ఫైనాన్స్ ప్రారంభమైనప్పటి నుంచి చైర్మన్ పదవిలో ఉన్నారు. గత 5 దశాబ్దాలుగా ఈ గ్రూప్‌నకు వివిధ బాధ్యతల్లో ఆయన సేవలందించారు. వారసత్వ ప్రణాళికలో భాగంగా రాహుల్ తన పదవి నుంచి వైదొలగనున్నారు. అయినప్పటికీ రాహుల్ బజాజ్ నాన్ ఎగ్జిక్యూటివ్ నాన్ ఇండిపెండెంట్ డైరెక్టర్‌గా కంపెనీకి సేవలు అందించనున్నారు ’’ అని కంపెనీ ఒక ప్రకటలో తెలిపింది. 4.50శాతం నష్టంతో ముగిసిన షేరు రాహుల్ బజాజ్ రాజీనామా వార్తల నేపథ్యంలో బజాజ్ ఫైనాన్స్ షేరు 4.31శాతం నష్టంతో రూ.3292.90 వద్ద ముగిసింది. ఒకదశలో 6.50శాతం నష్టాన్ని చవిచూసి రూ.3220.00 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకింది. -
ఆ మాటలతో.. దేశ ప్రయోజనాలకు విఘాతం
న్యూఢిల్లీ: పారిశ్రామికవేత్తలకు ప్రభుత్వాన్ని పల్లెత్తు మాట అనే దమ్ము లేకుండా పోయిందంటూ వ్యాపార దిగ్గజం రాహుల్ బజాజ్ చేసిన విమర్శలపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందించారు. తమ సొంత అభిప్రాయాలను అందరికీ ఆపాదించడం సరికాదని ఆమె వ్యాఖ్యానించారు. ఇలాంటి విమర్శలు .. జాతి ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తాయని ఆమె పేర్కొన్నారు. ఒక సదస్సులో పాల్గొన్న సందర్భంగా కేంద్ర మంత్రులు పీయూష్ గోయల్, అమిత్ షాల సమక్షంలోనే రాహుల్ బజాజ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే, ఎవరూ దేని గురించీ భయపడాల్సిన అవసరం లేదని, అలాంటి పరిస్థితులేమైనా ఉంటే చక్కదిద్దేందుకు కృషి చేస్తామని షా స్పందించారు. ఈ చర్చాగోష్టి క్లిప్పింగ్‌ను మైక్రోబ్లాగింగ్ సైటు ట్విట్టర్లో పోస్ట్ చేసిన నిర్మలా సీతారామన్.. అన్ని సమస్యలను ప్రభుత్వం పట్టించుకుంటోందని, పరిష్కరించే ప్రయత్నాలూ చేస్తోందని చెప్పడానికి ఇది నిదర్శనమని పేర్కొన్నారు. బజాజ్‌కు ‘బయోకాన్’ షా మద్దతు .. మరోవైపు, రాహుల్ బజాజ్‌కు మద్దతుగా మరో పారిశ్రామిక దిగ్గజం బయోకాన్ చైర్పర్సన్ కిరణ్ మజుందార్ షా స్పందించారు. కార్పొరేట్ సంస్థలను ప్రభుత్వం అంటరానివాటిగా చూస్తోందని, ఎకానమీ గురించి ఏ విమర్శలనూ వినదల్చుకోవడం లేదంటూ ఆమె వ్యాఖ్యానించారు. అటు నిర్మలా సీతారామన్ ట్విట్టర్ పోస్ట్‌లపైనా షా స్పందించారు. కార్పొరేట్ సంస్థలు.. దేశానికి, ప్రభుత్వానికి వ్యతిరేకం కాదని పేర్కొన్నారు. ‘మేడమ్ మేం జాతి వ్యతిరేక, ప్రభుత్వ వ్యతిరేక శక్తులం కాము. ఎకానమీని ప్రబల శక్తిగా తీర్చిదిద్దేందుకు మీరు చేస్తున్న ప్రయత్నాలు విజయ వంతం కావాలనే మేమూ కోరుకుంటున్నాం‘ అని ఆమె ట్వీట్ చేశారు. ఇక, ప్రతిపక్షాలు కూడా ప్రభుత్వం తీరుపై విమర్శలకు దిగాయి. ‘విమర్శించడమనేది జాతి ప్రయోజనాలకు ముప్పు అంటే.. ప్రభుత్వాన్ని పొగిడితేనే దేశ ప్రయోజనాలను కాపాడినట్లవుతుందా’ అంటూ కాంగ్రెస్ నేత, మాజీ కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ట్వీట్ చేశారు. 5 శాతం పెరిగిన ప్రత్యక్ష పన్నుల వసూళ్లు.. న్యూఢిల్లీ: కార్పొరేట్ ట్యాక్స్ రేటును తగ్గించడం వల్ల పన్ను వసూళ్లపై ప్రతికూల ప్రభావమేమీ లేదని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాస్తవానికి ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో నవంబర్ దాకా స్థూలంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు 5 శాతం పెరిగాయని ఆమె తెలిపారు. ట్యాక్సేషన్ చట్ట సవరణ బిల్లు 2019పై లోక్‌సభలో జరిగిన చర్చలో పాల్గొన్న సందర్భంగా.. ప్రత్యక్ష పన్ను వసూళ్లేమీ తగ్గలేదని మంత్రి స్పష్టం చేశారు. సాధారణంగా ప్రత్యక్ష పన్నుల వసూళ్లు ఆఖరు త్రైమాసికంలోనే అత్యధికంగా ఉంటాయని ఆమె చెప్పారు. -
అధిక వాహన ఉత్పత్తే అసలు సమస్య: రాహుల్ బజాజ్
ముంబై: దేశీయ ఆటో రంగంలో ప్రస్తుత సంక్షోభానికి ప్రధాన కారణం ‘‘అధిక ఉత్పత్తి అలాగే అధికంగా స్టాకులు పేరుకుపోవడం’’ అని బజాజ్ ఆటో ఎండీ రాహుల్ బజాజ్ అభిప్రాయపడ్డారు. సంక్షోభానికి ఆర్థిక మందగమన ప్రభావం చాలా స్వల్పమన్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో జీఎస్టీ కోతలు అవసరం లేదన్నారు. ఇటీవల కాలంలో ఆటోమొబైల్ రంగంపై జీఎస్టీ తగ్గించాలని డిమాండ్ వినిపిస్తోన్న సంగతి తెలిసిందే. ఈ నెల 20న జీఎస్టీ కౌన్సిల్ సమావేశంలో కోత విషయమై నిర్ణయం ఉండొచ్చని అంచనాలున్నాయి. ఈ నేపథ్యంలో రాహుల్ వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి. ప్రస్తుతం ఆటో ఇండస్ట్రీ భారత్ 6 నిబంధనలకు అనుగుణంగా మార్పు చెందుతోందని, నవంబర్ నాటికి పరిస్థితులు చక్కబడవచ్చని అంచనా వేశారు. కరెక్షన్ లేకుండా ముందుకే సాగిపోయే పరిశ్రమ ఏదీ ఉండదని ఆయన చెప్పారు. ప్రస్తుతం కంపెనీలన్నీ దాదాపు అంతర్జాతీయ స్థాయిలో విక్రయాలు జరుపుతున్నందున, ఏదో ఒక దేశంలో మందగమనం మొత్తం కంపెనీపై ప్రభావం చూపే స్థితిలేదన్నారు. ఆటో విక్రయాల క్షీణతతో కేవలం 5– 7 శాతం మాత్రమే మందగమన ప్రభావంతో తగ్గి ఉంటాయన్నారు. ప్రతి పరిశ్రమకు ఉత్థానపతనాలు ఉంటాయని, సైకిల్స్ మారేందుకు సమయం పడుతుంటుందని వివరించారు. ఇప్పటి సంక్షోభం ఎప్పుడు ముగుస్తుందో ఎవరూ చెప్పలేరని, కానీ ఇప్పటికైతే జీఎస్టీ కోతల అవసరం లేదని అభిప్రాయపడ్డారు. స్వీయతప్పిదమే: నిజానికి ఆటో రంగంలో ఈ పరిస్థితికి కంపెనీలే ప్రధానకారణమని రాహుల్ విమర్శించారు. కంపెనీలు వృద్ధి అంచనాలు విపరీతంగా వేసుకొని అధిక ఉత్పత్తులు చేశాయన్నారు. లాజిక్ లేకుండా కంపెనీలు తీసుకున్న నిర్ణయాల ఫలితమే ఈ సంక్షోభమని దుయ్యబట్టారు. -
భారత్ ఆర్థిక పరిస్థితి ఆందోళనకరం
సాక్షి, న్యూఢిల్లీ : ‘భారత ప్రస్తుత ఆర్థిక పరిస్థితి చూసి నేను ఆందోళన చెందుతున్నానని చెప్పలేను. అలా అని ఆత్మ సంతృప్తిని కూడా వ్యక్తం చేయడం లేదు. ప్రపంచవ్యాప్తంగా ఎదురు గాలులు వీస్తున్నప్పటికీ మునిగిపోకుండా నీటికి ఉపరితలంపైనే భారత తన తలను ఉంచగలుగుతోంది’ అని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ‘ఎకనమిక్స్ టైమ్స్’కు ఇచ్చిన తాజా ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. ఎంత నర్మగర్భంగా ఆమె మాట్లాడిన దేశ ఆర్థిక పరిస్థితి సవ్యంగా లేదనే విషయం ఆమె మాటల్లోనే అర్థం అవుతోంది. దేశంలోని ఎనిమిది కోట్ల పరిశ్రమల వృద్ధి రేటు 0.2 శాతం ఒక్క జూన్ నెలలోనే పడిపోయింది. అది 50 నెలల కనిష్టస్థాయి కావడం ఆందోళనకరం. 11 ఆటోమొబైల్ కంపెనీల్లో 9 కంపెనీల లాభాలు జూలై నెలలో రెండంకెల శాతం పడిపోవడం మరింత ఆందోళనకరం. ఆటోమొబైల్ అమ్మకాలు గత 9 నెలలుగా వరుసగా పడిపోతున్నాయి. మార్కెట్లో అగ్రస్థానంలో ఉన్న మారుతి కంపెనీ అమ్మకాలు 30 శాతానికి మించి పడిపోవడం అనూహ్య పరిణామం. గత 20 ఏళ్లలో ఎప్పుడూ ఇలా జరగలేదు. దిద్దుబాటు చర్యల్లో భాగంగా పలు ఆటోమొబైల్ కంపెనీలు ఇప్పటికే ఉత్పత్తి నియంత్రణా చర్యలు చేపట్టాయి. ఈ కారణంగా పలు యూనిట్లలో ‘లేఆఫ్’లు ప్రకటించే ప్రమాదం ఉంది. సరకుల అమ్మకాల్లో ఎప్పుడూ ముందుండే హిందుస్థాన్ యూనిలివర్, ఐటీసీ, గోద్రెజ్ లాంటి కంపెనీలు 2019, తొలి త్రైమాసికంలో కేవలం ఒక అంకె వృద్ధిని మాత్రమే సాధించాయి. ఈ తిరోగమన పరిస్థితి ఇప్పట్లో మెరుగయ్యే అవకాశాలు లేవని ‘16 కీలక ఆర్థిక సూచికలు’ సూచిస్తున్నాయి. ‘ఓ పక్క డిమాండ్ లేదు, మరోపక్క ప్రైవేటు పెట్టుబడులు లేవు. ఇక అభివృద్ధి ఎక్కడి నుంచి వస్తుంది? ఆకాశం నుంచి ఊడి పడుద్దా?’ అని బజాజ్ ఆటోస్ చైర్మన్ రాహుల్ బజాజ్ వ్యాఖ్యలు పరిస్థితి తీవ్రతను సూచిస్తున్నాయి. పొదుపు ఖాతాల సొమ్ము గత ఐదేళ్ల కాలంలో భారీగా పడిపోవడం కూడా ఆర్థిక ప్రమాద ఘంటికే. ఈ సొమ్ము 2013–14 ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 22 శాతం ఉండగా, ఈ ఆర్థిక సంవత్సరంలో జీడీపీలో 17 శాతానికి పడిపోయింది. దేశంలో నిరుద్యోగ సమస్య క్రమంగా పెరుగుతుండడం వల్ల ఉద్యోగాలు చేసే యువత సంఖ్య తగ్గుతూ వారిపై ఆధారపడి బతికే వారి సంఖ్య పెరుగుతూ వస్తోందని, సహజంగా ఇలాంటి పరిస్థితుల్లోనే పొదుపు ఖాతా సొమ్ము పెరుగుతుంది. అలా జరగడం లేదంటే పరిస్థితి ఊహించిన దానికన్నా తీవ్రంగా ఉన్నట్లు లెక్క. మరోపక్క కేంద్ర ప్రభుత్వం బడ్జెట్ అంచనాలు భారీగా పడిపోతుండడం కూడా ఆందోళనకరమే. ఈ ఏడాది పన్ను వసూళ్ల వృద్ధి 18.3 శాతం ఉంటాయని నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రతిపాదనల్లో అంచనా వేయగా, మొదటి ఆర్థిక సంవత్సరంలో కేవలం 1.4 శాతం వృద్ధి మాత్రమే సాధ్యమైంది. అనుకున్న లక్ష్యాన్ని సాధించాలంటే మిగతా కాలంలో 22.3 శాతం వృద్ధి రేటును సాధించాలి. ఆర్థిక పరిస్థితి మందగించిందని ‘నీతి ఆయోగ్’ సీఈవో అమితాబ్ కాంత్ శుక్రవారం ఆందోళన వ్యక్తం చేయడం కూడా ఇక్కడ గమనార్హం. ఇలాంటి పరిస్థితుల్లో దేశ ఆర్థిక వ్యవస్థను ఐదు లక్షల కోట్ల డాలర్లకు తీసుకెళతామన్న ప్రధాని నరేంద్ర మోదీ సవాల్ నెరవేరడం ఏమోగానీ ప్రపంచంలోనే ఐదవ బలమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఆవిర్భవిస్తుందన్న ఆశ నెరవేరడం కూడా కనా కష్టమే. -
ఆర్బీఐకు స్వతంత్రత అవసరం
ముంబై: ఆర్బీఐ స్వయంప్రతిపత్తికి ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ బాసటగా నిలిచారు. కేంద్ర ప్రభుత్వం ఇంత వరకూ ఉపయోగించని సెక్షన్ 7 ద్వారా తన నిర్ణయాలను ఆర్బీఐపై రుద్దే ప్రయత్నం చేయరాదని ఆయన సూచించారు. ఈ నెల 19న జరిగే ఆర్బీఐ భేటీ సందర్భంగా ఆర్బీఐ, ప్రభుత్వం తమ మధ్య దూరాన్ని తొలగించుకుంటాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు. ఒకవేళ సెక్షన్ 7ను ప్రభుత్వం ప్రయోగిస్తే, గవర్నర్ ఉర్జిత్ పటేల్‌కు రాజీనామా చేయడం తప్ప మరో మార్గం లేదన్నారు. ‘‘ప్రభుత్వం తన నిర్ణయాలకే కట్టుబడి ఉంటే విషయం వెడెక్కుతుంది. ఆర్బీఐ లేదా ఉర్జిత్ పటేల్ కూడా తమ వాదనకే కట్టుబడి ఉంటే, ప్రభుత్వం సెక్షన్ 7ను ప్రయోగించినట్టయితే... పటేల్ రాజీనామా చేస్తారని అనుకుంటున్నా’’ అని రాహుల్ బజాజ్ పేర్కొన్నారు. గురువారం ముంబైలో జమ్నాలాల్ బజాజ్ అవార్డుల కార్యక్రమం సందర్భంగా మీడియాతో తన అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రభుత్వం–ఆర్బీఐ మధ్య వివాదం మంచిది కాదు ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం, సెంట్రల్ బ్యాంకు మధ్య వివాదం మంచిది కాదని ఆర్బీఐ బోర్డు సభ్యుడు ఎస్ గురుమూర్తి అన్నారు. పలు అంశాలపై ఇటీవల కేంద్రం, ఆర్బీఐ మధ్య పొరపొచ్చాలు వచ్చిన నేపథ్యంలో గురుమూర్తి వ్యాఖ్యలకు ప్రాధాన్యం ఏర్పడింది. ఢిల్లీలో జరిగిన ఓ కార్యక్రమంలో భాగంగా ఆయన మాట్లాడుతూ... మొండి బకాయిల విషయంలో ప్రొవిజన్లకు సంబంధించి కఠిన నిబంధనలను బ్యాంకులపై రుద్దడం వల్ల బ్యాంకింగ్ రంగంలో సమస్యలకు దారితీస్తుందని అభిప్రాయం వ్యక్తం చేశారు. బేసెల్ క్యాపిటల్ అడెక్వెసీ నిబంధనల్లో పేర్కొన్న పరిధికి మించి భారత్ వెళ్లకూడదన్నారు. -
ఘనత చెప్పుకోవడం ప్రచారం కాదు: హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఓ వ్యక్తి తాను సాధించిన ఘనతలు, సాధించిన పురస్కారాల గురించి చెప్పుకోవడం, ఆ పురస్కారాలను ప్రచారం కోసం వాడుకోవడం వేర్వేరని ఉమ్మడి హైకోర్టు స్పష్టం చేసింది. బజాజ్ గ్రూపు సంస్థల చైర్మన్ రాహుల్ బజాజ్, అందులో తాను పద్మభూషణ్ అవార్డు గ్రహీతనని పిటిషన్లో చెప్పుకోవడం తప్పుకాదంది. ఆ అవార్డును వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని కోరుతూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. ఈ మేరకు న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ ఇటీవల తీర్పు వెలువరించారు. విజయవాడకు చెందిన నాగోతు సత్యానారాయణ సత్య డిజిటల్స్ పేరుతో ఫ్లెక్సీ ప్రింటింగ్ వ్యాపారం చేస్తున్నారు. తనపై నమోదు చేసిన కేసులో రాహుల్ బజాజ్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారని, అందులో తనకొచ్చిన పద్మభూషణ్ పురస్కారం గురించి ప్రస్తావించారని, దీనిని పరిగణనలోకి తీసుకుని ఆ పురస్కారాన్ని వెనక్కి తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలంటూ సత్యనారాయణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ సి.ప్రవీణ్‌కుమార్ విచారణ జరిపారు.పిటిషనర్ చేసిన అభ్యర్థనను ఆమోదించడం లేమంటూ అతని పిటిషన్‌ను కొట్టేస్తున్నట్లు తన తీర్పులో పేర్కొన్నారు. -
జీడీపీ వృద్ధి.. అంత గొప్పగా ఏమీ లేదు!!
బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ న్యూఢిల్లీ: గత ఆర్థిక సంవత్సరంలో సాధించిన 7.1 శాతం స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి రేటు మిగతా సంపన్న దేశాల కన్నా అధికంగానే కనిపిస్తున్నప్పటికీ.. అంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదని వ్యాపార దిగ్గజం బజాజ్ ఆటో చైర్మన్ రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. గత 4–5 ఏళ్లుగా చెప్పుకోతగ్గ పెట్టుబడులేమీ రాకపోవడం, బ్యాంకుల్లో మొండి బకాయిల భారంతో కొత్త రుణాలు పుట్టక ప్రైవేట్ రంగం కూడా ఇన్వెస్ట్ చేయలేకపోతుండటం.. వీటన్నింటికీ పెద్ద నోట్ల రద్దు కూడా తోడవడం మొదలైనవి వృద్ధి మందగించడానికి కారణాలని ఆయన పేర్కొన్నారు. ‘2016–17లో ప్రోత్సాహకరమైన దేశ ఆర్థిక వృద్ధి గణాంకాలతో నా ప్రసంగం మొదలుపెట్టాలనుకున్నాను. కానీ వృద్ధి నేను అనుకున్నంత ప్రోత్సాహకరంగా ఏమీ లేదని తాజా గణాంకాలన్నీ నిశితంగా పరిశీలించడం మొదలుపెట్టాక తెలిసింది’ అని 2016–17 వార్షిక నివేదికలో షేర్హోల్డర్లను ఉద్దేశించి రాహుల్ బజాజ్ వ్యాఖ్యానించారు. ‘కేంద్రీయ గణాంకాల సంస్థ తాజా లెక్కల ప్రకారం 2016–17లో 7.1 శాతంగా నమోదైన వృద్ధి నిస్సందేహంగా సంపన్న దేశాలు, చైనా వంటి వర్ధమాన దేశాల కన్నా కూడా ఎక్కువే. కాదనను. కానీ అంతకు ముందు ఆర్థిక సంవత్సరం సాధించిన 7.9 శాతం కన్నా ఇది తక్కువే‘ అని పేర్కొన్నారు. స్థిరంగా 7.5–8 శాతం వార్షిక వృద్ధి రేటు సాధించడానికి ఇంకా చాలా కాలం పట్టేస్తుందని బజాజ్ తెలిపారు. -
ప్రభుత్వ బ్యాంకులను లూటీ చేస్తున్నారు
⇒ ఈ సొమ్మంతా పన్ను చెల్లించినవాళ్లదే ⇒ బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: కొత్త వ్యాపార ఆలోచన, పోటీతత్వానికే ప్రపంచం విలువ ఇస్తుందని బజాజ్ గ్రూప్ హెడ్ రాహుల్ బజాజ్ అన్నారు. శుక్రవారమిక్కడ ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ) గ్రాడ్యుయేషన్ డే కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసి ఆయన మాట్లాడారు. బృందం కలిసికట్టుగా సాధించనిది ఈ ప్రపంచంలో లేదని విద్యార్థులను ఉద్దేశించి చెప్పారు. ‘సమగ్రత, అభిరుచి, దృష్టి, సమర్థత, నిబద్ధత, నిర్ణయాలు, ధైర్యం, మానవత్వం వంటి గుణాలు విజయానికి సోపానం. ఈ సుగుణాలు కలిగిన ఉద్యోగులున్న కంపెనీ వినియోగదార్లకు ప్రియమైనది. అలాగే పోటీ కంపెనీలకు దడ పుట్టిస్తుంది. ప్రతిభ చూపిన కంపెనీలే పోటీ ప్రపంచంలో నిలుస్తాయి’ అని అన్నారు. ఆదాయమెందుకు తక్కువ..? భారతీయుల సగటు ఆదాయం ఎందుకు తక్కువ ఉంది అని రాహుల్ బజాజ్ ప్రశ్నించారు. ‘70వ దశకం ప్రారంభంలో భారత్‌కు సమానంగా ఉన్న సింగపూర్, దక్షిణ కొరియా, చైనాలు ఇప్పుడెందుకు మించిపోయాయి. 1970–90 కాలంలో తప్పుదోవ పట్టించిన పారిశ్రామికీకరణే ఇందుకు కారణం. పబ్లిక్ సెక్టార్లో వనరులను వృధా చేశారు. అదే సమయంలో ప్రైవేటు రంగాన్ని ఎదగనీయలేదు. సబ్సిడీల భారం ఎకానమీపై గుదిబండగా మారింది. ప్రభుత్వాల అవినీతి క్రమేపీ పెరిగింది. ఆ సమయంలో ప్రభుత్వాలు కనీస సౌకర్యాలు కల్పించలేని స్థితికి వచ్చాయి. ప్రభుత్వాల అసమర్థత, అవినీతి ప్రభావంతో పన్ను ఎగవేతలు పెరిగాయి. దీంతో నిజాయితీ గలవారికి దుష్ప్రయోజనాలు, అవినీతిపరులకు ప్రయోజనం కలిగింది’ అని అన్నారు. బ్యాంకులను దోచుకున్నారు.. కార్మిక, పన్ను చట్టాల మూలంగా ప్రైవేటు రంగంలోని 90% మంది ఉద్యోగులు అవ్యవస్థీకృత రంగంవైపు వెళ్లారని బజాజ్ తెలిపారు. ‘ఈ పరిణామంతో పోటీతత్వం పోయింది. నాణ్యత పడిపోయింది. కార్మికులకు తక్కువ వేతనాలు ఉన్నాయి. తక్కువ ఉత్పాదకత, పనితీరు ద్రవ్యలోటుకు కారణమైంది. ఇన్ఫ్రా రంగంలో పెట్టుబడులు తగ్గిపోయాయి’ అని అన్నారు. ఉద్యోగుల సహకారంతో ప్రభుత్వ రంగ బ్యాంకులను రాజకీయ నాయకులు, వ్యాపారులు దోచుకుంటున్నారని ఘాటుగా వ్యాఖ్యానించారు. దీంతో మొండి బకాయిలు పెరిగాయని అన్నారు. నిజాయితీగల వ్యక్తులు పన్ను రూపంలో చెల్లించిన మొత్తమే దోపిడీకి గురవుతోందని స్పష్టం చేశారు. నిజాయితీకి ప్రోత్సాహం..: నియంత్రణలను సడలించి ప్రభుత్వం నుంచి ఉత్తమ పాలనను వ్యాపారులు కోరుకుంటున్నారని బజాజ్ గ్రూప్ హెడ్ అభిప్రాయపడ్డారు. ‘సమర్థులు, నిజాయితీపరులను ప్రోత్సహించాలి. అసమర్థులు, అవినీతిపరులను శిక్షించాలి. నల్లధనం కట్టడి, నేరస్తులు ఎన్నికల్లో పోటీచేయకుండా అడ్డుకట్ట వేయాలి. కేంద్రం, రాష్ట్రాల్లో ఒకేసారి ఎన్నికలను నిర్వహించాలి’ అని పేర్కొన్నారు. -
'ఏదోటి చేయండి లేదా చావుకు సిద్ధపడండి'
న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణ కాలుష్యం పెరిగిపోవడం పట్ల ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాబ్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. హస్తినలో వాయుకాలుష్యం ప్రమాదకర స్థాయిచేరుకుందని, దీన్ని తగ్గించడానికి చర్యలు చేపట్టకుంటే చావడానికి సిద్ధంగా ఉండాలంటూ ఘాటుగా వ్యాఖ్యానించారు. 'కాలుష్యాన్ని అరికట్టేందుకు చేపట్టే ఏ చర్యనైనా స్వాగతించాల్సిందే. మంచి పనులు చేయాలనుకున్నప్పుడు కొన్ని ఇబ్బందులు తప్పవు. వీటిని భరించకపోతే కాలుష్యం బారిన పడి చనిపోడం ఖాయం. పొగమంచుతో ప్రాణాలు పోతాయి' అని రాహుల్ బజాజ్ అన్నారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు జనవరి 1 నుంచి ప్రైవేటు వాహనాలను నెలలో 15 రోజులు మాత్రమే రోడ్లపైకి అనుమతిస్తామని ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) ప్రభుత్వం చేసిన ప్రతిపాదనకు ఆయన మద్దతు పలికారు. కేజ్రీవాల్ మంచి ఉద్దేశంతోనే ఈ ప్రతిపాదన చేశారని అన్నారు. 'కారు పూల్'ను ప్రోత్సహించాలన్నారు. 'కారు యజమానులు సైకిల్ పై వెళ్లమని లేదా బస్సులో వెళ్లాలని నేను చెప్పడం లేదన్నారు. మీరు ఆఫీసుకు వెళ్లేటప్పుడు మీ స్నేహితుడిని కారులో తీసుకెళ్లండి లేదా మిమ్మల్ని పికప్ చేసుకోమని మీ స్నేహితులకు చెప్పండి. ఒక రోజు మీ కారులో, మరొక రోజు మీ స్నేహితుడి కారులో వెళ్లండి' అని రాహుల్ బజాజ్ సూచించారు. -
మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోంది
రాహుల్ బజాజ్ తీవ్ర విమర్శలు న్యూఢిల్లీ : నరేంద్ర మోదీ ప్రభుత్వ ప్రభ మసకబారుతోందని ప్రముఖ పారిశ్రామికవేత్త రాహుల్ బజాజ్ తీవ్రంగా విమర్శించారు. కొత్త నలధన చట్టం ప్రజలను ఇబ్బందులకు గురిచేయడానికే పనికివస్తుందని నిప్పులు చెరిగారు. ప్రతీకారం తీర్చుకునే భావనతోనే దీనిని రూపొందించినట్లుగా ఉందని చెప్పారు. గతంలో నరేంద్ర మోదీకి వీరాభిమాని అయిన రాహుల్ బజాజ్ ఇప్పుడు ఈ స్థాయిలో విమర్శించడం విశేషం. ప్రభుత్వం తన ప్రయత్నాలకు తానే అడ్డంకులు సృష్టించుకుంటోందని పేర్కొన్నారు. ఎన్డీటీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. కొత్త నల్లధన చట్టం ప్రకారం విదేశీ ఆస్తులున్నవాళ్లు వాటి వివరాలను వెల్లడించాల్సి ఉంటుందని, ఇలా వెల్లడి చేస్తే భవిష్యత్తులో విచారణ నుంచి విముక్తి పొందే గ్యారంటీ ఏదీ లేదని వివరించారు.