Symphony
-
సింఫనీ లాభం హైజంప్
న్యూఢిల్లీ: ఎయిర్‌కూలర్లు, ఇతర అప్లయెన్సెస్ దిగ్గజం సింఫనీ లిమిటెడ్ ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2022–23) మూడో త్రైమాసికంలో ప్రోత్సాహకర ఫలితాలు సాధించింది. కన్సాలిడేటెడ్ ప్రాతిపదికన అక్టోబర్–డిసెంబర్(క్యూ3)లో నికర లాభం 86 శాతం జంప్‌చేసి రూ. 39 కోట్లకు చేరింది. గతేడాది(2021–22) ఇదే కాలంలో రూ. 21 కోట్లు మాత్రమే ఆర్జించింది. మొత్తం ఆదాయం సైతం 35 శాతంపైగా ఎగసి రూ. 277 కోట్లను తాకింది. దేశీ విభాగం నుంచి రూ. 198 కోట్లు లభించింది. గతేడాది క్యూ3లో రూ. 205 కోట్ల టర్నోవర్ నమోదైంది. అయితే మొత్తం వ్యయాలు 32 శాతం పెరిగి రూ. 243 కోట్లకు చేరాయి. కాగా.. షేరుకి రూ. 2,000 ధర మించకుండా 10 లక్షల ఈక్విటీ షేర్లను తిరిగి కొనుగోలు(బైబ్యాక్) చేసేందుకు బోర్డు అనుమతించినట్లు కంపెనీ వెల్లడించింది. ఇందుకు రూ. 200 కోట్లు వెచ్చించనున్నట్లు తెలియజేసింది. ఫలితాల నేపథ్యంలో సింఫనీ షేరు బీఎస్ఈలో 8.5 శాతం దూసుకెళ్లి రూ. 1,047 వద్ద ముగిసింది. -
సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల విరాళం 11.90 కోట్లు...
న్యూఢిల్లీ: కరోనాపై పోరు బాటలో సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు పీఎం–కేర్స్ ఫండ్‌కు రూ.11.90 కోట్ల విరాళం ఇవ్వనున్నారు. దాదాపు 29,600 మంది ఉద్యోగులు తమ రెండు రోజుల వేతనాన్ని ఫండ్‌కు ఇవ్వాలని నిర్ణయించినట్లు బ్యాంక్ వర్గాలు తెలిపాయి. సింఫనీ సహాయం..: కాగా కోవిడ్–19పై పోరాటంలో భాగంగా గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వానికి 1000 ఎయిర్ కూలర్లను సరఫరా చేయాలని ప్రముఖ ఎయిర్ కూలింగ్ కంపెనీ సింఫనీ నిర్ణయించింది. ఆసుపత్రులు, క్వారంటైన్ సెంటర్లు, ఇతర హెల్త్‌కేర్ సెంటర్లలో ఈ ఎయిర్ కూలర్లను గుజరాత్ ఆరోగ్యశాఖ వినియోగించనుంది. -
సింఫనీ ‘టచ్ రేంజ్’ ఐదు కొత్త కూలర్లు
హైదరాబాద్: ప్రపంచపు అతిపెద్ద ఎయిర్ కూలర్ బ్రాండ్ ‘సింఫనీ’ తాజా గా రెసిడెన్షియల్ విభాగంలో ‘టచ్ రేంజ్’ శ్రేణిలో ఐదు కూలర్లను మార్కెట్లోకి తీసుకువచ్చింది. వీటి సామర్థ్యం 20 లీటర్లు నుంచి 110 లీటర్లు మధ్యలో ఉంటుందని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. వీటిల్లో టచ్‌స్క్రీన్ ప్యానెల్, వాయిస్ అసిస్ట్, మాస్కిటో రిపిలెంట్ టెక్నాలజీ, స్వచ్ఛమైన గాలి కోసం ఐ–ప్యూర్ సాంకేతికత, 4 సైడ్ కూలింగ్ ప్యాడ్స్ వంటి పలు ప్రత్యేకతలు ఉన్నాయని పేర్కొంది. కొత్త ఆవిష్కరణల్లో తాము ఎప్పుడూ ముందుంటామని కంపెనీ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ అచల్ బకేరి తెలిపారు.