ఎన్‌బీఎఫ్‌సీ రంగానికి చెందిన బజాజ్ ఫైనాన్స్ కంపెనీ మార్కెట్ క్యాప్ మంగవారం దేశీయ అతిపెద్ద ప్రభుత్వరంగ బ్యాంక్ ఎస్‌బీఐ మార్కెట్ క్యాప్‌ను అధిగమించింది. మార్కెట్ ముగింపు తర్వాత ఇరు కంపెనీల మార్కెట్ క్యాప్‌లను పరిశీలిస్తే..., బజాజ్ ఫైనాన్స్ మార్కెట్ క్యాప్ రూ.1.76లక్షల కోట్లుగా నమోదవగా, ఎస్‌బీ మార్కెట్ క్యాప్ రూ.1.71లక్షల కోట్లుగా ఉంది.
ఈ క్రమంలో భారత్‌లో అత్యధిక మార్కెట్ క్యాప్ కలిగిన టాప్-100 కంపెనీల్లో బజాజ్ ఫైనాన్స్ 12వ స్థానానికి చేరుకోగా, ఎస్‌బీఐ 13వ స్థానానికి దిగివచ్చింది. మార్కెట్ క్యాప్ విషయంలో రిలయన్స్ ఇండస్ట్రీస్ అగ్రస్థానంలో కొనసాగుతుండగా, టీసీఎస్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, హెచ్‌యూఎల్, భారతీ ఎయిర్‌టెల్, హెచ్‌డీఎఫ్‌సీ, ఇన్ఫోసిస్, కోటక్ మహీంద్రా, ఐసీఐసీఐ బ్యాంక్, టీసీఎస్ కంపెనీలు టాప్-10లో కొనసాగుతున్నాయి.
బజాజ్ ఫైనాన్స్ షేరు 2016లో లిస్ట్ అయ్యి అదే ఏడాది 40శాతం పెరిగింది. 2017లో 109శాతం, 2018లో 51శాతం, 2019లో 60శాతం ర్యాలీ చేసింది. మొత్తం మీద లిస్ట్ అయిన నాటి నుంచి షేరు ఏకంగా 712శాతం లాభపడింది. అయితే కరోనా ప్రేరేపిత లాక్‌డౌన్‌తో మారిటోరియం విధింపు తర్వాత ఎన్‌పీఏల మరింత పెరగవచ్చనే అందోళనలతో ఈ షేరు ఏడాది ప్రారంభం నుంచి 33శాతం నష్టాన్ని చవిచూసింది.
మరింత అప్‌ట్రెండ్‌కు అవకాశం: బ్రోకరేజ్‌లు
ప్రముఖ బ్రోకరేజ్ సంస్థ హెచ్‌ఎస్‌బీసీ ఈ షేరు ఇటీవల ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది. అలాగే టార్గెట్ ధరను రూ.3700గా నిర్ణయించింది. నిన్నటి ముగింపు ధర(రూ.2841.85)తో పోలిస్తే నిర్ణయించిన టార్గెట్ ధర 30శాతం అప్‌సైడ్ పోటెన్షియల్‌ను కలిగి ఉంది. మరో బ్రోకరేజ్ సంస్థ జియోజిత్ ఫైనాన్షియల్ సర్వీస్ కూడా బజాజ్ ఫైనాన్స్ షేరుకు ‘‘బై’’ రేటింగ్‌ను కేటాయించింది.
Comments
Please login to add a commentAdd a comment