
బజాజ్ ఫిన్‌సర్వ్
క్రెడిట్ కార్డు లిమిట్ అయిపోయిందా? ఈఎంఐ పద్ధతిలో ఐఫోన్, ఎల్‌ఈడీ టీవీ వంటి వస్తువులను కొనుగోలు చేయాలనుకుంటున్నారా? దీనికి రుణం కోసం వెతుకుతున్నారా? అయితే ఇంకేం ఏ షాప్స్‌కు వెళ్లనవసరం లేకుండానే బజాజ్ ఫైనాన్స్ మీకు రుణాన్ని అందిస్తోంది. కేవలం ‘బజాజ్ ఫిన్‌సర్వ్’ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకొని మీ అర్హతలకు తగిన రుణాన్ని పొంది, మీకు నచ్చిన ప్రొడ క్ట్‌లను ఇంటికి పట్టుకెళ్లిపోవచ్చు. ‘బజాజ్ ఫిన్‌సర్వ్’ యాప్‌ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి ఉచితంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
ప్రత్యేకతలు
⇒ దేశంలోనే తొలి ఇన్‌స్టంట్ ఈఎంఐ ఫైనాన్స్ అప్రూవల్ యాప్ ఇదని కంపెనీ పేర్కొంటోంది. .
⇒ ఎప్పుడైనా, ఎక్కడి నుంచైనా ఈఎంఐ ఫైనాన్స్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
⇒ డ్యూరబుల్స్, ఎలక్ట్రానిక్స్, గ్యాడ్జెట్స్, ఫర్నిచర్, మొబైల్స్ వంటి పలు ఉత్పత్తులు కొనుగోలు చేయవచ్చు.
⇒ వడ్డీ లేని ఈఎంఐ. లోన్ ముందస్తు క్లోజింగ్ చార్జీలు ఉండవు. ప్రి–పేమెంట్ చార్జీలు కూడా లేవు.
⇒ రూ.3 లక్షల వరకు రుణానికి వెంటనే ఆమోదం పొందొచ్చు.
⇒ ఇదివరకు కస్టమర్లు వారి రుణం సమాచారం, పేమెంట్ వివరాలు వంటివి తెలుసుకోవచ్చు.