
న్యూఢిల్లీ: ఎయిర్‌కూలర్లు, ఇతర అప్లయెన్సెస్ దిగ్గజం సింఫనీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 86 శాతం జంప్‌చేసి రూ. 39 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 21 కోట్లు మాత్రమే ఆర్జించింది.
మొత్తం ఆదాయం సైతం 35 శాతంపైగా ఎగసి రూ. 277 కోట్లను తాకింది. దేశీ విభాగం నుంచి రూ. 198 కోట్లు లభించింది. గతేడాది క్యూ3లో రూ. 205 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 32 శాతం పెరిగి రూ. 243 కోట్లకు చేరాయి. కాగా.. షేరుకి రూ. 2,000 ధర మించకుండా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది.
ఫలితాల నేపథ్యంలో సింఫనీ షేరు బీఎస్‌ఈలో 8.5 శాతం దూసుకెళ్లి రూ. 1,047 వద్ద ముగిసింది.
Comments
Please login to add a commentAdd a comment